Tuesday, September 17, 2024
Homeహెల్త్Fair skin glow: మెరిసే తెల్లని చర్మం కోసం

Fair skin glow: మెరిసే తెల్లని చర్మం కోసం

చర్మం తెల్లని చాయతో మెరుస్తూ ఉండాలంటే కొన్ని సహజమైన టిప్స్ ఉన్నాయి. అవి:

- Advertisement -

 చర్మం ఫెయిర్ నెస్ కోసం పసుపు, పాలు కలిపిన పేస్టు బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పాలల్లో అర టీస్పూన్ పసుపు వేసి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకుని పొద్దున్నే లేచి కడుక్కోవాలి. కొంతకాలం ఇలాగే చేస్తే చర్మం ఫెయిర్ గా, వైట్ గా తయారవుతుంది.

 రెండు స్పూన్ల తేనెలో పావు స్పూను పసుపు వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని అరగంట సేపు అలాగే ఉంచుకుని, ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. చర్మం తెల్లదనాన్ని సంతరించుకుంటుంది.

 చర్మం నల్లగా ఉంటే బొప్పాయి, టొమోటా పేస్టు రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక టొమాటో, ఒక బొప్పాయి ముక్క తీసుకుని రెండింటినీ ఒక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకుని ఆతర్వాత చల్లటి నీళ్లలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి దానితో ముఖాన్ని కడుక్కుంటే ముఖానికి ఇన్ స్టంట్ ఫెయిర్ నెస్ వస్తుంది.

 ఫెయిరర్ స్కిన్ టోన్ కోసం రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది. చర్మంలోని మలినాలను ఇది పోగొడుతుంది. దాబర్ గులాబరి రోజ్ వాటర్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు తీసుకని ఒక బౌల్ లో పోసి అందులో కాటన్ బాల్స్ ముంచి దానితో ముఖానికి రాసుకోవాలి. అది చర్మంపై ఆరిపోయేవరకూ ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.

 శెనగపిండితో ఈవెన్ టోన్ కాంప్లెక్షన్ కాపాడుకోవచ్చు. ఇది మంచి ఎక్స్ ఫోయిలేటర్. టాన్, నల్లమచ్చలను పోగొడుతుంది. దీంతో చర్మానికి మంచి కాంప్లెక్షన్ వస్తుంది. తాజాగా కనిపిస్తారు. రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండిలో ఒక చిటికెడు పసుపు వేసి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

 రవ్వ, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది. ఇది చర్మంపై ఉన్న మ్రుత కణాలను పోగొడుతుంది. ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఒక టేబుల్ స్పూను పెరుగు కలిపి పేస్టులా చేసి అందులో అర టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ప్రతి ఐదు నిమిషాలకు ప్యాక్ ను రబ్ చేస్తుండాలి. ఇలా చేస్తే ప్యాక్ తొందరగా ఎండిపోదు. అలా పదిహేను నిమిషాలు అయిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

 ఇన్ స్టాంట్ ఫెయిర్ స్కిన్ కోసం రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, ఒక చిటికెడు పసుపు, మీగడ, బీట్ రూట్ రూట్ రసాన్ని కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

 వాల్నట్, బాదం కలిపిన పేస్టు ముఖానికి రాసుకుంటే చర్మం తెల్లగా మెరుస్తుంటుంది. పాలల్లో నానబెట్టిన ఐదారు బాదం పప్పులు, ఒక వాల్ నట్ , ఒక టేబుల్ స్పూన్ పెరుగు, నూరిన అవిశె గింజలు తీసుకోవాలి. బాదం, వాల్ నట్ లను బ్లెండర్ లో వేసి పేస్టులా చేయాలి. అందులో పెరుగు, మెత్తగా నూరిన అవిశ గింజలను బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. పొడిచర్మం ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది.

 స్కిన్ టోన్ కాంతివంతంగా ఉండడానికి కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి కావలసిన నీరును అందివ్వడమే కాదు చర్మానికి కావలసిన తేమను కూడా అందిస్తుంది. రోజుకు ఒకసారి కొబ్బరి నీళ్లలో ముంచిన కాటన్ బాల్ తో ముఖాన్ని బాగా రుద్దుకుంటే చర్మం కాంతివంతంగా ఉండడమే కాదు, కావలసినంత మాయిశ్చరైజర్ చర్మానికి అందుతుంది.

 యాపిల్ చర్మానికి ఇన్ స్టంట్ ఫెయిర్ నెస్ ను తెస్తుంది. శరీరాన్నే కాదు చర్మాన్ని కూడా ఈ పండు ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం మెరుపును యాపిల్ పరిరక్షిస్తుంది. యాపిల్ పండు ముక్కలు స్కిన్ టోన్ ను సహజసిద్ధంగా పరిరక్షిస్తుంది. తొక్కతీసిన యాపిల్ ముక్కలను పాలల్లో 15 లేదా 20 నిమిషాలు ఉంచాలి. అలా నానబెట్టిన యాపిల్ ముక్కలను బ్లెండర్ లో వేసి పేస్టులా చేయాలి. పది నిమిషాలు ఈ పేస్టును ఫ్రిజ్ లో ఉంచాలి. తర్వాత చల్లటి ఈ ఫ్రూట్ పేస్టులో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News