Friday, September 20, 2024
Homeహెల్త్Detox diet: డిటాక్స్ డైట్ ఎప్పుడైనా ట్రై చేశారా?

Detox diet: డిటాక్స్ డైట్ ఎప్పుడైనా ట్రై చేశారా?

పండుగల సందళ్లు ముగిశాయి. పండగ భోజనాల ఫన్ అయిపోయింది. శరీరాన్ని డిటాక్స్ చేసుకునే సమయం ఇది. అందుకు కొన్ని డిటాక్సు ఫుడ్స్ మీకోసం…

- Advertisement -

 పండ్లు, కూరగాయల జ్యూసులు తాగడం మంచిది. వీటిల్లో తక్కువ కాలరీలు ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరానికి కావలసినంత నీరు అందుతుంది. దీంతో లోపల ఉన్న మలినాలు, విషపదార్థాలన్నీ బయటకు పోతాయి. ఈ జ్యూసులు మానసికంగా, శారీరకంగా మీకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి. నీటిని ఎక్కువ తాగడం వల్ల కూడా శరీరంలో పేరుకున్న ఎక్స్ ట్రా కొవ్వు, చక్కెరలు బయటకు వచ్చేస్తాయి. రోజూ రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగితే శరీరం బాగా డిటాక్స్ అవుతుంది. కొబ్బరినీళ్లు, పలచటి మజ్జిగ కూడా శరీరానికి ఎంతో మంచి చేసే సహజసిద్ధమైన డ్రింకులు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకొని ఆ నీళ్లను తాగితే కూడా శరీరానికి ఎంతో మంచిది. శరీరంలోని మలినాలు బయటకుపోవడమే కాదు రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది.

 ఆకుకూరలు, కాయగూరలు తినడం వల్ల కూడా శరీరంలోని మలినాలుపోతాయి. శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కావలసినంత డైటరీ ఫైబర్ ని ఇవి శరీరానికి అందిస్తాయి. పాలకూర, క్యాబేజీ, బ్రకోలీ, మొలకలు తింటే మంచిది.

 టొమాటోలు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా తోడ్పడతాయి. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు, ఇతర ఫైటోకెమికల్స్ మీ డైట్ ను మరింత ఆరోగ్యకరమైందిగా చేస్తాయి.

 నట్స్, గింజల్లో ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ కణాలను యాక్టివ్ గా పనిచేసేట్టు చేస్తాయి. అంతేకాదు సాధారణ కణాలను కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు, విటమిన్లు శరీరంలోని కాలుష్యకారకాలను బయటకు పంపేస్తాయి. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి.

 తేనెలో యాంటీబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో డిటాక్స్ ప్రోసెస్ ను సులభతరం చేస్తుంది కూడా. శరీరానికి అవసరమయే ఖనిజాలు, విటమిన్లు అంటే బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీసు, థియమైన్ వంటివి ఇందులో ఉన్నాయి. అందుకే రోజూ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోయి శరీరం ఎంతో శక్తివంతగా ఉంటుంది.

 కీరకాయలు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీటిని కూడా ఇవి డిటాక్స్ చేస్తాయి. ఇందులో పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. అవి శరీరంలోని మలినాలను, కాలుష్య పదార్థాలను మూత్రనాళం ద్వారా బయటకు పంపేస్తాయి.

 పెరుగు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. శరీరానికి హాని చేసే విషపదార్థాలను ఇది బయటకు పంపేస్తుంది. ఇలా డిటాక్స్ డైట్ తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News