Friday, November 22, 2024
Homeహెల్త్Oranges: కమలాపండు తొక్కలతో మెరిసే మేనిఛాయ

Oranges: కమలాపండు తొక్కలతో మెరిసే మేనిఛాయ

ముఖంపైన కమలా పళ్లు తొక్కల పొడిని అప్లై చేస్తే చర్మం పట్టులా మెరిస్తుంది. చర్మం అలా కాంతివంతంగా మారడానికి ఈ పళ్లల్లో ఉన్న అధికపోషకాలే కారణం. వీటి వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఈ పళ్ల తొక్కలతో ముఖాన్ని రుద్దుకుంటే పొందే లాభాలు కూడా చాలా ఉన్నాయి. ముఖంపై ఏర్పడ్డ మచ్చలను పోగొట్టడానికి కమలాపళ్ల తొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. కమలాపండు తొక్కల పొడిలో కాస్త నిమ్మరసం, ఒక టీస్పూను శాండల్ వుడ్ పొడి, సాధారణ నీళ్లు లేదా రోజ్ వాటర్ ని కొద్దిగా కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఒక టేబుల్ స్పూను కమలాపండు తొక్కల పొడిని పేస్టులా చేసి అందులో ఒక టేబుల్ స్పూను ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ లను చేర్చాలి. చర్మంపై ట్యానింగ్ సమస్య తలెత్తుతుందని భయపడేవాళ్లు కమలాపండుతొక్కల పొడి వాడితే మంచి ఫలితం చూస్తారు. ఒక టీస్పూను తేనె, చిటికెడు పసుపు తీసుకుని కమలాపండు తొక్కల పౌడర్ లో వాటిని కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును చర్మంపై టాన్ ఉన్న చోట రాయాలి.

- Advertisement -

కమలాపండు తొక్కల పొడి వల్ల చర్మం కాంప్లెక్షన్ పెరుగుతుంది. కమలాపండు తొక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాదు కమలాపండు తొక్కల పొడిని ఎక్స్ ఫొయిలేటర్ గా కూడా వాడొచ్చు. ఇది ముఖాన్ని క్లీన్సింగ్ చేయడంతోపాటు యాక్నే రాకుండా నిరోధిస్తుంది. అందుకే కమలాపండు తొక్కల పొడిని మీరు నిత్యం చేసుకునే స్కిన్ కేర్ రొటీన్ లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అయితే చర్మంపై ఏది అప్లై చేసుకోవాలనుకున్నా ఒకసారి
తప్పనిసరిగా ప్యాచ్ టెస్టు చేసుకోవాలని మరవొద్దు. ఎందుకంటే భిన్నమైన చర్మ స్వభావాలపై నిమ్మ వంటి ఎసిడిక్ పదార్థాలు పడవు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News