ఉబ్బరంతో, గ్యాసుతో బాధపడుతున్నారా? ప్రపంచంలోని 30 శాతం మంది యువతీయువకులు ఈ సమస్యతో ఎక్కువ బాధపడుతున్నారని ఇటీవల వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ చేసిన ఒక స్టడీలో కూడా వెల్లడైంది. ఉబ్బరం అనేది జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల తలెత్తే సమస్య. ఈ ఉబ్బరం, గ్యాసు సమస్యలు తలెత్తడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. అతిగా తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే తినే ఆహారాన్ని సరిగా నమలకుండా హడావిడిగా తినడం వల్ల కూడా వీటి పాలబడుతుంటాం. గ్యాసును ఉత్పత్తి చేసే ఆహారపదార్థాలు అంటే క్యాబేజీ, బీన్స్, చిక్కుళ్లు, బ్రోకొల్లీ, ఉల్లిపాయలు, కార్బొనేటెడ్ డ్రింకుల వల్ల జీర్ణ వ్యవస్థలో గ్యాసు ఏర్పడి కడుపు ఉబ్బరం తలెత్తుతుంది. దీనివల్ల కొన్నిసార్లు యాసిడ్ రిఫ్లక్సును సైతం ఎదుర్కొంటాం. దీంతో తీవ్ర ఎసిడిటీ సమస్య మనల్ని బాధిస్తుంది. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు లేకపోయినా కూడా ఉబ్బరం సమస్య తలెత్తుతుంది. అలాగే కొన్ని రకాల ఆహారపదార్థాలు పడకపోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వస్తుంది.
మలబద్దకం వల్ల జీర్ణక్రియ తగ్గిపోయి ఉబ్బరం తలెత్తుంది కూడా.ఈ సమస్యను అధికమించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైంది నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగితే ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఉబ్బరం సమస్య తలెత్తదు. జీర్ణక్రియ బాగా జరగాలంటే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలంటారు పోషకాహారనిపుణులు. ఆహారాన్ని బాగా నమిలి ఆ తర్వాత మింగాలి. అప్పుడు అన్నం మెత్తగా అయి సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఆహారాన్ని మెల్లగా నమిలి తినడాన్ని అలవాటుచేసుకోవాలి. ప్రొబయొటిక్ లేదా గుడ్ బాక్టీరియా కూడా ఆహారాన్ని జీర్ణమయ్యేట్టు చేస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడానికి గుడ్ బాక్టీరియా ఎంతగానో సహకరిస్తుంది కూడా. అందుకే ప్రొబయొటిక్స్ అంటే గుడ్ బాక్టీరియా ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటే ఉబ్బరం సమస్య తలెత్తదు.
జీర్ణక్రియ బాగా జరుగుతుంది. పిప్పర్ మెంట్ టీ ఉబ్బరం సమస్యను నిరోధిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. గ్యాసు, ఉబ్బరం సమస్యలు ఏర్పడకుండా సహకరిస్తుంది. అందుకే అన్నం తిన్నతర్వాత ఒక కప్పుడు పిప్పర్ మెంట్ టీ తాగితే మంచి ఫలితాన్ని చూస్తారు. ఉప్పు ఎక్కువ తినడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని నీళ్లు ఆవిరయిపోతాయి. దీంతో కడుపు ఉబ్బరం తలెత్తుతుంది. అందుకే ప్రోసెస్ఢ్ ఫుడ్స్ కు దూరంగా ఉండడం ద్వారా ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.
అలాగే మనం ఇంట్లో వండుకునే ఆహారపదార్థాల్లో కూడా ఉప్పును తక్కువ వాడాలి.