Wednesday, October 30, 2024
Homeహెల్త్Mother feeding: ఇవి తింటే తల్లిపాలకు లోటు రాదు

Mother feeding: ఇవి తింటే తల్లిపాలకు లోటు రాదు

బిడ్డ పుట్టిన తర్వాత పాలు రాక ఈ మధ్య కాలంలో ఎంతోమంది తల్లులు ఇబ్బంది పడుతున్నారు. తమ పసిపిల్లలకు తల్లిపాలు ఇవ్వలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. తల్లిపాలు బిడ్డలకు అందించే ఆరోగ్యం, పోషకాలు మాటల్లో చెప్పలేనివి. ఇలాంటి సమస్య కాబోయే తల్లులు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని రకాల పదార్థాలు వాళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అవి తల్లిపాలు సమృద్ధిగా శరీరంలో ఉత్పత్తి అయ్యేలా సహకరిస్తాయి. వెల్లుల్లిలో బ్రెస్ట్‌ పాలు ఉత్పత్తి చేసే గుణం ఉంది. ఉదయమే గోరువెచ్చని నీటితో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మంచిది. లేదా మనం వండుకునే కూరల్లో, సూపులో వెల్లుల్లి వేసుకుని కూడా తినొచ్చు. జీలకర్ర కూడా నిత్యం తింటే తల్లి పాలు వృద్ధి చెందుతాయి.

- Advertisement -

జీలకర్రలో పోషకాలు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి కూడా. తినే వంటల్లో జీలకర్ర వాడకం వల్ల కడుపు ఉబ్బరం, కడుపులో పోట్లు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తలెత్తవు. సోంపు గింజలు తినడం వల్ల కూడా బ్రెస్ట్‌ మిల్క్‌ శరీరంలో బాగా ఉత్పత్తి అవుతుంది. వీటిల్లో ఈస్ట్రోజన్‌ లాంటి పదార్థం ఉంటుంది. ఇది తల్లి పాలను శరీరంలో బాగా ఉత్పత్తి అయ్యేట్టు చేస్తాయి. సోంపు గింజలతో టీ చేసుకుని తాగొచ్చు. లేదా వీటిని కూరల్లో వేసుకుని తినొచ్చు.

మనం నిత్యం వాడే మెంతుల్లో ఈస్ట్రోజన్‌ బాపతు కాంపౌండ్లు ఉంటాయి. ఇవి శరీరంలో తల్లి పాల ఉత్పత్తికి ఎంతగానో సహకరిస్తాయి. రోజుకు రెండుసార్లు మెంతి టీ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ బాగా ఉండే పాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో తల్లి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అందుకే రోజుకు ఒక గ్లాసు పాలు తప్పనిసరిగా తాగాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News