Saturday, May 4, 2024
Homeహెల్త్Summer diet: సమ్మర్ యాక్నేకి ఈ డైట్ తో చెక్

Summer diet: సమ్మర్ యాక్నేకి ఈ డైట్ తో చెక్

సీజన్ ఫ్రూట్స్, వెజిటబుల్ తింటే..

వేసవి ప్రతాపం మొదలైంది. సీజన్ బట్టి స్కిన్ కేర్ లో కూడా మార్పులు ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో చాలామంది యాక్నేతో బాధపడుతుంటారు. డైట్ ద్వారా యాక్నే సమస్యను పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో పగలు ఎక్కువగా ఉండడమే కాదు ఎక్కువ సమయం బయట గడుపుతాం మనం. వీటితో చెమట, ఉక్కబోత, ఇరిటేషన్ వంటి చర్మ సంబంధ సమస్యలను చిన్నా పెద్దా బాగా ఎదుర్కొంటుంటారు. యాక్నే కూడా అలాంటిదే. వయసుతో పాటు ఈ సమస్య ఎదురవుతుంటుంది.
అంతేకాదు హార్మోన్ సమస్యల వల్ల కూడా మనల్ని వేసవిలో యాక్నే బాగా ఇబ్బంది పెడుతుంది. అలాగే బయట కాలుష్యం వల్ల కూడా యాక్నే బారిన పడతాం. అంతేకాదు గ్రీసీ క్రీమ్స్, సెల్ ఫోన్స్, హెల్మెట్స్, మెడపై టైట్ కాలర్స్ వంటి వాటి వల్ల కూడా యాక్నే సమస్య తలెత్తుతుంది. అయితే మీరు తీసుకునే డైట్ కూడా యాక్నేను నిరోధించడంలో, తగ్గించడంలో సైతం కీలకంగా వ్యవహరిస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. యాక్నేపై మీరు తీసుకునే ఆరోగ్యకరమైన డైట్ ఎంతో శక్తివంతంగా పోరాడుతుంది.

- Advertisement -

యాక్నేను నిరోధించడంలో జామ, బొప్పాయి పండ్లు ఎంతో బాగా పనిచేస్తాయి. వీటి నిండా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ రాకుండా ఈ పండ్లల్లోని విటమిన్ సి ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండ్ల ల్లోని పదార్థాలను పలు స్కిన్ కేర్ సిరమ్స్ లలో కూడా వాడడం గమనించవచ్చు. పైగా విటమిన్ సి ఎంతో శక్తివంతమైన యాంటాక్సిడెంట్. అది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మకాయల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పైగా ఆరోగ్యపరంగా, అందం పరంగా వేసవిలో ఈ పండు అందించే మేళ్లు ఎన్నెన్నో. కొన్ని స్టడీల్లో తేలిందేమిటంటే ఎక్కువ పీచుపదార్థాలున్న సెరిల్స్ ను రోజూ బ్రేక్ ఫాస్ట్ గా 30 గ్రాములు తింటే అది యాక్నే నివారణలో మంచి ఫలితం చూపిస్తుందని వెల్లడైంది కూడా. అంతేకాదు ఇది డైటరీ గ్లైసమిక్ లోడ్ ను తగ్గిస్తుంది.

పీచుపదార్థాలు శరీరానికి బాగా వెళ్లాలంటే యాపిల్స్, కారట్లు, ఓట్మీల్, బీన్స్ తినడం చాలా మంచిది. ఇలా తినడం వల్ల ఫైబర్ ఇంటేక్ శరీరంలో బాగా పెరిగి జీర్ణశక్తి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే శెనగలు తినడం వల్ల కూడా యాక్నే తగ్గుతుంది. ఈ గింజల్లో కూడా యాంటాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిల్లో యాంటిఇన్ఫ్లమేటరీ సుగుణాలతో పాటు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంతేకాదు ఇవి పిహెచ్ బ్యాలెన్సర్ గా కూడా పనిచేస్తాయి. చర్మం యొక్క సెబమ్ ఉత్పత్తిని ఇవి క్రమబద్ధీకరిస్తాయి. శెనగలను సలాడ్ లో వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంచిది కూడా. సంప్రదాయ భారతీయ వంటకాల్లో కూడా శెనగలను బాగా వాడతారు. సలాడ్స్, టొమాటోల్లో లికొపెనె అనే యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడమే కాకుండా, వీటిల్లో విటమిన్ ఎ, కె, సి, కూడా ఉంటాయి. ఇవి యాక్నేను బాగా పోగొడతాయి. అంతేకాదు చర్మ నాణ్యతను కూడా బాగా పెంచుతాయి. అలాగే గుమ్మడి గింజలు కూడా చర్మానికి అందించే మేళ్లు ఎన్నో. గుమ్మడి గింజల్లో నియాసిన్, బేటాకెరొటెనె, రిబొఫ్లేవిన్, బి6, ఫోలేట్స్ ఉంటాయి. ఇవి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. అంతేకాదు యాక్నే చికిత్సలో సైతం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గుమ్మడి గింజల్లో కూడా యాంటాక్సిడెంట్లు బాగా ఉన్నాయి. వాటితో పాటు జింక్, ఫైబర్లు కూడా ఈ గింజల్లో ఎక్కువే. అలాగే పెరుగు, మొక్కల ఆధారిత పాలు అంటే బాదంపాలు, సోయా పాలు లను కూడా యాక్నే ఫైట్ డైట్ లో చేర్చవచ్చు. ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడం ద్వారా కూడా యాక్నేను పెరుగు నియంత్రిస్తుంది.

ఒక కప్పుడు పెరుగు తింటే ముఖంపై మొటిమలు రావు. అంతేకాదు వేసవి కాలంలో శరీరంలోని ఉష్ణతాపాన్ని సైతం పెరుగు బాగా తగ్గిస్తుంది. జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. వేసవిలో యాక్నే పాలబడకుండా ఉండడానికి మరో సింపుల్ టిప్ ఉంది. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగడం
వల్ల చర్మంలోని బాక్టీరియా, మలినాలన్నీ బయటకు పోవడమే కాకుండా చర్మ రంధ్రాలు మూసుకుపోవడం సైతం బాగా తగ్గుతుంది. నీళ్లు బాగా తాగడం వల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలు తగ్గుతాయి. వేసవిలో యాక్నే రిస్కు బారిన కూడా పడము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అందమైన చర్మం కోసం వేసవిలో కొన్ని రకాల ఫుడ్స్ ను కూడా తినకూడదు. ముఖ్యంగా సుగర్స్, సుగరీ డ్రింకులు తాగకూడదు. ఎక్కువ గ్లైసిమిక్ లోడ్ ఉన్న సిరీల్స్ ను కూడా దూరం పెట్టాలి. పాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తీసుకోకూడదు. చాకొలేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వంటి వాటిని కూడా టచ్ చేయకూడదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News