Friday, September 20, 2024
Homeహెల్త్Miracles of Coconut oil: మెరిసే చర్మం, ఒత్తైన జుట్టునిచ్చే కొబ్బరినూనె

Miracles of Coconut oil: మెరిసే చర్మం, ఒత్తైన జుట్టునిచ్చే కొబ్బరినూనె

కొబ్బరినూనె ఆరోగ్యానికి వరం

కొబ్బరినూనెని మీరు రోజూ వాడతారా? అయితే మీ శిరోజాలు, చర్మం సురక్షితం అంటున్నారు బ్యూటీ నిపుణులు. కొబ్బరినూనె చర్మానికి మాయిశ్చరైజర్ ని బాగా అందిస్తుంది.  అంతేకాదు ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ కూడా.  కొబ్బరినూనెలోని ఫ్యాటీ యాసిడ్లు చర్మం, వెంట్రుకల లోపలికి చొచ్చుకపోయి చాలా సేపు, శిరోజాలు, చర్మానికి కావలసి హైడ్రేషన్ ని అందిస్తాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. కొబ్బరినూనె వెంట్రుకలకు నేచురల్ కండిషనర్ గా పనిచేస్తుందని శిరోజాల నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

జుట్టు పాయల్లోకంటా ఈనూనె చొచ్చుకుపోయి ప్రొటీన్లు నష్టపోకుండా సంరక్షిస్తుందంటున్నారు. జుట్టు కండిషన్ కోల్పోకుండా ఉండాలంటే ప్రొటీన్లను కోల్పోకూడదు. జుట్టు రేగినట్టు ఉండకుండా కొబ్బరినూనె సహాయపడుతుంది. కొద్దిగా కొబ్బరినూనె చేతులకు రాసుకుని దాన్ని జుట్టుకు పట్టిస్తే రేగినట్టుండే వెంట్రుకలు మెరుస్తాయి. చుండ్రును సైతం కొబ్బరినూనె నివారిస్తుంది.   సాధారణంగా పొడిగా ఉన్న మాడు వల్ల చుండ్రు సమస్య  లెత్తుతుంది. గోరువెచ్చగా చేసిన కొబ్బరినూనెతో వెంట్రుకలకు మసాజ్ చేసి అరగంట  అలాగే వదిలేయాలి.  ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య పోతుందని నిపుణులు భరోసా ఇస్తున్నారు.  అంతేకాదు కొబ్బరినూనె క్లీన్సర్ గా కూడా పనిచేస్తుంది. ఈ నూనెలో యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్,  మాయిశ్చరైజింగ్ సుగుణాలు బోలెడు ఉన్నాయి.

కొబ్బరినూనెతో మాడును సున్నితంగా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  శిరోజాలు నల్లగా నిగ నిగ మెరవాలంటే, జుట్టు మృదువుగా ఉండాలంటే జుట్టు పాయలకు కొబ్బరి నూనెను అంచులకంటా బాగా పట్టించాలి. అలా అని అతిగా కొబ్బరినూనెను జుట్టు పాయలకు పట్టిస్తే అవి జిడ్డుగా తయారవుతాయని మరవకండి. చివరిగా మరో  ముఖ్యమైన ఏమిటంటే, జుట్టుకు కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరినూనె చేసే లాభాలు ఎన్నో ఉన్నాయి. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ శిరోజాలకు మంచి కండిషనర్ గా పనిచేయడమే కాకుండా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. దీంతో జుట్టు నల్లగా నిగనిగలాడుతూ పట్టులా ఉంటుంది. అంతేకాదు జుట్టు కొసలు చిట్లకుండా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.  ఇది జుట్టుకు వన్ స్పాట్ సొల్యూషన్ అనడంలో సందేహం లేదు.

కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ లో పోషకాలు బాగా ఉన్నాయి. ఈ కొబ్బరినూనె మాడును ఉత్తేజితం చేయడమే కాకుండా ఆరోగ్యవంతమైన శిరోజాలు పెరుగుతాయి. అంతేకాదు మాడుకు వచ్చే చుండ్రు దగ్గర నుంచి రకరకాల ఇన్ఫెక్షన్లను సైతం ఈ ఆయిల్ నియంత్రిస్తుంది కూడా. వీటితో పాటు చర్మానికి సరిపడా మాయిశ్చరైజర్ ని కూడా అందిస్తుంది. అంతేకాదు కెమికల్ ఫ్రీ మేకప్ రిమూవర్ గా కూడా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ పనిచేస్తుంది. యాక్నే తలెత్తకుండా  నిరోధిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News