Sunday, November 16, 2025
Homeహెల్త్Health:రాత్రిపూట ఓ కప్పుడు కానీ వీటిని తిన్నారంటే..ఆ ప్రాబ్లెమ్స్‌ అన్నీ పరార్‌!

Health:రాత్రిపూట ఓ కప్పుడు కానీ వీటిని తిన్నారంటే..ఆ ప్రాబ్లెమ్స్‌ అన్నీ పరార్‌!

Health Benefits Of Eating Papaya:చాలా మంది భోజనం పూర్తయ్యాక తేలికైన, తీపి రుచితో ఉండే పండ్లు తినాలని ఇష్టపడుతుంటారు. అలాంటి సందర్భాల్లో బొప్పాయి మంచి ఎంపికగా భావించబడుతోంది. దీని రుచితో పాటు ఇందులో దాగి ఉన్న పోషకాలు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు నిపుణులు కూడా చెబుతున్నారు.

- Advertisement -

పోషకాలు సమృద్ధిగా..

బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సీ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా లైకోపీన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో, కణాలను సురక్షితంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అదనంగా పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ ఎంజైమ్ ఆహారం జీర్ణమవడంలో సహకరించడమే కాకుండా కడుపు తేలికగా అనిపించేలా చేస్తుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/copper-sun-idol-benefits-in-home-vastu-for-positive-energy/

రోగనిరోధక శక్తి …

బొప్పాయిలో విటమిన్ సీ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే వారికీ ఇది సహజ రక్షణ కవచంలా పని చేస్తుంది. బొప్పాయి లోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ వ్యాధుల నుండి రక్షించగలవు.

చర్మం ఆరోగ్యం..

చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కూడా బొప్పాయి ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. వయసుతో వచ్చే ముడతలు తగ్గడంలో ఇవి సహాయపడతాయి. అందుకే చాలా మంది చర్మ సంరక్షణలో బొప్పాయి రసం లేదా గుజ్జును కూడా ఉపయోగిస్తారు.

గుండె ఆరోగ్యం..

గుండె ఆరోగ్యం కాపాడుకోవాలనుకునే వారికి కూడా బొప్పాయి ఒక మంచి పండు. ఇందులోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు సమస్యలున్న వారికి ఇది సహజ సహాయకంగా ఉంటుంది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గడంతో గుండె సజావుగా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది.

కళ్లను రక్షించడంలో..

కళ్లను రక్షించడంలో కూడా బొప్పాయి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసుతో వచ్చే కంటి సమస్యలను ఆలస్యం చేయడంలో ఇది సహాయపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు …

అదేవిధంగా శరీరంలో వాపు లేదా నొప్పి తగ్గించడంలో కూడా బొప్పాయి తోడ్పడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. కీళ్ల నొప్పితో బాధపడేవారికి ఇది ఉపశమనం ఇవ్వగలదు.

జీర్ణక్రియ మరింత…

రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మరింత సులభంగా జరుగుతుంది. భోజనం చేసిన తరువాత ఒక చిన్న గిన్నెడు బొప్పాయి తినడం వల్ల ఆహారం కడుపులో సులువుగా జీర్ణమవుతుంది. కడుపు బరువుగా అనిపించకుండా తేలికగా ఉండేలా చేస్తుంది. దీని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/things-you-should-not-store-in-kitchen-spice-box/

బరువు తగ్గాలని..

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి బొప్పాయి రాత్రిపూట మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న బొప్పాయిలో కేవలం 68 కేలరీలు మాత్రమే ఉంటాయి. అదనంగా ఇందులోని నీరు, ఫైబర్ పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. దీంతో ఆకలి తగ్గుతుంది. రాత్రి తీపి తినాలనే కోరిక ఉన్నప్పుడు బొప్పాయి తింటే అదనపు కేలరీలు తీసుకోకుండా నివారించవచ్చు.

తినే విధానం..

బొప్పాయిని తినే విధానం కూడా ముఖ్యం. భోజనం చేసిన 30 నుండి 60 నిమిషాల తర్వాత తినడం మంచిది. బొప్పాయి ముక్కలు చక్కెర లేదా క్రీమ్ లేకుండా తింటే ఆరోగ్యానికి మరింత ఉపయోగం ఉంటుంది. కొందరు దీనికి తోడుగా బాదం లేదా వాల్‌నట్ ముక్కలు కలిపి తింటారు. ఇవి కూడా పోషకాలను పెంచుతాయి.

అయితే బొప్పాయిని ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. అధికంగా తింటే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు బొప్పాయిని పాలతో కలిపి తినకూడదు. ఈ కలయిక జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (Irritable Bowel Syndrome) ఉన్నవారు బొప్పాయి తిన్న తర్వాత కొంత అసౌకర్యం అనుభవించే అవకాశం ఉంటుంది. అలాంటి వారు వైద్యుల సలహాతో మాత్రమే బొప్పాయి తినడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad