Bad Cholesterol Foods: నేటి బిజీ లైఫ్ వల్ల చాలామంది బిపి, షుగర్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్లు ప్రధాన కారణాలు. అయితే, చెడు కొలెస్ట్రాల్ కూడా సరైన జీవనశైలి లేకపోతే వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ధమనుల గోడలపై పేరుకు పోతుంది. దీనివల్ల ధమనులు గట్టిగా, ఇరుకుగా మారుతాయి. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీంతో గుండెకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి స్ట్రోక్, గుండే జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి సమస్య రాకూడదంటే డైట్ లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. దీని ద్వారా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా గుండె సమస్యలను సైతం తగ్గించవచ్చు. ఈ నేపథ్యంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడే 5 ఇంటి నివారణల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వెల్లుల్లి
దాదాపు అందరి ఇళ్ల వంట గదిలో వెల్లుల్లి ఉండే ఉంటుంది. దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగిస్తాం. ఇది ఆహార రుచిని పెంచడం కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గించడానికి అత్యంత ప్రభావంతమైన నివారణగా పని చేస్తుంది. ఇందులో ఉండే అల్లిసిన్ మూలకం ధమనునలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. రోజుకు ఒకటి నుండి రెండు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల జీవక్రియ సైతం మెరుగుపడుతుంది. కొవ్వు పేరకపోవడం తగ్గుతుంది. గ్రీన్ టీ గుండెపోటు స్ట్రోక్, ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read: Health: భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు ఇవే.. చేశారంటే అంతే సంగతులు!
పసుపు
పసుపు వంట గదిలో ముఖ్యమైన ఆహార పదార్థం. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీనిలో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తాన్ని పలుచగా చేయడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా పసుపు సిరల్లో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ను తగ్గించడానికి పనిచేస్తుంది
ప్రతిరోజు ఫస్ట్ పాలు తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అవిసె గింజలు
అవిసె గింజలు సైజులో చిన్నగా ఉన్న లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను బలోపేతం చేయడంలో ఎంతో సహాయ పడతాయి. కొలెస్ట్రాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవిసె గింజలలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని పొడిగా తయారు చేసి నీరు లేదా పెరుగుతో కలిపి తినవచ్చు.
ఉసిరి
ఉసిరి విటమిన్ సి గొప్ప మూలం. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. చెడు కులశాలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారంలో ఉసిరి భాగం చేసుకుంటే ధమనుల గోడలు బలపడతాయి. అంతేకాకుండా కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఒక ప్రభావవంతమైన గృహ నివారణ.


