Friday, September 20, 2024
Homeహెల్త్Less oil: తక్కువ నూనెతో వంటలెలా?

Less oil: తక్కువ నూనెతో వంటలెలా?

కొంచెం కేర్ తీసుకోండి, చిన్న టిప్స్ తో పెద్ద రిజల్స్ట్

నూనె తక్కువ వాడడం ఎలా అంటే..
నూనె ఎక్కువ వేసి కూరలు వండితే రుచి బాగానే ఉంటుంది కానీ దాంతో పాటు మన శరీరంలో ఫ్యాట్ కూడా ఎక్కువవుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. తినే ఆహారంలో ఎక్కువ నూనె వాడితే లేనిపోని జబ్బుల బారిన పడతాం. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ వస్తాయి. అలాంటి నూనె, నెయ్యిల వాడకానికి చెక్ పెట్టడం ఎలా అని సతమతముతున్నారా? నూనె వినియోగాన్ని నియంత్రించడం అంత సులువైన విషయం కాదు కదా అంటున్నారా? అయితే దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఎస్ ఎ ఐ) ఐదు చిట్కాలను చెపుతోంది.

- Advertisement -

ఈ పరిస్థితి ఎదురవకుండా ఉండాలంటే కాలరీల వినియోగాన్ని సరిగా ప్రణాళిక చేసుకోవాలని చెపుతోంది. ఆరోగ్యకరమైన, సమతులాహారంతో శరీరానికి సరిపడినన్ని కాలరీలు ఉండాలంటే రోజుకు 20 నుంచి 25 శాతం కాలరీలు మించకూడదు. అలా అని మీరు నిత్యం తీసుకునే డైట్ నుంచి ఫ్యాట్ అసలే లేకుండా తినాలని ఉద్దేశం కాదు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎనర్జీ, ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్ వంటివన్నీ కలిపి 20 శాతం దాకా కాలరీలు శరీరానికి నిత్యం అందాలి. అలాగే నూనె, నెయ్యి, బటర్ వినియోగాన్ని పరిమితకాలానికి మితమైన పరిమాణంలో మాత్రమే వినియోగించాలనేది ఇంకొక టిప్పు. అందుకు తగ్గట్టు వాటి వాటి వినియోగం ఉండేలా చూసుకోవాలి. అలా చేస్తే మొత్తం ఫ్యాట్ వినియోగంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఇంట్లో వాడే నెయ్యి, నూనె, బటర్ లను నిత్యం మానిటర్ చేసుకుంటూ వంటల్లో వాడడం తప్పనిసరిగా అనుసరించాలని కూడా ఫుడ్ అధారిటీ సూచించింది. ముఖ్యంగా నిత్యం చేసే వంటకాల్లో నూనె వినియోగాన్ని బాగా తగ్గించాల్సిన అవసరాన్ని కూడా ఫుడ్ అథారిటీ పేర్కొంది.

ఉదాహరణకు మీరు ఏదైనా ఒక డిష్ కు నిత్యం మూడు టేబుల్ స్పూన్లు నూనె వాడుతున్నారనుకోండి దాన్ని రెండు టేబుల్ స్పూన్లకు పరిమితం చేసుకోవడం వంటివి చేయాలంటోంది. ఇలా చేసిన తర్వాత ఆ నూనెను ఆ ఫలానా డిష్ లో ఇంకా తగ్గించే అవకాశం ఉంటే ఆ ప్రయత్నం చేస్తే ఇంకా మంచి ఫలితాలను చూస్తారు. మీరు చేసే ఆ డిష్ కన్నా కూడా తక్కువ నూనె, నెయ్యి, బటర్ పట్టే ప్రత్యామ్నాయ రెసిపీలు ఏమైనా ఉంటే వాటిని చేసుకోవచ్చు కూడా. ఈ క్రమంలో వంట వండేటప్పుడు నూనెను తక్కువ వాడేలా చిన్న స్పూనును ఉపయోగిస్తే మంచిది. చాలామంది ఫ్రైడ్ ఫుడ్స్ ఇష్టపడతారు. నిత్యం వాటిని ఇళ్లల్లో చేసుకుంటారు. కానీ వాటిలో నూనె అధిక పరిమాణాల్లో ఉంటుంది. అలా వండుకునే బదులు ఉడకబెట్టి, గ్రిల్డ్ చేసి, రోస్టెడ్ లేదా స్టీమ్డ్ పద్ధతుల్లో ఇంట్లో వంటకాలు చేసుకుంటే వాటిల్లో విటమిన్లు, పోషకాలు పోకుండా ఉంటాయి.

ఆరోగ్యానికి కూడా ఈ తరహా వంటకాలు చాలా మంచివి. అందుకే ఫుడ్ అథారిటీ చెప్పిన ఈ టిప్ప్ పాటించి నూనె మితంగా ఉండే ఆరోగ్యవంతమైన భోజానాన్ని ఆరగిస్తే ఆరోగ్యంతో పాటు ఎంతో చలాకీగా కూడా ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News