Sunday, October 6, 2024
Homeహెల్త్Nasal drops: రూ. 800కు నాజల్ డ్రాప్స్, కొవిన్ లో ఇకొవాక్ బుక్ చేసుకోండి

Nasal drops: రూ. 800కు నాజల్ డ్రాప్స్, కొవిన్ లో ఇకొవాక్ బుక్ చేసుకోండి

కోవిడ్ మళ్లీ బుసలు కొడుతున్న వేళ బూస్టర్ డోసుకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ టీకా బదులు నాజల్ డ్రాప్స్ టీకా కావలనుకునే వారు భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఒక్క డోస్ ధర 800 రూపాయలు కాగా ట్యాక్సులు ఎక్ట్స్రా పే చేయాలని సంస్థ ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం జస్ట్ 320 రూపాయలకే టీకా ఇవ్వనుంది భారత్ బయోటెక్. ‘ఇంకొవాక్’ వ్యాక్సిన్ మీకు ‘కొవిన్’ యాప్ లో కూడా ఉంది. జనవరి నెలాఖరులో ఈ నాజల్ డ్రాప్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. మీరు ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా తీసుకుంటేమాత్రం ఇంకొవాక్ నాజల్ టీకా బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే మీ నాజల్ డ్రాప్స్ బుక్ చేసుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News