షుగర్ పేషెంట్స్ చాలా మంది రైస్‌లో షుగర్ ఉంటుందని చాలా వరకూ అవైడ్ చేయాడానికి చూస్తారు. కానీ సరిగ్గా చెప్పాలంటే, షుగర్ పేషెంట్స్ ఎప్పుడూ వారి డైట్‌ని మానిటర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, మంచి ఆహారాన్ని తీసుకోవడం అవసరం. అయితే, షుగర్ పేషెంట్స్ అన్నం తినేటప్పుడు వేడి అన్నం తినాలా, చల్లారిన అన్నం తినాలా అనే సందేహాలకు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, చల్లారిన అన్నం తీసుకోవడం షుగర్ నియంత్రణకు దోహదం చేస్తుందని చెప్తున్నారు.
చల్లారిన అన్నం తాజాగా వండిన అన్నంతో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. అంటే, చల్లారిన అన్నం తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒకేసారి పెరగకుండా, నెమ్మదిగా విడుదలవుతాయి. ఈ కారణంగా, చల్లారిన అన్నం షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. చల్లారిన అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరిగిపోతుంది, ఇది GI ని తగ్గిస్తుంది. రెసిస్టెంట్ స్టార్చ్ శరీరంలో జీర్ణం అవుతూ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల పై తక్కువ ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా, ఇది డయాబిటీస్ పేషెంట్స్‌కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బరువు నియంత్రణ: చల్లారిన అన్నంలో ఉన్న రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల మనకు త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది బరువు నియంత్రణకు దోహదపడుతుంది. ముఖ్యంగా, డయాబిటీస్ ఉన్నవారికి ఇది సహాయపడుతుంది. కొంచెం బరువు తగ్గడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది, తద్వారా రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో రాగా ఉంటుంది. చల్లారిన అన్నంలో ఉన్న రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లో ఫెర్మెంటేషన్ జరిగి, షార్ట్ చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం ద్వారా మన మెటాబోలిక్ హెల్త్, గ్లూకోజ్ నియంత్రణలో హెల్ప్ చేస్తుంది.