Thursday, November 21, 2024
Homeహెల్త్Green Tea: కాఫీనా గ్రీన్ టీనా? హార్ట్, బీపీ, హైపర్ టెన్షన్ కు ఏది బెస్ట్?

Green Tea: కాఫీనా గ్రీన్ టీనా? హార్ట్, బీపీ, హైపర్ టెన్షన్ కు ఏది బెస్ట్?

కాఫీ, టీలు లేకుండా ఒక్క రోజు, ఒక్క పూట కూడా గడపని వారిని మనం రోజూ చూస్తుంటాం. మనింట్లో కూడా ఇలాంటి వారు ఉంటారు. కానీ హార్ట్ హెల్త్ కు, బీపీకి, హైపర్ టెన్షన్ కు కాఫీ మంచిదా లేక గ్రీన్ టీ మంచిదా? ఈ విషయంపైనే ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ స్టడీ జరిగింది..దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

హై బ్లడ్ ప్రెజర్ లేదా హైపర్ టెన్షన్ ఈమధ్య కాలంలో సైలెంట్ ఎపిడమిక్ గా మారిపోయింది. మన ఇండియన్స్ లో చాలా మందికి చిన్న వయసులోనే ఈ హైపర్ టెన్షన్ వస్తోంది. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, హెరిడిటరీగా వచ్చేదే.

కాఫీలో 95-200 ఎంజీల కెఫీన్ ఉండగా గ్రీన్ టీలో ఇది కేవలం 35 ఎంజీలు మాత్రమే ఉంది. ఓ కప్పుకాఫీ చాలు మూడు కప్పులు గ్రీన్ టీ తో సమానమైన కెఫీన్ మన శరీరానికి ఇస్తుంది. హై బీపీ ఉన్నవారికి కాఫీతో చేటు జరుగగా గ్రీన్ టీ మాత్రం చాలా యూజ్ఫుల్ గా మారినట్టు గుర్తించారు. గ్రీన్ టీ తాగినవారిలో గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. గ్రీన్ టీలో ఉన్న ఔషధ గుణాలే ఇందుకు కారణం. ఇది ఓ ఆయుర్వేద కషాయం లాంటిది. గ్రీన్ టీలో ఉన్న పాలిఫినాల్స్ గుండెకు మంచి చేస్తుంది. కాఫీ మంచిది కాకపోయినా గ్రీన్ కాఫీ మాత్రం చాలా ఆరోగ్యకరంగా ఉన్నట్టు మంచి రిజల్ట్స్ ఇచ్చింది.

జపాన్ కొలాబరేటివ్ కోహర్ట్ స్టడీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్ వారు జరిపిన అధ్యయనాన్ని అమెరిక్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో పబ్లిష్ చేశారుకూడా. కాఫీ, గ్రీన్ టీలో ఏది హై బీపీ ఉన్నవారికి మంచిదన్న అధ్యయనంలో 18,000 మంది పార్టిసిపేట్ చేశారు. 12 ఏళ్లపాటు ఈ స్టడీ జరిగింది. బీపీ, హై బీపీ ఉన్నవారు కాఫీ తాగినప్పుడు మరింత ఎక్కువ అనారోగ్యంపాలైనట్టు అధ్యయనం తేల్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News