Friday, February 7, 2025
Homeహెల్త్Coriander: ఈ చిట్కాలు పాటిస్తే కొత్తిమీర అసలు పాడైపోదు..!!

Coriander: ఈ చిట్కాలు పాటిస్తే కొత్తిమీర అసలు పాడైపోదు..!!

వెజ్, నాన్ వెజ్ ఏదైనా కొత్తిమీర లేనిదే మహిళలు వంటలు చేయరు. కాబట్టి మన కిచెన్ లో తప్పనిసరిగా ఈ కొత్తిమీర ఉంటుంది. వంట చేసిన తర్వాత ఆ కూరలో కొత్తిమీర వేయడం వల్ల అది మరింత రుచిగా మారుతుంది. అంతే కాదు ఈ కొత్తిమీర శీతాకాలంలో చౌకగా దొరికినా, వేసవిలో దాని ధర అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. అందుకే మహిళలు ఈ కొత్తిమీరను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలని అనుకుంటూ ఉంటారు.

కానీ ఈ కొత్తిమీరను ఎక్కువ రోజుల పాటు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయలేము. ఎందుకంటే కొత్తిమీర తాజాదనాన్ని కోల్పోతుంది. మరి ఎలా చేస్తే కొత్తిమీరను రెండు నుండి మూడు వారాల పాటు తాజాగా ఉంచుతాయో చూద్దాం. ఈ పద్దతుల్లో చేయటం వల్ల మరి ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో కొత్తిమీరను నిల్వ చేసుకోవటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.

గాలి చొరబడని కంటైనర్‌లో..
కొత్తిమీరను నీటుగా కట్ చేసి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా కొత్తిమీరను మార్కెట్ నుంచి తెచ్చాక ఆకులను కడిగి ఆరబెట్టాలి. తర్వాత దాని వేర్లను కత్తిరించాల్సి ఉంటుంది. కొత్తిమీర ఆకులను నీటిలో బాగా నానబెట్టి, ఆరబెట్టాలి. తరువాత దానిని చిన్న ముక్కలుగా కట్ చేేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తరిగిన కొత్తిమీరను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి ఫ్రిడ్జులో పెట్టకోవటం వల్ల రెండు వారాల వరకు తాజాగా, సువాసనగా ఉంటుంది.

- Advertisement -

జిప్ లాక్ బ్యాగ్..
ఇప్పుడు ఈ జిప్ బ్యాగ్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసుకుని ఈ కొత్తిమీరను నిల్వ ఉంచుకోవటంతో ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే ముందుగా కొత్తిమీరను మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చాక కట్టను విడదీసి అందులో ఉండే గడ్డిని తీసివేయాలి. అనంతరం కొమ్మలు కడిగి, వాటి వేర్లను తొలగించండి. ఆకులు కాసేపు ఆరనివ్వాలి. తరువాత వాటిని జిప్-లాక్ బ్యాగ్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో పెట్టడంతో ఎక్కువ రోజులు కొత్తిమీర నిల్వ ఉంటుంది.

నీటిలో నానబెట్టండి
మాములుగా నీటిలో ఎక్కువ సేపు కొత్తిమీర ఉంచటం వల్ల పాచి పడుతుంది. మరి ఏంటి మళ్లీ నీటిలో కొత్తిమీరను ఉంచాలంటున్నారు అనుకుంటున్నారా..? అవును కొత్తిమీరను తాజాగా ఉంచడానికి నీటిలో నానబెట్టవచ్చు. అయితే కొత్తిమీర ఆకులను కడిగి ఆరబెట్టి, తర్వాత సగం గ్లాసు నీళ్లు పోసి కొత్తిమీర వేయాలి. ప్రతిరోజూ నీటిని మార్చాలంటున్నారు. మళ్లీ అదే గ్లాసును శుభ్రంగా కడిగి రిఫ్రిజిరేటర్‌లో ఉంచుకోవచ్చు. ఇలా చేయటం వల్ల కొత్తిమీరను 3 వారాల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.

ప్లాస్టిక్ కంటైనర్‌
మీరు ఫ్రెష్ గా కొన్న కొత్తిమీరను ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంచుకోవటం వల్ల అది పాడైపోదు. ముందుగా కొత్తిమీరను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీర వేర్లను కత్తిరించి, వాటి ఆకులను ఒక గుడ్డలో పరిచి ఆరబెట్టాల్సి ఉంటుంది. అవి బాగా ఆరిన తర్వాత శుభ్రమైన ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచుకోవాలి. ఇలా ఈ పద్ధతి పాటిచటం వల్ల కొత్తిమీరను రెండు వారాల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News