Makhana For Diabetes: డయాబెటిస్..దీని మధుమేహం, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈరోజుల్లో డయాబెటిస్ సాధారణ సమస్యలలో ఒకటిగా మారింది. నేటి బిజీ లైఫ్, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా పిల్లల నుంచి పెద్దల దాకా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ రోగానికి ఎలాంటి చికిత్స లేదు. కేవలం దీని అదుపులో ఉంచుకోవడమే మార్గం. ఈ రోగంతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రతలు తీసుకోవాలి. ఏది పడితే అది అసలు తినకూడదు. కేవలం షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచే ఆహారాలను తమ డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఈ వ్యాధి ఉన్నవారు ముఖాన తినొచ్చా..? తింటే శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
డయాబెటిస్ రోగులకు మఖానా మంచిదా?
మఖానా అనేది పోషకాహార నిధి అని పిలువబడే డ్రై ఫ్రూట్. దీని ఆహారంలో చేర్చుకుంటే మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మఖానా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. దీనితో పాటు, మఖానాలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని మధుమేహానికి మంచివిగా పరిగణిస్తారు. ఇవి షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి ఎంత సహాయపడతాయి.
Also Read: Liver Health: మీ లివర్‌ను రిపేర్ చేసే సూపర్ ఫుడ్స్..
మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రక్తపోటు
మఖానాలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడి
ఇందులో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో, మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
ఎముకలు
ఎముకలు బలహీనంగా ఉన్నవారు మఖానా ను ఆహారంలో చేర్చుకోవాలి. మఖానా కాల్షియం మంచి మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
చర్మం
ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతాయి. పైగా ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి.


