Saturday, November 23, 2024
Homeహెల్త్Naturally beautifull look: సహజమైన అందానికి

Naturally beautifull look: సహజమైన అందానికి

హైజీన్, పర్సనల్ హైజీన్ తో సగం అందం వచ్చేస్తుందనే విషయం మరవద్దు

అందంగా కనిపించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కానీ వేగం వేదం అయిన ఈ కాలంలో బ్యూటీ కోసం టైము వెచ్చించే సావకాశం ఎంతమందికి ఉంటోందన్నదే ప్రశ్న. అందుకే సహజ పద్ధతుల్లో అందంగా కనిపించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు బ్యూటీ నిపుణులు. అలాంటి నేచురల్ పద్ధతుల్లో బాగా నిద్రపోవడం చాలా ముఖ్యమైంది. అందంగా కనిపించడంలో నిద్ర కీలకమైన అంతర్భాగం అనేది గుర్తిస్తున్న వాళ్లు చాలా తక్కువమంది ఉంటున్నారు. సరిపడినంత నిద్ర పోతే ఆరోగ్యంగానే కాదు అందంతో మెరిసిపోతారు. చర్మం కూడా ఆరోగ్యకరమైన మేనిచాయతో మెరిసిపోతుంది. అందుకే రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని స్లీప్ నిపుణులు చెప్తున్నారు. అన్ని రకాల ఒత్తిడులను పారద్రోలి మనసును ప్రశాంతంగా ఉంచేది నిద్రే. ఆ ప్రశాంతత దొరికితే మీ అందం రెట్టింపవుతుంది.  

- Advertisement -

శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అందాన్ని పెంచే సహజమైన బ్యూటీ చిట్కా. దీనికోసం నిత్యం స్నానం చేయాలి. దంతాలను రోజుకు రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా కనిపిస్తూ, చూడడానికి ఎంతో తాజాదనంతో, సువాసనల సౌరభాలతో ఉండాలి. మీ అందమైన చిరునవ్వు ఎందరి ఎటెన్షనో ఆకర్షిస్తుంది. పెర్ఫ్యూమ్స్ వాడినా వాడకపోయినా శరీరం సువాసనలు చిందించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ కేర్ రొటీన్ ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అన్ని రకాల చర్మాలు ఎంతో అందమైనవే అయిన్పటికీ అందరూ ఆరోగ్యకరమైన, పట్టులాంటి చర్మాన్ని కోరుకుంటారు. చాలా రకాల స్కిన్ టైప్స్ కు జంటిల్ క్లీన్సర్, యాంటాక్సిడెంట్లు నాణ్యమైన సెరమ్, మాయిశ్చరైజర్లు మంచివి. వారానికి లేదా ప్రతి పదిహేనురోజుల కొకసారి మంచి ఫేస్ మాస్కు ముఖానికి వేసుకోవాలి. సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. ఇది చర్మాన్ని పట్టులా మెరిసేలా చేస్తుంది.  

  వెంట్రుకలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. వాటిపట్ల తగిన జాగ్రత్త వహించాలి. రెగ్యులర్ ట్రిమ్స్ తో పాటు జుట్టుకు సున్నితంగా ఉండే ఉత్పత్తులను వాడడం మంచిది. ఉదాహరణకు జుట్టుకు రంగు వేసుకోవాలనుకున్నారనుకోండి నాణ్యమైన ఉత్పత్తిని మాత్రమే అందుకు  ఉపయోగించడం వల్ల వెంట్రుకలు, జుట్టు పాయాలు దెబ్బతినవు. కరక్టయిన షాంపును, కండిషనర్, మాస్కు, సెరమ్స్ ను ఎంచుకోవాలి.  అప్పుడు మీ జుట్టు ఎంతో అందంగా తయారవుతుంది. అయితే చాలామందికి శిరోజాలకు తాము మంచి ప్రాడక్టు వాడుతున్నామా లేదా అన్నది కూడా తెలియదు. జుట్టును ఆరోగ్యంగా, ఎక్కువ కేర్ తో పదిలంగా చూసుకోవాలి. అప్పుడు మీ వెంట్రుకలు సిల్కీగా, ఆరోగ్యంగా తయారవుతాయి. జుట్టు మురికిగా, జిడ్డుగా ఉందని గుర్తించిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. తరచూ వెంట్రులకను రుద్దుకుంటుంటే మైల్డ్ షాంపును మాత్రమే ఉపయోగించాలి. అలాగే జుట్టును కిందికి వదిలేయకుండా జడలుగా అల్లుకోవాలి. వెంట్రుకలను చిక్కు లేకుండా దువ్వుకోవాలి. నిత్యం స్టైలింగ్ ప్రాడక్టుకలను వెంట్రుకలపై ఉపయోగించడం కూడా మంచిది కాదు. ఇవి వెంట్రుకలను తొందరగా బలహీనం చేస్తాయి. వారానికి ఒకసారి తల రుద్దుకోవడం మంచిది. జిడ్డు వెంట్రుకలు ఉండే వారు ఎప్పడూ డ్రై షాపుంను దగ్గర ఉంచుకోవాలి. తలంటు పోసుకున్న తర్వాత జుట్టు చిక్కు తీసుకోవడానికి పళ్లు వెంబగా ఉండే దువ్వెన్నను మాత్రమే ఉపయోగించాలి.

Manicures

    సూర్యరశ్మి శిరోజాలకు తగలకుండా సంరక్షించడంతో పాటు క్లోరిన్ వాటర్ వెంట్రుకలకు తగలకుండా స్విమ్మింగ్ క్యాప్ లేదా టోపీ తప్పనిసరిగా పెట్టుకోవాలి.  మాడును మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా అయి వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. టైట్ హెయిర్ స్టైల్ వేసుకోవద్దు. అలా చేస్తే జుట్టు దెబ్బతినడంతో పాటు వెంట్రుకలు బాగా చిట్లుతాయి.  నాణ్యమైన మెనిక్యూర్ ని తప్పనిసరిగా చేయించుకోవాలి.  ఇందుకోసం సెలూన్ కు వెళ్లనవసరం లేకుండానే మనమే ఈ పని చేసుకోవచ్చు. గోళ్లను చక్కగా ట్రిమ్ చేసుకోవడంతో పాటు అవి సరైన షేపప్ లో ఉండేలా జాగ్రత్తపడాలి. అందమైన చేతివేళ్లతో ఉండేవారు చూడడానికి మరింత చూడముచ్చటగా ఉంటారని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు.  మీ సైజుకు అనుగుణమైన వస్తాలను ధరించాలి. బిగుతైన వస్త్రాలు, లేదా బాగా వదులుగా ఉన్న వస్త్రాలను అస్సలు వేసుకోవద్దు. ఫ్యాషన్ దుస్తుల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం భయపడొద్దు.  సరిగ్గా ఫిట్ గా ఉన్న బట్టలు వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. మీ స్టైల్ కి అనుగుణమైన స్టైలిష్ దుస్తులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.  ఆ వస్త్రాలను ధరించినపుడు మీకు సుఖంగా అది ఉందా, మోడరన్ గా కనిపిస్తోందా? ప్రెప్పీగా ఉందా అనేది కూడా గమనించుకోవాలి. మీ శరీర రూపురేఖలకు అనుగుణంగా మీ బట్టల ఎంపిక ఉండాలని మరవొద్దు.  

  అలాగే మీ అందమైన  ముఖాన్ని సింపుల్ మేకప్ తో బ్రైట్ గా చేసుకుంటే మరింత అందంగా ఉంటారంటున్నారు బ్యూటీ నిపుణులు.  తరచూ స్క్రబ్బింగ్ చేసుకోవడం ద్వారా పెదవులను మృదువుగా ఉంచుకోవాలి. చూడంగానే కనిపించే పెదవుల అందం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు పెదవులను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. 

మీ దంతాలు తళ తళ లాడుతూ కనిపించాలి. అవి పరిశుభ్రంగా ఉండాలి. చిరునవ్వు మాటున మెరిసే దంతాల మెరుపులు మన రూపుకే అందాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాదు మీ చిరునవ్వు మీరెంత స్నేహపాత్రులో అందరికీ తెలియ చెపుతుంది. అంతేకాదు చాలా సమయాలలో పెదవులపై విరిసే చిరునవ్వు ఎందరినో ఇట్టే ఆకట్టుకుంటుంది.       

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News