ఉల్లి కోళ్లు రుచిలో సూపర్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మంచివి. వీటిల్లో అత్యావశ్యకమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని గ్రీన్ ఆనియన్స్ అని కూడా అంటారు. చైనీస్ ముఖ్యమైన ఆహార పదార్థం ఇది. ఉల్లికోళ్లను ఆకులతో సహా వండుకుని తినొచ్చు. శరీరారోగ్యానికి ఎంతో మంచిది.
ఇందులోని అలిల్ సల్ఫైడ్, ఫ్లవనాయిడ్స్ కాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. కాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైములపై ఇవి పోరాటం చేస్తాయి. అందుకే డైలీ డైట్ లో ఉల్లికోళ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఉల్లికోళ్లు మంచి ఎపిటైజర్లలా పనిచేస్తాయి. వీటిల్లో పీచుపదార్థాలు ఎక్కువ. అందువల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. ఇతర కూరగాయలతో కలిపి కూడా దీన్ని వండుకోవచ్చు. వీటిని వంటల్లోనే కాదు పచ్చిగా కూడా తినొచ్చు.
ఉల్లికోళ్లల్లో కెరటొనాయిడ్స్ బాగా ఉంటాయి. ఇవి కంటిచూపును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఇది ద్రుష్టిలోపాన్ని అడ్డుకుంటుంది. కారట్, కీర కలిపి దీనితో చేసే సలాడ్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఉల్లికోళ్లల్లో జలుబు, ఫ్లూలను నిరోధించే యాంటిబాక్టీరియల్, యాంటివైరల్ గుణాలు బాగా ఉన్నాయి.