Friday, September 20, 2024
Homeహెల్త్Eggs in Fridge?: ఫ్రిజ్ లో కోడి గుడ్లా?

Eggs in Fridge?: ఫ్రిజ్ లో కోడి గుడ్లా?

ఫ్రిజ్ లోని గుడ్లు బయటకు తీశాక ఎక్కువ సేపు బయట ఉంచరాదు

గుడ్లను ఫ్రిజ్లో పెట్టకూడదా..?
ఇటీవల చేసిన ఒక స్టడీలో గుడ్లను ఫ్రిజ్ లో భద్రం చేయకూడదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఫ్రిజ్ లో గుడ్లను భద్రం చేసిన తర్వాత వాటిని రూమ్ టెంపరేచర్ లో ఉంచితే ప్రమాదకరమైన బాక్టీరియా వాటిల్లో వృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. ఎన్నో పోషకాల నిధి అయిన గుడ్డును ట్రేతో ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటిని అనారోగ్యకరమైన పద్ధతిలో అందరూ వినియోగించుకున్నట్టు పరిశోధకులు ఈ స్టడీలో పేర్కొన్నారు.

- Advertisement -

ఆరోగ్య నిపుణులు మాత్రం గుడ్లను రూమ్ టెంపరేచర్ లో ఉంచడమంత మంచి పని మరొకటి లేదని గట్టిగానే చెప్తున్నారు. గుడ్లను తీసికెళ్లి ఫ్రిజ్ లో చల్లటి టెంపరేచర్ లో ఉంచడం వల్ల రుచి ఉండవు. అంతేకాదు వాటిని తీసికెళ్లి ఫ్రిజ్ లో పెట్టడం వల్ల గుడ్డు షెల్ పై బాక్టీరియా పెంపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తమ స్టడీలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ బాక్టీరియా షెల్ నుంచి గుడ్డు లోపలికి ప్రవేశిస్తుందంటున్నారు. దీంతో ఆ గుడ్లు పాడయి దాన్ని తినే పరిస్థితి ఉండదు. ఈ స్టడీనే కాదు గతంలో గుడ్లపై చేసిన ఇలాంటి ఎన్నో స్టడీల్లో కూడా ఎగ్స్ ను గది ఉష్ణోగ్రతలో భద్రం చేస్తేనే మంచిదని పేర్కొనడాన్ని కూడా ఈ స్టడీని నిర్వహించిన పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.

గుడ్లను రిఫ్రిజిరేటర్ లో ఉంచి ఆ తర్వాత రూమ్ టెంపరేచర్ లో పెట్టడం వల్ల గుడ్డు పెంకుపై బాక్టీరియా పెరిగే అవకాశాలు బాగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. అలా పెంకు మీద చేరిన బాక్టీరియా గుడ్డులోకి కూడా ప్రవేశిస్తుందిట. అలాంటి గుడ్లు వినియోగానికి మంచివి కాదని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే నిపుణులు గుడ్లను రూమ్ టెంపరేచర్ లో ఉంచితేనే శ్రేయస్కరం అని తేల్చిచెపుతున్నారు. బాగా చల్లగా ఉండే రిఫ్రిజిరేటర్ లో గుడ్లను పెట్టడం వల్ల వాడకానికి బాగుండదని కూడా అంటున్నారు. అయితే రూమ్ టెంపరేచర్ లో ఎక్కువ కాలం పెట్టడం వల్ల గుడ్లలోని ప్రొటీన్ లక్షణాలు కోల్పోతామని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

గుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటి మాయిశ్చర్ సురక్షితగా ఉండడమే కాకుండా వాటి ప్రొటీన్ విలువలను కూడా కోల్పోతామని చెపుతున్నారు. రూమ్ టెంపరేచర్ లో వాటిని ఉంచడం వల్ల బయట తరచూ ఉష్ణోగ్రతలలో తలెత్తే మార్పులతో గుడ్లు ఎక్కువ కాలం ఉండవు. రసాయన కాంపౌడ్లతో రూపుదిద్దుకునే గుడ్లు బయట ఎక్కువ రోజులు ఉంచితే దెబ్బతింటాయి కూడా. చల్లటి ఉష్ణోగ్రతలు గుడ్లు దెబ్బతినకుండా దీర్ఘకాలం ఉండేలా చేస్తాయని, అందుకే ఫ్రిజ్ లో గుడ్లను పెట్టడం వల్ల వాటి షెల్ఫ్ లైఫ్ పెరుగుతుందని కూడా కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే గుడ్లను రూమ్ టెంపరేచర్
లో ఉంచినపుడు కన్నా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల రెండు నుంచి మూడు వారాల దాకా పాడవకుండా ఉంటాయంటున్నారు.

స్టోర్ లో కొన్న గుడ్లను మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకోవాలని చెపుతున్నారు. ఫ్రిజ్ లో ఎక్కువ కాలం గుడ్లను ఉంచడం వల్ల ఫ్రిజ్ లోని విపరీత చల్లదనానికి అవి చేదు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు అంటున్నారు. పైగా చల్లని గుడ్లు బేకింగ్ కు పనికిరావని, వాటిని వాడడం వల్ల రెసిపీలు కూడా పాడవుతాయని చెప్తున్నారు. అందుకే గుడ్లను ఫ్రిజ్ లో కాకుండా గది ఉష్ణోగ్రతలో ఉంచితేనే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా అనేది చిన్న నీటి టెస్టుతో తేలిపోతుందని చెపుతున్నారు.

ఒక గిన్నెలో నిండుగా నీరు తీసుకుని అందులో గుడ్లు వేసి చూడండి. గుడ్లు నీళ్లల్లో తేలితే అవి పాడయ్యాయని అర్థం. అలా కాకుండా అవి నీటి అడుక్కువెళ్లి నిశ్చలంగా ఉన్నాయనుకోండి అవి తాజాగా ఉన్నాయని అర్థం. అలాగే ఫ్రిజ్ లో పెట్టిన గుడ్లను బయటకు తీసినపుడు వాటిని ఎక్కువ సేపు బయట ఉష్ణోగ్రతలో ఉంచకూడదు. వాటిని గరిష్టంగా రెండు గంటలకు మించి బయట ఉంచకూడదు. అలాకాకుండా వాటిని బయట ఉంచారనుకోండి వాటిల్లోకి వేగంగా బాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే ఫ్రిజ్ లో పెట్టిన గుడ్లను బయట పెట్టకుండా అందులో ఉంచితేనే మంచిది. అయితే యుకెలాంటి చోట్ల గుడ్లను గది ఉష్ణోగ్రతలో స్టోర్ చేస్తారు. కానీ అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలలో ఇది సాధ్యపడదు.


సాధారణంగా రూమ్ టెంపరేచర్ లో మూడు రోజులు గుడ్లు బాగానే ఉంటాయి. ఫామ్ నుంచి వచ్చిన తాజా గుడ్లను రూమ్ టెంపరేచర్ లో ఉంచినా ఎక్కువ కాలం ఉంటాయి. ఈ గుడ్లను రూమ్ టెంపరేచర్ లో పెట్టాలనుకునే వాళ్లు వాటికి ఎండ తగలకుండా తక్కువ తేమ ఉన్న ప్రదేశంలో వాటిని భద్రంచేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News