Saturday, October 5, 2024
Homeహెల్త్Facial benefits: అబ్బో..ఫేషియల్ తో ఇన్ని లాభాలా!

Facial benefits: అబ్బో..ఫేషియల్ తో ఇన్ని లాభాలా!

ఫేషియల్ తో లాభాలెక్కువని అతిగా చేసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

రెగ్యులర్ ఫేషియల్స్ తో ఫీల్ గుడ్…

- Advertisement -

తరచూ ఫేషియల్స్ చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేమిటంటే..

 డీప్ క్లీన్సింగ్ చేసే ఫేషియల్ వల్ల చర్మంలోని జిడ్డు, మురికి, మలినాలు పోతాయి.

 చర్మస్వభావాన్ని సరిగా అర్థంచేసుకునేందుకు రెగ్యులర్ ఫేషియల్స్ బాగా ఉపయోగపడతాయి.

 చర్మ రంధ్రాల్లో చేరిన మురికిని రెగ్యులర్ ఫేషియల్స్ శుభ్రంగా పోగొడతాయి.

 థెరపిస్టు ఫేషియల్ చేయడం వల్ల సంపూర్ణమైన రిలాక్సింగ్ ఎఫెక్టులు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని గంటలపాటు మంచి నిద్ర పోతారు.

 ఫేస్ మాస్కులను అప్లై చేసుకోవడం వల్ల మరెన్నో అదనపు ప్రయోజనాలు పొందుతారు.

 రెగ్యులర్ ఫేషియల్స్ తో చర్మం రూపులో ఎంతో మెరుగుదల కనిపిస్తుంది.

 తరచూ ఫేషియల్స్ చేసుకోవడం వల్ల మీరు ఉపయోగించే ఉత్పత్తులు సైతం ఎంతో మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ కండరాల టోనింగ్ కు సైతం రెగ్యులర్ ఫేషియల్స్ ఎంతో ఉపయోగపడతాయి.

 ఫేషియల్ చేసుకున్న తర్వాత మీ చర్మంలో కనిపించే తేడాను ఇట్టే గుర్తించగలరు.

 రెగ్యులర్ ఫేషియల్స్ వల్ల నిత్యం మనం ప్రభావితమయ్యే పర్యావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే బ్యూటీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతాం.

 తరచూ ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల చర్మంపై చేరిన బాక్టీరియా పోతుంది. అంతేకాదు చర్మ రంధ్రాలు మూసుకుపోవు. ఫ్రధానంగా ఈ సమస్యతోనే చర్మంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, యాక్నే బ్రేకవుట్లు తలెత్తుతాయి. రెగ్యులర్ ఫేషియల్స్ తో ఈ సమస్యలను అధిగమించవచ్చు.

 రెగ్యులర్ ఫేషియల్స్ ఎక్స్ ఫొయిలేషన్ బాగా చేస్తాయి.  ఫలితంగా చర్మంపై చేరిన మ్రుతకణాలు శుభ్రంగా పోతాయి.  రెగ్యులర్ ఫేషియల్స్ వల్ల నిత్యం వాడే బ్యూటీ ప్రాడక్టులను చర్మం మరింత బాగా గ్రహించగలుగుతుంది కూడా. దీంతో చర్మం ఎంతో తాజాగా కనిపిస్తుంది.

 రెగ్యులర్ ఫేషియల్స్ వల్ల చర్మం టైపు గుర్తించడం సులభం. అలాగే స్కిన్ కండిషన్ ఎలాంటిదో కూడా సులభంగా తెలుస్తుంది. చర్మానికి సంబంధించి ఏదైనా డిజార్డర్ ఉంటే దాన్ని కూడా సులువుగా గుర్తించగలరు ధెరపిస్టులు. అంతేకాదు ఎలాంటి ప్రాడక్టులు, ట్రీట్మెంట్లు మీ చర్మానికి పడతాయో కూడా గ్రహించగలరు. ధెరపిస్టులు సరైన సలహాలను కూడా క్లయింట్లకు ఇవ్వగలుగుతారు. రెగ్యులర్ ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల క్లయింట్ చర్మ తీరుతెన్నులను సైతం థెరపిస్టులు సులభంగా అంచనాగట్టగలరు.

 రెగ్యులర్ ఎక్స్ ట్రాక్షన్స్ వల్ల చర్మంపై బ్రేకవుట్లు తలెత్తకుండా నిరోధించవచ్చు.

 రెగ్యులర్ ఫేషియల్స్ తో రంధ్రాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడడం వల్ల యాక్నే బ్రేకవుట్లు తలెత్తకుండా తగ్గించుకోవచ్చు.

 ఫేషియల్ లో మసాజ్ కూడా చాలా ముఖ్యమైంది. ఇది రక్తప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. చర్మానికి తగినంత ఆక్సిజన్ ను అందిస్తుంది. థెరపిస్టుతో మసాజ్ చేయించుకోవడం వల్ల రిలాక్సింగ్ ఎఫెక్టులు బాగా ఉంటాయి. మసాజ్ వల్ల ముఖంపై చేరిన మలినాలు పోతాయి. తరచూ ఫేషియల్ మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం బిగువుగా తయారవడమే కాకుండా ఎంతో కాంతివంతం అవుతుంది. ముఖంపై గీతలు, ముడతలు వంటివి ఏర్పడవు. ఫేషియల్స్ వల్ల తగినంత మాయిశ్చరైజింగ్ చర్మానికి అందుతుంది. అలాగే ఫేషియల్ మసాజ్ వల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

 ఫేషియల్ మాస్కులు అప్లై చేసుకోవడం వల్ల మరిన్ని ఫేషియల్స్ ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలను పొందుతారు. ఫేస్ మాస్కుల్లో రకరకాల పదార్థాలు ఉంటాయి. ఇవి జెల్ లేదా పేస్టు రూపంలో ఉంటాయి. చర్మ స్వభావానికి అనుగుణమైన ఫేస్ మాస్కులను ముఖానికి అప్లై చేసుకోవచ్చు. చర్మ రంధ్రాలు పునరుద్ధరించడానికి ఫేస్ మాస్కులు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు చర్మానికి తేమ అందడానికి కూడా వీటిని వాడతాం.

అలాగే ముఖంపై గీతలు అవీ ఉంటే పోవడానికి ఫేస్ మాస్కులను రాస్తాం. చర్మం బిగువుగా ఉండేలా కూడా ఫేస్ మాస్కు చేస్తుంది. ఫేస్ మాస్కు వల్ల చర్మం బాగా కాంతివంతం కూడా అవుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. బ్రైటర్ కాంప్లెక్షన్ తో కనిపిస్తారు.

 నిత్యం ఫేషియల్స్ చేసుకోవడం వల్ల చర్మం యంగ్ గా ఉంటుంది. మరెంతో అందంగా తయారవుతుంది. వయసు కనిపించకుండా మిమ్మల్ని యంగ్ గా మెరిపిస్తుంది.

 ఫేషియల్ చేసుకోవడం వల్ల స్కిన్ టెక్స్చెర్ మెరుగవుతుంది.  చర్మానికి తేమ అందుతుంది. బ్రేకవుట్స్ నివారణ వేగంగా జరుగుతుంది. చర్మం సాగదు.

 రెగ్యులర్ ఫేషియల్స్ శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా బాగుచేస్తాయి. ఫేషియల్స్ ను తరచూ చేయించుకోవడం లగ్జరీ ఏమీ కాదు. నిజానికి ఇవి మీరు మరింత అందంగా, ఆరోగ్యంగా కనిపించేలా సహకరిస్తాయి. చర్మంపై బాక్టీరియా అనేదే లేకుండా ఎంతో శుభ్రంగా ఉంటుంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News