Friday, November 22, 2024
Homeహెల్త్Kitchen tips: చిన్న ట్రిక్స్ తో సూపర్ లైఫ్

Kitchen tips: చిన్న ట్రిక్స్ తో సూపర్ లైఫ్

వంటింటి చిట్కాలు
 బాగా పండిన టొమాటోలను ఉప్పు కలిపిన చల్లటి నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికి తాజాగా తయారవుతాయి.
 వెల్లుల్లి రెబ్బలను నీటిలో గంటసేపు నానబెడితే వాటిపై పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
 బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో పెడితే మెత్తబడవు.
 కూరగాయముక్కలను పసుపునీటిటో ఉంచితే వాటిల్లోని సూక్ష్మక్రిములు నశిస్తాయి.
 కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేస్తే పురుగుపట్టదు.
 వర్షాలలో బట్టలు వాసన రాకుండా ఉండాలంటే బట్టలు ఉతికిన తర్వాత నీళ్లల్లో కొంత నిమ్మరసం కలిపి అందులో దుస్తులను ముంచి ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల నుంచి దుర్వాసన రాదు.

- Advertisement -

 గ్రేవీ చిక్కగా రావాలంటే కొద్దిగా కొబ్బరిపాలు లేదా బాగా గిలక్కొట్టిన పెరుగు కలపాలి.
 వంటింట్లో పెట్టే చెత్తడబ్బా నుంచి దుర్వాసన రాకుండా ఉండడానికి వాడేసిన టీపొడి లేదా రెండు టీ శాచెట్స్ ను అందులో వేయాలి.
 నీళ్ల కుళాయిలపై పడిన మచ్చలను నిమ్మ చెక్కతో రుద్దితే పోతాయి.
 పప్పు బాగా ఉడికి రుచిగా ఉండాలంటే అందులో ఒక టీ స్పూను నువ్వుల నూనె వేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News