Friday, September 20, 2024
Homeహెల్త్Obesity: ఇవి బరువును కరిగిస్తాయి

Obesity: ఇవి బరువును కరిగిస్తాయి

బరువును తగ్గించే బూస్టర్ మెంతి
వెయిట్ లాస్ కు మెంతి బాగా పనిచేస్తుంది. దాంతో వండే ఆహారపదార్థాలు తినడం వల్ల శరీర బరువు తగ్గుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. మెంతులు, మెంతాకును వైట్ లాస్ డైట్ లో చేర్చడం వల్ల బరువును తగ్గించే బూస్టర్లుగా అవి పనిచేస్తాయంటున్నారు. మెంతాకులు, మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా చెప్తున్నారు. అలాంటి మెంతులు, మెంతాకును డైట్ లో రకరకాలుగా చేర్చవచ్చని డైటీషియన్లు చెప్తున్నారు.

- Advertisement -

మెంతిలో పోషక విలువలు బాగా ఉన్నాయి కాబట్టి దీన్ని డైట్ లో భాగం చేయడం వల్ల పొందే లాభాలు కూడా ఎక్కువేనని చెప్తున్నారు. ఎన్నో రెసిపీలలో వీటిని వాడొచ్చంటున్నారు. మెంతుల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆకలిని తగ్గించడమే కాదు కడుపు నిండుగా ఉండేట్టు చేస్తాయి. ఫలితంగా చిరుతిళ్ల జోలికి పోము. బరువు కూడా బాగా తగ్గుతాయంటున్నారు డైటీషియన్లు. బ్లడ్ షుగర్ ప్రమాణాలను కూడా మెంతి బాగా నియంత్రిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదెంతో మంచిది. పైగా ఊబకాయులకు బరువు తగ్గే బలమైన ఆహారంగా కూడా డైట్ లో మెంతిని చేరుస్తున్నారు. బ్లడ్ షుగర్ లో
సంభవించే అసమతుల్యత వల్ల సమయం కాని సమయంలో క్రేవింగ్స్ బారిన పడుతుంటాం. దీనికి మెంతి మంచి మెడిసెన్ అంటున్నారు పోషకాహార నిపుణులు.

మెంతిలో ఐరన్ తో పాటు పలు రకాల ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరారోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. మెంతి టీ ఉదయంపూట తాగితే అది బరువు తగ్గడానికి ఎంతగానో
ఉపయోగపడుతుందని డైటీషియన్లు చెపుతున్నారు. ఉదయం పూట దీన్ని తాగడం వల్ల శరీరంపై డిటాక్సింగ్ ఎఫెక్టు చూపుతుందని చెపుతున్నారు. డైట్ తీసుకుంటున్న వాళ్లకే కాదు డయాబెటిస్ వాళ్లకు కూడా మెంతి టీ ఎంతో మంచిది. మెంతినీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని నీటిలో వేసి ఉడకబెట్టకుండా ఇంట్లో వాటిని నానబెట్టి కొన్ని రకాల మసాలాద్రవ్యాలు కూడా అందులో కలుపుతారు. ఈ మెంతి డ్రింకు కూడా ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.

ఎంతో ఫేమస్ అయిన గుజరాతీ సాంప్రదాయ వంటకం థెప్లా కూడా చాలా మంచిది. ఇది ఆరో కరమైన రెసిపీ కూడా. థెప్లాలు మెంతి పరాటాల్లాగ ఉంటాయి. ఇవి తింటే ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైనవి కూడా. వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లేదా స్నాక్ లా కూడా తినొచ్చు. మిగతా ఆకుకూరలకు మల్లేనే మెంతాకుతో కూడా రకరకాల సబ్జీలు వండొచ్చు. ఇవి ఆరోగ్యానికి, బరువు
తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. అయితే వీటిల్లో నూనె, మలై, నెయ్యి, వెన్న, కాలరీలు ఉండే పదార్థాల వాడకం తగ్గిస్తే వెయిట్ లాస్ డైట్ గా తినొచ్చని చెపుతున్నారు పోషకాహార నిపుణులు. ఉదాహరణకు మెంతితో చేసే లసూనీ మేతీ కూడా బరువు తగ్గడానికి ఎంతో మంచిదంటున్నారు. ఇవే కాకుండా ఇతర రకాల రెసిపీల్లో కూడా మెంతిని వాడతారని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ఉదాహరణకు ఇడ్లీలు, బుర్జీలు, చోలె, పులావ్ వంటి వాటిల్లో మెంతిని బాగా వాడతారు. కొందరైతే రకరకాల చికెన్ వంటకాలను కూడా మెంతి ఆకు వేసి వండుతారు. వీటిల్లో మెంతాకును చేర్చడం వల్ల రెసిపీ ఎంతో రుచిగా ఉండడంతోపాటు మరెంతో మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందంటున్నారు న్యూట్రిషనిస్టులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News