Saturday, November 23, 2024
Homeహెల్త్Natural dish washing: గిన్నెలను మెరిసేలా చేసే..

Natural dish washing: గిన్నెలను మెరిసేలా చేసే..

అంటగిన్నెలు తోమడానికి మార్కెట్లో రకరకాల డిష్ వాషింగ్ సోప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ రసాయనాలతో నిండిఉంటాయి. అలాంటి డిష్ వాషింగ్ సోప్స్ తో పనిలేకుండా సహజపద్ధతుల్లో అంటగిన్నెలను మిలమిలలాడేలా తోముకోవచ్చు. అలాంటి కొన్ని నేచురల్ టిప్స్ మీకోసం…
 బేకింగ్ సోడాతో అంటగిన్నెలు తోమితే ఎంతో శుభ్రంగా ఉంటాయి. గోరువెచ్చని నీటితో గిన్నెలు కడిగి దానిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి ఐదు లేదా పది నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత స్పాంజ్ ని నీటిలో ముంచి దానితో ఆ గిన్నెలను తోమాలి. అంతే గిన్నెలు తళ తళలాడుతుంటాయి.
 నిమ్మకాయ మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు గిన్నెలను కూడా ఎంతో శుభ్రం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా నాలుగైదు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని అందులో గింజలు పడకుండా నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఆ పేస్టుతో గిన్నెలు తోమితే శుభ్రంగా ఉండడంతో పాటు మంచి సువాసనలు చిందిస్తాయి.
 బూడిదతో అంటగిన్నెలు తోమినా ఎంతో శుభ్రంగా ఉంటాయి.
 వంటపదార్థాల్లో టమోటాలు వాడేటప్పుడు దాని తొక్కను తీసి బయట పారేస్తుంటాం చాలామంది. కానీ అది మంచి క్లీనింగ్ ఏజెంటు. ఆ టొమాటో తొక్కు డిష్ వాషింగ్ సోప్ లాగ బాగా పనిచేస్తుంది. టొమాటో తొక్కుతో తోమిన గిన్నెలు తళ తళలాడుతుంటాయి. మీరు చేయాల్సిందల్లా టొమాటో తొక్కతో గిన్నెలను తోమి వాటిని పది లేదా పదిహేను నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్లతో గిన్నెలను శుభ్రంగా కడగాలి అంతే.
 బియ్యం గంజి కూడా అంటగిన్నెలను తళ తళ మెరిసేలా చేస్తుంది. గంజినీళ్లల్లో స్పాంజిని ముంచి దాంతో అంటగిన్నెలు తోమాలి. ఇందులోని గంజి గిన్నెలకు పట్టిన జిడ్డును బాగా పోగొడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News