Sunday, October 6, 2024
Homeహెల్త్Kitchen tips: నల్లమచ్చలకు వంటింటి చిట్కాలు

Kitchen tips: నల్లమచ్చలకు వంటింటి చిట్కాలు

మెరిసే చర్మం ఆరోగ్యానికి చిహ్నం. అయితే మచ్చలేని చర్మాన్ని కలిగి ఉండడమంటే ఎలాంటి ఒత్తిడి లేని జీవితం అయిండాలి. కాలుష్యం బారిన పడకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. జన్యుసంబంధిత కారణాల నుంచి పైన చెప్పిన వాటివల్ల నల్లమచ్చల సమస్య ఎదురవుతుంటుంది. చర్మంపై ఇలాంటి మచ్చలు ఏర్పడడం అన్ని వయసుల వారిలో, అన్ని రకాల చర్మ ఉన్న వారిలోనూ కనిపించే ముఖ్యమైన సమస్య. చర్మంపై ఏర్పడే మచ్చల్లో నల్లమచ్చలతో పాటు యాక్నే, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటివి కూడా చూడొచ్చు. వాటిల్లో కొన్ని వయసుతోపాటు తలెత్తే మచ్చలు కూడా ఉంటాయి. సూర్యరశ్మి బారిన పడడం వల్ల పెద్దవాళ్లకు, యంగ్ గా ఉన్నవారికి కూడా ముఖంపై మచ్చలు వస్తుంటాయి. యాక్నే వల్ల, గాయాల వల్ల ముఖంపై గీతలు ఏర్పడుతుంటాయి. మందులు వాడడంతో,
ఇంటి చిట్కాలతో వీటిని తగ్గించుకోవచ్చు. జన్యుసంబంధమైన కారణాలతో పాటు పర్యావరణంలో తలెత్తిన మార్పులు, ఎక్కువ నూనె గ్రంధులు ఉండడం వల్ల, హార్మోన్ల కారణంగా, అలాగే తీసుకునే డైట్, స్కిన్ అలర్జీల వల్ల కూడా ముఖంపై ఇలాంటి రకరకాల మచ్చలు ఏర్పడుతుంటాయి. పరిశుభ్రత, ఆరోగ్యకరమైన డైట్ అలవాట్లతో, సూర్యరశ్మి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా , నిత్యం సరైన స్కిన్ కేర్ రొటీన్ అనుసరించడం వల్ల, చర్మాన్ని తరచూ ఎక్స్ ఫొయలేట్ చేసుకోవడం వల్ల, నీరు బాగా తాగడం వల్ల ముఖంపై ఇలాంటి మచ్చలు ఏర్పడకుండా అడ్డుకోగలం.

- Advertisement -

వీటిని తగ్గించుకోవడానికి కొన్ని వంటింటి చిట్కాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి నల్లగా ఉన్న చర్మంపై టీ ట్రీ ఆయిల్ లేదా అలొవిరా లేదా తేనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదా నిమ్మరసం లేదా యాపిల్ సిడార్ వెనిగర్ ను టోనర్ గా నల్లగా ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే దెబ్బతిన్న చర్మం ఎక్స్ ఫొయిలేట్ అయి కాంతివంతంగా మారుతుంది. లేదా రెండు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్,పావు టేబుల్ స్పూను దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై పూసుకుని ఐదు నుంచి పదినిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మచ్చలు పోవడానికి మరో వంటింటి చిట్కా ఏమిటంటే బాగా పండిన టొమాటో తీసుకుని దాని రసం తీసి ఆ రసాన్ని ముఖంపై రాసుకుని చర్మం పొడారిపోయేవరకూ అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా పదిహేను రోజులు వరుసగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం నల్లగా అయిన చోట ముడి తేనె రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉండి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే చర్మంపై మంచి ప్రభావం కనపడుతుంది. కోకో బటర్ తీసుకుని మచ్చలు ఉన్నచోట రాసి రెండు మూడు నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా రోజుకొకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసి దాన్ని మచ్చలు ఏర్పడ్డ చోట రాసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ఆ ప్రదేశాన్ని కడిగేసుకోవాలి. ఇది కూడా నల్లమచ్చలను పోగొట్టడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News