Tuesday, May 21, 2024
Homeఇంటర్నేషనల్Errabelli at US: కెసిఆర్ నాయకత్వంలో విశ్వవ్యాప్తం అయిన తెలంగాణ ఖ్యాతి

Errabelli at US: కెసిఆర్ నాయకత్వంలో విశ్వవ్యాప్తం అయిన తెలంగాణ ఖ్యాతి

మనమంతా ఎక్కడున్నా ఒకటే

అభివృద్ధిలో హైదరాబాద్ అమెరికా తో పోటీ పడుతోందని, గతంలో కొడుకు కూతురు ఊరికి రమ్మంటే వచ్చేవాళ్ళు కాదని, తెలంగాణ వచ్చాక వద్దన్నా మన వండ్లు, మనవరాళ్లు వస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అమెరికాలో వ్యాఖ్యానించారు. 24 గంటల కరెంటు, మంచి నీళ్ళు రావడమే ఇందుకు కారణమని ఎర్రబెల్లి సగర్వంగా చెప్పుకున్నారు. కెసిఆర్ ను మనం కాపాడు కోవాలని, కెసిఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎర్రబెల్లి ఘంటాపథంగా చెప్పటం విశేషం.

- Advertisement -

తానా మహాసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తున్న తానా మహాసభలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర ప్రజా ప్రతినిధులతో, సినీ నటులతో, అహూతులతో, తానా ప్రతినిధులు, NRI మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, తెలుగు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిలో NRI ల పాత్ర, తెలుగు ప్రజలను కలుపుతున్న TANA సభలు వంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే మంత్రిని తానా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

మరో వైపు తానా మహా సభలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రభుత్వాల ప్రతినిధులు, మంత్రులు, తెలుగు వారైన ప్రముఖులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు, అనేక మంది హాజరయ్యారు. దీంతో అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియా లో తెలుగుదనం ఉట్టిపడేలా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఇనుమడింప చేసేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిలడెల్ఫియాలో పండుగ వాతావరణం నెలకొంది. అమెరికాలో ఉన్న NRI లు, ప్రతి రోజూ ఉండే పని వత్తిడులు, బిజీ జీవితాన్ని పక్కన పె ట్టి, తెలుగు ప్రముఖులు, తెలుగు వారైన NRI లతో కలిసి ఉత్సాహంగా గడుపుతున్నారు.

గత 25 ఏళ్లుగా నేను ఎమ్మెల్యే గా పాల్గొనేవాడిని, ఈ సారి మంత్రిగా వచ్చిన… మనమంతా కలిసి జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ తానా మహాసభల కోసం మేము కూడా ఈ సభలకు రావడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూశామన్నారు. మనం ఎక్కడ ఉన్నా, అంతా ఒక్కటే అని చాటే సభలు ఇవి అని, మనం ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్న తల్లి ని, పుట్టిన ఊరిని మరచిపోలేదని చాటే సందర్భం, ఉన్న ఊరు (usa) ను కూడా మరవని మన విశ్వసనీయతకు గుర్తు ఈ మహా సభలు అన్నారు. మనం ఎక్కడ ఉన్నా, మన పనితనం తో ఇక్కడి, మన దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాం. ఉంటాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News