Sunday, November 16, 2025
HomeTop StoriesWeight Loss Drink: బరువు తగ్గాలనుకుంటున్నారా..? రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగండి!

Weight Loss Drink: బరువు తగ్గాలనుకుంటున్నారా..? రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగండి!

Healthy Weight Loss Drink: ఈరోజుల్లో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ఊబకాయం ఒకటి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, గంటలు తరబడి కూర్చొని వర్క్ చేయడం దీని ప్రధాన కారణాలు. అయితే కొంతమంది ఉపకాయాన్ని తగ్గించడానికి జిమ్ కు వెళ్లి గంటల తరబడి చమటలు తీస్తారు. మరికొందరు తీసుకునే ఆహారంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. అయినా కూడా బరువు తగ్గడంలో ఎలాంటి ఫలితం ఉండదు. బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం చేయడం మాత్రమే కాదు నిద్రలో శరీర జీవ క్రియ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కావున రాత్రిపూట కొన్ని డ్రింక్స్ తాగితే బరువు సులభంగా తగ్గవచ్చు. ఇవి తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే కొవ్వు కరుగుతుంది. మరి బరువు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు తాగాల్సిన కొన్ని డ్రింక్స్ గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

పసుపు పాలు: పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. నిద్రను మెరుగుపరుస్తాయి. పడుకునే ముందు గోరువెచ్చని పసుపు పాలు తాగితే కొవ్వును తగ్గిస్తుంది.

మెంతి నీరు: రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చని మెంతి నీరు తాగితే జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కొవ్వును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

అల్లం టీ: అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును కాల్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. పడుకునే ముందు ఒక కప్పు అల్లం టీ తాగితే బరువు సులభంగా తగ్గవచ్చు.

నిమ్మకాయ నీరు: నిమ్మకాయ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. తేనె కొవ్వును కరిగిస్తుంది. పడుకునే ముందు దీన్ని తాగడం జీవక్రియను చురుకుగా ఉంచుతుంది.

జీలకర్ర నీరు: రాత్రిపూట నీటిలో మరిగించిన ఒక టీస్పూన్ జీలకర్రను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో కొవ్వు నిల్వ తగ్గుతుంది.

కలబంద రసం: పడుకునే ముందు ఒక కప్పు తాజా కలబంద రసం తాగడం వల్ల శరీరం విషాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

గ్రీన్ టీ: దీనిలో ఉండే కాటెచిన్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. జీవక్రియను పెంచుతాయి. ఇది నిద్రలో కూడా కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది.

త్రిఫల నీరు: గోరువెచ్చని నీటితో కలిపిన ఆయుర్వేద త్రిఫల పొడిని తాగడం వల్ల శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు.

దాల్చిన చెక్క టీ: దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. రాత్రిపూట దీన్ని తాగడం వల్ల కొవ్వు నిల్వను నివారిస్తుంది. నిద్రలో కొవ్వును కాల్చేస్తుంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad