కదలిక మరియు నడవలేకపోతున్న 18 నెలల శిశువుకి న్యూరోమానిటరింగ్ని ఉపయోగించి సంక్లిష్టమైన తలకి వెన్నెముకకి మధ్యలో మెడ మీద ఉన్న కణితిని తొలగించి శిశువు నడిచేటట్లు చేసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
చిన్న పాపకు పెద్ద కష్టం..
బిడ్డ ఒకటే ఏడుస్తోంది, నడవలేకపోతోంది కూడా. తల తిప్పలేదు. ఆఖరికి ఊపిరి తీసుకోవటంలో కూడా ఆ బిడ్డ పడే పాట్లు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు కారిపోతాయి.. అలాంటిది ఆ బిడ్డ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి.
అయ్యో పాపం..
చివరికి బిడ్డ తినటం కూడా మానేసే స్థాయికి రావటంతో ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం వారికి రొటీన్ గా మారింది. ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ఆసుపత్రి గడపలన్నీ తొక్కినా ప్రయోజనం లేకపోయింది. ఆఖరుకి కణతి ఉందని గుర్తించినా 22 నెలల బిడ్డకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు రెడీగా లేకపోవటంతో సమస్య ముదిరి శిశువుకు నరకయాతన చూపింది.
అద్భుతం చేసిన మెడికవర్..
అదిగో అప్పుడే వారికి ఆపన్న హస్తం అందించింది మెడికవర్ హాస్పిటల్. మెడికవర్ ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరోస్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాపకు చికిత్స చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చి, సాధారణ శిశువుగా మార్చటంలో విజయవంతమయ్యారు. ఆ ప్రస్థానమంతా మీకోసం..
వెన్నెముక నుండి తలకు మధ్యలో సుమారు ఐదు నుండి ఆరు సెంటీమీటర్ల దూరంలో ఉన్న C1-C2 నుండి T2-T3 వరకు విస్తరించి ఉన్న కణితి కారణంగా 18 నెలల శిశువు గత ఎనిమిది నెలలుగా ఏడవడం, తల తిప్పకపోవడం, తీవ్రమైన కాలు నొప్పి, నడవలేని స్థితి, శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంది. మొదట తల్లితండ్రులు మీద పట్టేసిందేమో అని భావించడం తర్వాత రోజులు గడిచే కొద్దిగా శిశువు తీవ్రంగా ఏడవడం, ఏమి తినకపోవడంతో చాలా హాస్పిటల్స్ సంప్రదించారు. క్లిష్టమైన మెడ భాగంలో కణితి ఉన్నది అని గుర్తించారు. తల్లి తండ్రులు ఇతర హాస్పిటల్స్, డాక్టర్స్ ని సంప్రదించినా అతి చిన్న వయసు ( 22 నెలల) కారణంగా చాలా మంది శస్త్రచికిత్స నిర్వహించడానికి ముందుకు రాలేదు. అప్పుడు వారు మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోస్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించారు. డాక్టర్ శిశువుకి తగిన MRI స్కాన్ నిర్వహించి నడవలేని స్థితికి కారణం C1-C2 నుండి T2-T3 వరకు విస్తరించి ఉన్న కణితి అని నిర్దారించారు. ఇది క్లిష్టమైన ప్రదేశంలో ఉండటంతో పాటు ఖచ్చితత్వంతో కూడుకున్నది. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి శిశువు కణితి ప్రదేశం, పరిస్థితి వివరించి వారు ఆపరేషన్ చేసేందుకు అంగీకరించారు.
న్యూరోమానిటరింగ్ తో..
ఈ సర్జరీ న్యూరోమానిటరింగ్ పద్ధతులను ఉపయోగించి కణితిని పూర్తిగా తొలగించేలా శస్త్ర చికిత్సను నిశితంగా ప్లాన్ చేసి చేశారు. శస్త్రచికిత్స జరిగిన రెండవ రోజు నుంచే శిశువు పరిస్థితి మెరుగుపడటమే కాదు వారంలోనే 60-70% మెరుగైంది. ఇప్పుడు శిశువు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండటమే కాదు నడవగలుగుతుంది కూడా. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేకుండాపోయాయి.
ఐఓఎన్ఎంయూతో అద్భుతం చేసిన డాక్టర్..
సామాన్యులకు సైతం ఈ ట్రీట్మెంట్ అర్థమయ్యేలా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వివరించారు, ఆయన మాటల్లోనే చెప్పాలంటే..” న్యూరోమోనిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో ఫిజియోలాజికల్ మానిటరింగ్ (IONM) లేదా న్యూరల్ మానిటరింగ్ అని కూడా పిలుస్తారు, ఇది శస్త్రచికిత్స సమయంలో మెదడు, మెదడు వ్యవస్థ, వెన్నుపాము లేదా నరాలను పర్యవేక్షించడానికి ఉపయోగించే అతి తక్కువ హానికర ప్రక్రియ. న్యూరో మానిటరింగ్ యొక్క లక్ష్యం శస్త్రచికిత్స సమయంలో నాడీ వ్యవస్థకు కలిగే నష్టాన్ని ముందుగా గుర్తించడం, సర్జన్ కి, అనస్థీషియాలజిస్ట్ కి హెచ్చరించడం ద్వారా వారు జాగ్రత్తపడతారన్నమాట. చిన్న పిల్లలపై అటువంటి సున్నితమైన ప్రక్రియను నిర్వహించడం ఎంతో అనుభవం, స్పష్టమైన ప్రణాళికతో కూడిన చికిత్స, అంతేకాదు దీర్ఘకాలిక సమస్యలను నివారించడంలో ఇది చాలా ముఖ్యమైనది”.
మా పాప ప్రాణాలు నిలిపిన అందుబాటులోని అత్యాధునిక చికిత్స
శిశువు తల్లి తండ్రులు మాట్లాడుతూ.. “అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు, అనుభజ్ఞులైన డాక్టర్స్ కలిగిన మెడికవర్ హాస్పిటల్స్ వల్లనే మేము ఈ రోజు సంతోషంగా ఉన్నాము, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు” అని చెప్పి, హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తమ బిడ్డి ఇతర బిడ్డల్లాగే సురక్షితంగా, సాధారణ జీవితాన్ని బతకగలదని ఉత్సాహంతో, ఆనందంతో తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మెడికవర్ కు రుణపడి ఉంటామని చెబుతుండటం విశేషం.