Wednesday, June 18, 2025
Homeహెల్త్Diseases in mansoon: రోగాల కాలం.. నిర్లక్ష్యంతో ప్రాణాలకే రిస్క్‌!

Diseases in mansoon: రోగాల కాలం.. నిర్లక్ష్యంతో ప్రాణాలకే రిస్క్‌!

వర్షాకాలం ప్రారంభమైంది. వేసవి ఎండల తాకిడి నుంచి కాస్త ఉపశమనం లభించింది. కానీ వానకాలం రోగాల కాలం అంటారు. ఈ కాలం వానలతో పాటు రోగాలను కూడా మోసుకొస్తుంది. నిర్లక్ష్యంగా ఉన్నామో ఇక అంతే సంగతులు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

వానకాలంలో వాతావరణంలో తేమ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వైరస్, ఫంగస్ తో పాటు బ్యాక్టీరియా, దోమలు వృద్ధి చెందడానికి అనువుగా ఉంటుంది. అలాగే వానకాలంలో రోగ నిరోధక శక్తి కూడా కొంత బలహీనపడుతుంది. దీంతో అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయా సమస్యలను సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే.. అవి ప్రాణాంతకంగా మారవచ్చు. వర్షాకాలంలో సాధారణంగా కనిపించే వ్యాధులు, వాటి నివారణ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో సాధారణ వ్యాధులు:

1. టైఫాయిడ్ (Typhoid):

మురికి నీరు లేదా అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది.

లక్షణాలు: జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, విరేచనాలు.

2. వైరల్ జ్వరం (Viral Fever):

వాతావరణ మార్పుల వల్ల వైరస్ సోకడంతో వైరల్ ఫీవర్ వస్తుంది.

లక్షణాలు: జ్వరం, జలుబు, దగ్గు, అలసట.

3. మలేరియా (Malaria):

దోమల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా నీరు నిలిచిన ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు: జ్వరం, చలి వణుకు, తలనొప్పి, శరీర నొప్పులు.

4. డెంగీ (Dengue):

అడిస్ దోమ కాటు వల్ల డెంగీ వ్యాపిస్తుంది.

లక్షణాలు: అధిక జ్వరం, శరీర నొప్పులు, బలహీనత, ప్లేట్‌లెట్ల తగ్గడం.

5. లెప్టోస్పిరోసిస్ (Leptospirosis):

మురికి నీటిలో నడవడం వల్ల బాక్టీరియా సోకి తద్వారా ఇది సోకుతుంది.

లక్షణాలు: జ్వరం, మలబద్దకం, చర్మం పసిపోవడం.

6. జలుబు & దగ్గు:

చలికాలంలో వాతావరణ మార్పులతో వచ్చే సాధారణ సమస్యలు ఇవి.

7. గ్యాస్ట్రోఎంటరైటిస్ (Gastroenteritis):

నీటి మార్గం ద్వారా వ్యాపించే వ్యాధి.

లక్షణాలు: వాంతులు, విరేచనాలు, నడుము నొప్పి.

నివారణా చిట్కాలు:

శుభ్రత పాటించండి.

మరిగించిన నీరు మాత్రమే త్రాగండి.

అపరిశుభ్ర ఆహారాన్ని తినకండి.

దోమల నుంచి రక్షణ కోసం నెట్‌లు, కాయిల్‌లు ఉపయోగించండి.

ఇంట్లో పలు చోట్ల నీరు నిలవకుండా చూసుకోండి.

రోడ్డుపై నిలిచిన నీటి దగ్గర నడవకండి.

వర్షంలో తడిసినప్పుడు ఎక్కువసేపు తడి బట్టలతో ఉండకుండా వాటిని వెంటనే మార్చండి.

శరీరాన్ని పొడిగా ఉంచండి.

జలుబు లేదా జ్వరం వస్తే వెంటనే చెకప్ చేయించుకుని.. ట్రీట్మెంట్ తీసుకోండి.

వర్షాకాలంలో చిన్న చిన్న జాగ్రత్తలతో ఏ పెద్ద వ్యాధులనైనా నివారించవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు శుభ్రత పాటించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News