Saturday, November 23, 2024
Homeహెల్త్Lemons benefits: నిమ్మతో అందం, ఆరోగ్యం

Lemons benefits: నిమ్మతో అందం, ఆరోగ్యం

సీ విటమిన్ లో రారాజు నిమ్మకాయలు

నిమ్మతో రుచికరమైన లెమనాయిడ్ చేసుకోవచ్చు. మరెన్నో రెసిపీలు, డ్రింకులు చేసుకోవచ్చు. అంతేకాదు ఆరోగ్యానికి ఇది మంచి బూస్టర్. అందాన్ని సైతం రెట్టింపు చేసే సూపర్ ఫుడ్. నిమ్మకాయ గుజ్జులో కొద్దిగా ఉప్పు జోడించి తింటే వికారం తగ్గడమే కాదు జీర్ణశక్తికి కూడా అది ఎంతో మంచిదంటారు ఆయుర్వేద నిపుణులు.

- Advertisement -

రుచిని పెంచే గుణాలు నిమ్మ సొంతం. ఒత్తిడితో ఉన్నప్పుడు నిత్యం మీరు వాడే ఆయిల్ లో నిమ్మ ఎసన్షియల్ ఆయిల్ని కలుపుకుని మాడుకు మర్దనా చేసుకుంటే పొందే సాంత్వన ఎంతో. ఇందులో కాలరీలు తక్కువగా ఉంటాయి. నిమ్మకాయల్లో మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, పొటాషియం, జింక్, యాంటాక్సిడెంట్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి.

నిమ్మకాయను నిత్యం వాడడం వల్ల మనం పొందే ఆరోగ్య లాభాలు అనంతం. నిమ్మ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయల్లో అధికపాళ్లల్లో విటమిన్ సి, యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు జలుబు, దగ్గు కారక సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లల్లో నిమ్మరసం పిండి, ఒక టేబుల్ స్పూను తేనె అందులో కలిపి నిత్యం తాగడంవల్ల నిమ్మ అందించే పూర్తి లాభాలను పొందుతాం. ఈ నీళ్లు తాగితే జలుబు, దగ్గుల తీవ్రత తగ్గుతుంది. నిమ్మకాయలను నిత్యం ఉపయోగించడం వల్ల శరీరంలోని కొలస్ట్రాల్ ప్రమాణాలు తగ్గుతాయి. ఒక స్టడీ ప్రకారం చెడు కొలెస్ట్రాల్ ను నిమ్మ బాగా తగ్గిస్తుందని వెల్లడైంది. నిమ్మకాయల్లో ఫ్లెవనాయుడ్స్ కూడా బాగా
ఎక్కువ. ఇవి ట్రైగ్లిజరైడ్స్ ను, ఎల్ డి ఎల్ ను తగ్గిస్తాయి.

చిన్న నిమ్మకాయలో సొల్యుబుల్ ఫైబర్ బాగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. నిమ్మలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ గట్ హెల్త్ కు ఎంతగానో సహకరిస్తుంది. జీర్ణశక్తిని క్రమబద్ధీకరిస్తుంది కూడా. తేనె
కలిపిన గ్లాసుడు నిమ్మ నీళ్లు చేసే అద్భుతాలు ఎన్నో. ఇందులోని ఫైబర్ వల్ల తొందరగా ఆకలి వేయదు.అందువల్ల స్నాక్స్ క్రేవింగ్స్ మనకు ఉండవు. ఫలితంగా బరువు కూడా పెరగం. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కూడా నిమ్మకాయ నిరోధిస్తుంది. ఈ పండులో సిట్రిక్ యాసిడ్ బాగా ఉంటుంది. అది కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే నిమ్మను రోజుకు రెండు నుంచి మూడు కాయలు వినియోగించవచ్చు. వీటిని అతిగా వాడినా మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి.

నిమ్మకాయలను అతిగా వాడడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. స్కిన్ కేర్ కు కూడా నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని నుంచి తీసిన ఎక్స్ ట్రాక్ట్స్ ను పలు స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో సైతం వాడతారు. చర్మ ఎలాస్టిసిటీని కాపాడే కొల్లాజెన్ ను నిమ్మ ఎక్కువగా ఉత్పత్తిచేస్తుంది. దీంతో మీరు నిత్యయవ్వనులుగా కనపడతారు. నిమ్మలోని విటమిన్ సి దెబ్బతిన్న చర్మకణాలను బాగుచేస్తాయి. చర్మంలోని కొల్లాజెన్ ను ఫ్రీరాడికల్స్ దెబ్బతీస్తాయనే విషయం తెలిసిందే. యాంటాక్సిడెంట్ స్వభావం ఉన్న విటమిన్ సి ఫ్రీరాడికల్స్ ను నిరోధిస్తాయి. నిమ్మ ఎక్స్ ట్రాక్ట్స్, విటమిన్ సి రెండూ బాగా ఉన్న చర్మ లోషన్ ను రాత్రి సమయంలో రాసుకోవడం వల్ల నిమ్మ వల్ల పొందే అన్ని లాభాలు చర్మానికి చేరతాయి. యాక్నే మార్క్స్ ను కూడా నిమ్మ లోషన్ పోగొడుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

నిమ్మలోని విటమిన్ సి వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది. నిమ్మతో చేసిన స్కిన్ కేర్ ఉత్పత్తులు యాక్నే సమస్యను పరిష్కరిస్తాయి. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. బాక్టీరియాను చంపేస్తుంది. చర్మం నుంచి స్రవించే నూనె గ్రంధులను తగ్గిస్తాయి. నిమ్మరసాన్ని నేరుగా చర్మానికి అప్లై చేస్తే చర్మం దెబ్బతింటుంది. మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉంటాయి. ఆ మురికి నిమ్మ, విటమిన్ సిలతో తయారుచేసిన స్కిన్ కేర్ లోషన్ తో బాగా తగ్గుతాయి . చర్మంపై ఏర్పడ్డ పిగ్మెంటేషన్ ను తగ్గించడమే కాకుండా చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ను కూడా నిమ్మతో చేసిన లోషన్లు అందిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News