మన శరీరం అనేక రకాల సహజ రక్షణ చర్యలను చేపడుతుంది. వాటిలో తుమ్ము కూడా ఒకటి. అయితే చాలా మంది తుమ్మును బలవంతంగా ఆపుకునే అలవాటు వేసుకుంటారు. ముఖ్యంగా, ఇతరుల ముందు తుమ్మితే అవతలి వారు ఏం అనుకుంటారో అనే భయంతో తుమ్ము వచ్చినా అదిమిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ, వైద్య నిపుణుల ప్రకారం, తుమ్మును ఆపుకోవడం ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం.
తుమ్ము అనేది మన శరీరం సహజంగా కలిగిన రక్షణ వ్యవస్థలో ఒక భాగం. ముక్కులోకి దుమ్ము, పొగ, బ్యాక్టీరియా లాంటి ఇరితెలియని పదార్థాలు ప్రవేశించినప్పుడు, వాటిని బయటికి పంపేందుకు శరీరం చేసే ప్రతిస్పందన తుమ్ము. ఒక అధ్యయనం ప్రకారం, తుమ్మినప్పుడు అది గంటకు 100 మైళ్ల వేగంతో బయటికి వస్తుంది. దాంతో పాటు, దాదాపు 10,000 సూక్ష్మ బిందువులు విడుదల అవుతాయి. తుమ్ము ముక్కు నుంచి కొన్ని సెకన్లలోనే.. దుమ్ము, ధూళీ, బ్యాక్టీరియాను తొలగించడానికి మన శరీర సహజ రక్షణ విధానం. తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తే ఈ చికాకులు, బ్యాక్టీరియా, దుమ్ము ముక్కులోనే ఉండిపోతాయ్. వీటి కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. తుమ్ము ద్వారా వీటిని బయటకు పంపితే.. ఉపశమనం పొందవచ్చు.
తుమ్మును బలవంతంగా ఆపితే.. ముక్కు, చెవులు, కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగితే.. అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా కర్ణభేరి పగిలిపోవడం, కళ్లలోని చిన్న రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు గొంతులోపల గాయం అయ్యే ప్రమాదం కూడా ఉందట.. అందుకే ఆ తప్పు అసలు చేయకూడదు. అంతేకాదు తుమ్ముని ఆపుకుంటే.. నాసికా భాగాల నుంచి గాలిని తిరిగి మీ చెవులకు మళ్లిస్తుంది. ఆ విషపదార్థాలతో కూడిన సూక్ష్మక్రిములు, శ్లేష్మం మీ మధ్య చెవికి పంపవచ్చు. ఇది ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతుంది.
తుమ్ములు బలవంతంగా ఆపుకుంటే.. కర్ణభేరి పగిలిపోయే అవకాశం ఉంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ముక్కు, చెవుల యుస్టాచియన్ గొట్టాల ద్వారా కనెక్ట్ అవుతాయని వైద్యులు చెపుతున్నారు. తుమ్ము ఆపుకుంటే.. ముక్కులో ఒత్తిడి పెరుగుతుంది, ఇది యుస్టాచియన్ గొట్టాల ద్వారా చెవికి ప్రవహిస్తుంది. దీంతో కర్ణభేరి పగిలే అవకాశం ఉంది. అంతే కాదు టింపాటిక్ పొరకి రంధ్రం పడడం అంటే తీవ్రమైన చెవి పోటు వస్తుంది.
తుమ్మును బలవంతంగా ఆపుకుంటే, కళ్లలోని చిన్న రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి, అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు తుమ్మును ఆపుకోవడం వల్ల గొంతులో తీవ్ర ఒత్తిడి ఏర్పడి, ఆ పరిధిలోని శరీర కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. చేతిని లేదా టిష్యూపేపర్ ఉపయోగించి తుమ్మాలి. టిష్యూ అందుబాటులో లేకపోతే, కోనికి మూసుకుని తుమ్మడం మంచిది. తుమ్మిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తుమ్ము అనేది శరీరం చెయ్యాల్సిన సహజ చర్య. దాన్ని అడ్డుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎప్పుడూ తుమ్మును ఆపుకోకుండా శరీర సహజ విధానాన్ని అనుసరించాలి.