Health Benefits Of Coriander: కొత్తిమీర వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే ఒక ఆకు. ఇది వంటకు రుచిని, సువాసనను అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి హానికరమైన వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. అయితే కొత్తిమీరు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే వివరాలు తెలుసుకుందాం.
కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్యలాభాలు:
✤ యాంటీఆక్సిడెంట్ గుణాలు:
ఆరోగ్యనిపుణుల ప్రకారం కొత్తిమీరలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా కెంఫెరోల్, బీటా- కెరోటిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్‌లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. కాబట్టి కొత్తిమీరను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
✤ అధిక పోషకాల:
కొత్తిమీరలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా విటమిన్ ఎ, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు ఎముకల ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగుపరచడానికి, మెదడు పనితీరుకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
✤ డయాబెటిస్ సమస్యకు:
కొత్తిమీర డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అధిక షుగర్ లెవల్స్‌తో బాధపడేవారు ప్రతిరోజు ఒక కొత్తిమీర జ్యూస్ తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
✤ గుండెకు మేలు:
అధిక రక్తపోటు, గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే కొత్తిమీరను డైట్‌లో చేర్చుకోవడం చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
✤ జీర్ణక్రియవ్యవస్థత:
కొత్తిమీర జ్యూస్ కడుపు నొప్పి, గ్యాస్ ఇతర సమస్యలను కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ ప్రేగును శుభ్రం చేస్తుంది. దీని జీర్ణవ్యవస్థత మెరుగుపడుతుంది.
✤ రోగనిరోధక శక్తి:
కొత్తిమీర లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్‌లు ఎక్కువగా లభిస్తాయి. ఇది తరచుగా ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుందని వ్యాధులు చెబుతున్నారు. కాబట్టి మీ ఆహారంలో కొత్తిమీరను చేర్చుకోండి.
✤ వ్యర్థాలను తొలగిస్తుంది:
కొత్తిమీర జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు తొలగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర లో ఉండే క్లోరోఫిల్ డిటాక్సిఫికేషన్ చేయడంలో సహాయపడుతుంది.
✤ చర్మ సంరక్షణ: కొత్తిమీరలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సంబంధింత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా దద్దుర్లు ను తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకులను పేస్ట్‌గా తయారు చేసుకొని ముఖాన్నికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.