హెల్ధీ పుడ్ (healthy food) ఎంచుకోవడమే కాదు వాటిని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకోవడమూ ముఖ్యమే. అప్పుడే వాటిలోని న్యూట్రిషన్స్ మన బాడీకి అందుతాయి. కానీ చాలామంది తెలిసి, తెలియక తినే పదార్ధాలకు అదనపు రుచిని అందించాలనో.. ఏవేవో పద్ధతుల్ని పాటిస్తుంటారు. అయితే ఇలా చేయటం వల్ల పదార్థాల్లోని పోషకాలు నశించి అవి బాడీకి అందక అనేక రకాల అనారోగ్య ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. కావునా ఇలాంటి వంట పద్ధతుల్ని పాటించకపోవడమే మంచిదంటున్నారు.
మరి ఎలా వండుకుంటే బాగుంటుందో.. పద్ధతులేంటో తెలుసుకుందాం పదండి.
డీప్ ఫ్రై చేయద్దు..!!
నూనెలో ప్రై చేసిన పదార్థాలంటే లొట్టలు వేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటాం. అయితే ఈ క్రమంలో నూనె ఆక్సిడైజ్ చెంది ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి డీప్ ఫ్రైడ్ పదార్థాల్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. అలాగే భవిష్యత్తులో ఊబకాయం బారినపడే అవకాశం ఉందన్నారు.
గ్రిల్లింగ్ చేసిన మాంసం తినద్దు..!!
ఇప్పుడు గ్రిల్లింగ్ చేసుకొని తినడం చాలా ఫ్యాషన్ అయింది. ఇది ఆరోగ్యకరం అని చెబుతుంటారు నిపుణులు. కాయగూరలు, పండ్లు వంటి కొన్ని పదార్ధాలకు మాత్రమే వర్తిస్తుందంటున్నారు. అదే మాంసాహారాన్ని ఈ పద్ధతిలో ఉడికిస్తే హెటరో సైక్లిక్ అమైన్స్ అనే రసాయనాలు వెలువడతాయట. సహజసిద్ధంగానే కార్సినోజెనిక్ స్వభావాన్ని కలిగి ఉండే ఈ రసాయనాలు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును పెంచుతాయంటున్నారు నిపుణులు.
వేపుళ్లుకు చెక్ పెట్టాల్సిందే..!!
మధ్యాహ్నం, రాత్రిళ్లు ఏదో ఒక వేపుడు లేనిదే ముద్ద దిగదంటున్నారు చాలామంది. అయితే ఆయా కాయగూరల్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించే క్రమంలో అక్రిలమైడ్ అనే రసాయనం వెలువడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇది భవిష్యత్తులో క్యాన్సర్ కారకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోస్టింగ్, బేకింగ్ పద్ధతుల్లో తయారుచేసే పదార్థాలతోనూ ఈ ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.
ఎయిర్ ప్రైయింగ్ ద్వారా క్యాన్సర్ ముప్పు
ఎయిర్ ప్రైయింగ్ ద్వారా క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. పదార్థాలు సరిగ్గా ఉడక్కపోవచ్చంటున్నారు నిపుణులు. మిగతా పద్ధతులతో పోల్చితే ఇది కాస్త ఆరోగ్యకరమైనదే అయినా తరచూ ఈ పద్ధతిని పాటించకపోవడమే మంచిదంటున్నారు. మంట, పొగపై కొన్ని పదార్థాల్ని ఉడికించి తినటం వల్ల ఇది ధూమపానం చేసినంత హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు వెలువడతాయని, వీటి వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందంటున్నారు.
మైక్రోవేవింగ్ లో కొన్ని పదార్థాల్ని వండుకోవడం, తిరిగి వేడి చేసుకోవడం మనలో చాలామంది చేస్తుంటాం అయితే ఈ పద్ధతిలో విడుదలయ్యే రేడియేషన్ కారణంగా బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ప్రస్తుతం చాలామంది నానిస్టిక్ వంట పాత్రల్ని ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో ఉండే టెఫ్లాన్ కోటింగ్ అధిక ఉష్ణోగ్రత వల్ల కరిగి వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
అనారోగ్యాల్ని తెచ్చి పెట్టే ఈ పద్ధతులకు బ్రేక్ పెట్టి సంప్రదాయ పద్ధతుల్ని పాటించడం చాలా మంచిదంటున్నారు నిపుణులు.
నూనె ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఆవిరిపై ఉడికించిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి.దీనికి తోడు ఈ ఆవిరి చెడు కొవ్వుల్ని తొలగించేస్తుంది.అధిక ఉష్ణోగ్రతల వద్ద కాకుండా మనం వండుకునే పదార్థాల్ని స్టౌపై సిమ్‌లో పెట్టి ఉడికిస్తే మంచిదంటున్నారు నిపుణులు. వంట కోసం ఆలివ్, క్యానోలా.. వంటి నూనెల్ని వాడాలని సూచిస్తున్నారు. వంటల్లో ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్, కృత్రిమ రంగుల్ని తగ్గించాలంటున్నారు.వంటలు చేసేందుకు స్టీలు, సెరామిక్, మట్టి వంటి మెటీరియల్స్‌తో తయారుచేసినవి ఎంచుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.