మేకప్ మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే మేకప్ వేసుకోవడాన్ని మనం ఎంత ముఖ్యంగా భావిస్తామో దాన్ని తొలగించే విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి. అప్పుడే మన సహజ అందం సురక్షితంగా ఉంటుంది. అందుకే మేకప్ ను జాగ్రత్తగా తొలగించుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. అవి…
బేబీ ఆయిల్ తో ముఖానికున్న మేకప్ ను సులభంగా తొలగించుకోవచ్చు. దూది ఉండ తీసుకుని దానిపై కొన్ని చుక్కల బేబీ ఆయిల్ వేసి ముఖంపై ఉన్న మేకప్ ను ఆ దూదితో సున్నితంగా తుడిచేసుకోవాలి. కళ్లపై, పెదాలపై ఉన్న మేకప్ ను కూడా జాగ్రత్తగా దూదితో శుభ్రం చేసుకోవాలి.
పెట్రోలియం జెల్లీతో ముఖానికున్నమేకప్ ను శుభ్రం చేసుకోవచ్చు. మేకప్ ను సులభంగా తీసేయొచ్చు. కళ్ల దగ్గరగా ఉండే మేకప్ ను ఈ జెల్లీతో సురక్షితంగా తొలగించుకోవచ్చు.
మిసిల్లార్ వాటర్ తో కాటన్ ఉండను తడిపి దాంతో ముఖంపై మెల్లగా ఒత్తుతూ మేకప్ ను తొలగించుకోవచ్చు. కాటన్ ఉండలు కాకుండా ఫ్లాట్ గా ఉండే కాటన్ ప్యాడ్స్ ను మేకప్ ను తొలగించుకోవడానికి ఉపయోగించాలి.
వాటర్ ప్రూఫ్ మేకప్ ను కొబ్బరి నూనెతో బాగా శుభ్రంచేసుకోవచ్చు.
క్లీన్సర్స్ తో ముఖాన్ని పదిహేను సెకన్లపాటు మసాజ్ చేయాలి. గడ్డం కింద, చెవుల వెనుక ఉన్న మేకప్ ను , ముఖంపై ఉండే మేకప్ ను క్లీన్సర్లు బాగా శుభ్రం చేస్తాయి.
వేడి నీళ్లతో ముఖాన్ని ఒకటి లేదా రెండు నిమిషాలు ఆవిరి పట్టుకోవాలి. నీటి ఆవిరితో చర్మంపై మూసుకుపోయిన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ రంధ్రాల నుంచి క్లీన్సర్స్ చర్మం లోపలికి వెళ్లి మేకప్ పార్టికల్స్ ను, లోపల చేరిన మురికిని పూర్తిగా తొలగిస్తాయి.