Saturday, September 21, 2024
Homeహెల్త్Greay hair at early age?: యంగ్ ఏజ్ లోనే తెల్ల జుట్టా?

Greay hair at early age?: యంగ్ ఏజ్ లోనే తెల్ల జుట్టా?

60ల్లో రావాల్సింది 20ల్లోనే వచ్చేసిందా ?

అరవైలలో రావలసిన తెల్ల జుట్టు ముప్ఫై ఏళ్లకే వచ్చిందా? నలుగురిలో కలవాలంటే మొహమాట పడుతున్నారా? ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆందోళన పడుతున్నారా? చిన్నవయసులోనే తెల్లజుట్టుతో బాధపడుతున్న మీ ఇబ్బందికి చెక్ పెట్టే కొన్ని నేచురల్ రెసిపీలు ఉన్నాయి. వీటితో మీ తెల్ల జుట్టు నిగ నిగలాడే నల్లజుట్టుగా మారడమే కాదు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారని శిరోజాల నిపుణులు కూడా అంటున్నారు. 

- Advertisement -

వాటిల్లో మెంతి, ఉసిరితో చేసే రెసిపీ ఒకటి. ముందుగా ఐదు టేబుల్  స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె తీసుకుని అందులో మూడు లేదా నాలుగు ఆమ్లా ముక్కలు వేసి సన్నని సెగపై కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసి కలిపి చల్లారనివ్వాలి. ఆ పేస్టును రాత్రి నిద్రపోవడానికి ముందు మాడుకు పెట్టుకోవాలి. దిండుకవర్లకు ఈ పేస్టు అంటకుండా జాగ్రత తీసుకోవడం మరవొద్దు. పొద్దున్న లేచిన తర్వాత హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టుకు ఈ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి సమ్రుద్ధిగా ఉంటుంది. జుట్టు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి ఉసిరిని వాడొచ్చు. ఇక మెంతుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటి మిశ్రమం తెల్లజుట్టు రాకుండా ఎంతో శక్తివంతంగా నిరోధిస్తుంది.

బ్లాక్ టీతో వెంట్రుకలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా చిన్నవయసులో వచ్చే తెల్ల జుట్టును నిరోధించవచ్చు. ఇందుకోసం రెండు టీస్పూన్ల తేయాకు, ఒక టీస్పూను ఉప్పు తీసుకుని ఒక కప్పు నీళ్లల్లో వేసి దాన్ని స్టవ్ మీద పెట్టి  మరగనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత తలంటుపోసుకున్న శిరోజాలకు పట్టించాలి. బ్లాక్ టీలో కెఫైన్ బాగా ఉంటుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉంటాయి. అంతేకాదు బ్లాక్ టీ జుట్టుకు సహజమైన నల్ల రంగును ఇస్తుంది. పైగా జుట్టు పెరిగేలా చేస్తుంది కూడా. చిన్నవయసులో వచ్చే తెల్ల జుట్టును బ్లాక్ టీ ట్రీట్మెంట్ నిరోధించడమే కాకుండా జుట్టు సిల్కీగా కనిపించేలా చేస్తుంది కూడా.

నిమ్మరసం, బాదం నూనె మిశ్రమం కూడా యంగ్ గా ఉన్నప్పుడే తలెత్తే తెల్లజుట్టు సమస్యను పరిష్కరిండంలో బాగా పనిచేస్తుంది.  రెండు టీస్పూన్ల తేయాకు, ఒక స్పూను ఉప్పు తీసుకుని ఒక కప్పు నీళ్లలో వేయాలి. అందులోనే బాదం నూనె, నిమ్మరసాలను 2:1 నిష్పత్తిలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడుపై రాసుకుని మెల్లగా మసాజ్ చేసి అరగంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలను శుభ్రంగా కడుక్కోవాలి. బాదం నూనెలో విటమిన్ ఇ బాగా ఉంటుంది. ఇది వెంట్రుకలకు చాలా మంచిది. జుట్టును కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉండేలా ఇది చేస్తుంది. అంతేకాదు చిన్నవయసులో తలెత్తే తెల్లజుట్టును నివారిస్తుంది. శిరోజాల ఆరోగ్యకరమైన వ్రద్ధికి తోడ్పడతుంది.

చిన్నతనంలో బాధించే తెల్ల జుట్టును నివారించే మరో నేచురల్ రెసిపీ హెన్నా, కాఫీల మిశ్రమం. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకుని వేడి నీళ్లల్లో వేయాలి. అందులో హెన్నాపొడిని కూడా వేసి బాగా కలిపి పేస్టులా చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆతర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని (మీకు నచ్చినది) అందులో కలిపి ఆ పేస్టును భద్రం చేసుకోవాలి. దానితో మీ జుట్టును అరగంట పాటు మసాజ్ చేసి నీళ్లతో కడిగేసుకోవాలి. హెన్నా ఆర్గానిక్ కండిషనర్ గా పనిచేస్తుంది. వెంట్రుకలకు మంచి రంగును ఇస్తుంది. హెన్నాను కాఫీతో కలపడం వల్ల జుట్టు మరింత నల్లటి రంగుతో చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. తెల్లజుట్టును నల్లగా చేసేందుకు హెన్నాను ప్రాచీనకాలం నుంచీ ఇంటి చిట్కాగా వాడుతున్నవిషయం మనిందరికీ తెలుసు కూడా.

యంగ్ గా ఉన్నప్పుడే తలెత్తే తెల్లజట్టు సమస్యను ఎంతో శక్తివంతంగా పరిష్కరించే మరో నేచురల్ రెసిపీ కరివేపాకు, నూనె మిశ్రమం. కొన్ని కరివేపాకులను తీసుకుని మీకు నచ్చిన నూనెలో వాటిని వేగించాలి. ఆ నూనె చల్లారిన తర్వాత అందులోని కరివేపాకులను గట్టిగా పిండి ఆ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోయాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండు లేదా మూడుసార్లు రాత్రి నిద్రపోయేముందు తలను మసాజ్ చేసుకొని పడుకోవాలి. కరివేపాకుల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది కుదుళ్ల నుంచీ తెల్లజుట్టు రాకుండా నిరోధించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో బేటా కెరటిన్ బాగా ఉంటుంది. ఇది జుట్టు రాలకుండా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఉల్లిరసం కూడా తెల్లజుట్టు రాకుండా నిరోధిస్తుంది. మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఉల్లిరసం తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.  ఆ మిశ్రమంతో జుట్టు లోపలికంటా మసాజ్ చేసి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. తెల్లబడుతున్న జుట్టుపై ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాదు జుట్టు పెరిగేలా కూడా చేస్తుంది. కెటలాసె లాంటి ఎంజైములను ఇది పెంచుతుంది. దీన్ని నిమ్మరసంతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. తెల్లజుట్టును తగ్గించే మరో నేచురల్ రెసిపీ షీకాకాయ.

ఒక స్పూను పెరుగు తీసుకుని అందులో ఒక స్పూను షీకాకాయ్ పొడి వేసి బాగా కలిపి దాన్ని హెయిర్ మాస్కులా వేసుకోవాలి. మాడుకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. షీకాకాయ్ సహజసిద్ధమైన షాంపు . ఇది తెల్లజుట్టును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. నిత్యం దీన్ని వాడడం వల్ల మాడు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది . శిరోజాలు కూడా బాగా పెరుగుతాయి.  సో…యంగ్ ఏజ్ లో ఉండగానే తెల్లజుట్టు వస్తోందని ఆందోళన చెందకుండా ఈ నేచురల్ రెసిపీలను ఫాలో అయితే మంచి ఫలితాలు చూస్తారు. తెల్ల జుట్టు పోయి నిగనిగలాడే శిరోజాలు మీ సొంతమవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News