Friday, November 22, 2024
Homeహెల్త్Pepper super: మిరియాలతో మిరకిల్స్

Pepper super: మిరియాలతో మిరకిల్స్

అందుకే దీన్ని 'బ్లాక్ గోల్డ్' 'కింగ్ ఆఫ్ స్పైసెస్' అంటారు

మిరియాలతో మంచెంతో..

- Advertisement -

మిరియాల ఘాటుకు అలవాటు పడిన వాళ్లు ఆ ఫ్లేవర్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. అందులోనూ చలికాలంలో మిరియాలను మనం తినే ఫుడ్ ఐటమ్స్ కు చేరిస్తే మనకు చేకూరే ఆరోగ్యం కూడా ఎంతోనంటున్నారు పోషకాహారనిపుణులు. మిరియాల్లో ఎన్నో పోషకపదార్థాలు ఉన్నాయి. చలికాలంలో మిరియాల వాడకం వల్ల మనం పొందే లాభాలు సైతం ఎన్నో ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మిరియాల్లో యాంటిబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రత్యకత వల్ల నల్ల మిరియాలతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేగంగా తగ్గుతాయి. అంతేకాదు ఫ్లూ జ్వరం తగ్గుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. మ్యూకస్ నల్ల మిరియాలు వల్ల మ్యూకస్ పలచబడి ఛాతీ నొక్కేసినట్టుండం తగ్గుతుంది. అలా శీతాకాలంలో మన ప్రాణాలను సైతం ఇవి కాపాడతాయంటున్నారు వైద్య నిపుణులు కూడా.

నల్లమిరియాలు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ఈ మిరియాల్లో పైపరైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుందని పోషకాహారనిపుణులు చెపుతున్నారు. శీతాకాలంలో చాలామంది కండరాల నొప్పులతో బాధపడుతుంటారు. ముఖ్యంగా నల్లమిరియాలు ఆర్తైటిస్ వల్ల తలెత్తే కీళ్ల నొప్పులను ఎంతో సమర్థవంతంగా తగ్గిస్తాయి. నల్లమిరియాలను నిత్యం ఉపయోగించడం వల్ల జీర్ణశక్తి కూడా బాగుంటుంది. మలబద్దకం కొన్ని రకాల కాన్సర్లకు కారణమవుతుంటుంది. అలాంటి మలబద్దకం సమస్యను మిరియాలు ఎంతో శక్తివంతంగా తగ్గిస్తాయి. నిత్యం మీరు తినే ఆహారంలో కొద్దిగా మిరియాల పొడిని జోడించడం వల్ల మలబద్దకం సమస్య బాగా తగ్గుతుంది. నల్లమిరియాల్లో ఫైటోన్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. ఇవి శరీరంలో అదనంగా ఉన్న ఫ్యాట్ ను కరిగిస్తాయి. అందుకే చలికాలంలో ఎంతో లేజీగా ఉండే మన శరీరాలకు మిరియాలు ఇచ్చే ఉత్రేరకత ఎంతో. శరీరానికి ఎంతో సాంత్వనతో పాటు వేడినందించే మసాలా దినుసు కూడా మిరియాలు. గుండె ఆరోగ్యానికి మిరియాలు సహకరించడమే కాదు శరీర బరువును తగ్గించడంలో కూడా మిరియాల పాత్ర ఎంతో కీలకమైందంటున్నారు ఊబకాయనిపుణులు. మిరియాల్లోని పైపరైన్ సబ్సెస్టెన్స్ వల్ల బరువు తగ్గుతారు.

నల్లమిరియాలు శరీరాన్ని ఎంతో శక్తివంతంగా పనిచేసి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. ఈ మసాలా దినుసు శరీరంలో డిటాక్సిఫికేషన్ ఎంజైములను పెంచుతుంది. మన డిఎన్ఎ దెబ్బతినకుండా పరిరక్షిస్తుంది. మిరియాల్లో దాగున్న వైద్యపరమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పూర్వం వారు వీటిని నల్లబంగారం అనేవారట. శీతాకాలంలో జలుబు, దగ్గులకు సంబంధించిన అనారోగ్య సమస్యలను కూడా మిరియాలు ఎంతో శక్తివతంగా తగ్గిస్తాయి. నల్లమిరియాల్లోని పైపరైన్ పెద్దప్రేవులను, స్టొమక్ ను బాగా శుభ్రం చేస్తుంది. అంతేకాదు నల్లమిరియాలకు బెస్ట్ ఇంటర్నల్ క్లీన్సర్ అని కూడా పేరుంది. నిత్యం తీసుకునే ఆహారంలో మిరియాలు ఉండేట్టు చూసుకోవడం వల్ల మన జీర్ణాశయం ఆరోగ్యంగా పనిచేస్తుంది కూడా. మసాలాదినుసుల్లో మిరియాలకు రారాజుగా పేరు. బరువు వేగంగా తగ్గాలనుకుంటున్న వాళ్లు కూడా మిరియాలను నిత్యం ఫుడ్ ఐటమ్స్ లో ఉపయోగిస్తే మంచి ఫలితం చూస్తారంటున్నారు. పసుపుతో కలిపి
నల్లమిరియాలను తీసుకుంటే కాన్సర్ తగ్గుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.

పాలల్లో నల్లమిరియాలు, పసుపు కలిపి తీసుకుంటే కాన్సర్ బారినపడరని చెపుతున్నారు. నల్లమరియాలు తినడం వల్ల కడుపు నించి హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రవిస్తోంది. అది ఇంటస్టైన్స్ ను శుభ్రం చేస్తుంది. మలబద్దకం నుంచి కూడా మిరియాలు బయటపడేస్తాయి . నల్ల మిరియాలు పెద్ద ప్రేవు కాన్సర్, మలబద్దకం, కాన్సర్ వంటి వాటి బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాదు చర్మంపై ఏర్పడ్డ పిగ్మెంటేషన్ పోవడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. చర్మం సహజరంగును సంరక్షిస్తాయి. చిన్నతనం నుంచీ మిరియాలను బాగా వాడే వాళ్లల్లో చర్మం ముడతలు పడడం, చర్మసంబంధ సమస్యలు రావడం ఉండవు. మిరియాలు నిత్యం తినడం లేదా ఆహారపదార్థాలలో ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

యాక్నే సమస్యతో బాధపడేవారు నల్లమిరియాలను వాడడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు. మిరియాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి కూడా. నల్లమిరియాలను మెత్తగా చేసి చర్మానికి రాసుకుని చూడండి అవి చర్మంపై ఎంత మంచి ప్రభావాన్ని చూపుతాయో అర్థమవుతుంది. అంతేకాదు వెంట్రుకలను వేధించే చుండ్రు సమస్యను కూడా నల్లమిరియాలు తగ్గిస్తాయి. పెరుగులో దంచిన నల్లమిరియాలు వేసి మాడుకు పట్టించి అరగంట పాటు దాన్ని అలాగే వదిలేయాలి. ఇది జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అలాగని ఎక్కువగా మిరియాలను దంచి శిరోజాలకు రాసుకుంటే మాడు బాగా మండుతుంది. తలకు నల్లమిరియాలు పట్టించిన తర్వాత 24 గంటల పాటు షాంపుతో తలస్నానం చేయకూడదు. అలా పొరబాటున చేస్తే దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. దంచిన నల్లమిరియాలకు బత్తాయి రసం కలిపి తలకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే శిరోజాలు సిల్కీగా ఉండి మెరుస్తూ కనపడతాయి.

నల్లమిరియాలను దంచి గ్రీన్ టీలో కలుపుకుని రోజుకు రెండు లేదా మూడుసార్లు తాగితే బరువు తగ్గుతారు. నల్లమిరియాల్లోని ఫైటో న్యూట్రియంట్స్ శరీరంలోని అదనపు ఫ్యాట్ ను బ్రేక్ చేస్తాయి. నల్లమిరియాల వినియోగం వల్ల శరీర జీవక్రియ కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. గ్రీన్ టీలో మిరియాల పొడి వేసి నిత్యం భోజనం తర్వాత ఆ టీ తాగితే బరువు తగ్గుతారు. నల్లమిరియాలు డిప్రషన్ ను తగ్గిస్తాయి. మూడ్ ఎన్హాన్సర్స్ కూడా ఇవి. నల్లమిరియాల వినియోగం వల్ల శ్వాససంబంధమైన జబ్బులు కూడా తగ్గుతాయి. జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో మిరియాల పొడి వేసుకుని తాగితే పొందే శారీరక లాభం
ఎంతో. గ్లాసుడు పాలల్లో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసుకుని వేడిగా తాగితే అది ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో.

చలికాలంలో మీరు వండే ప్రతి వంటకల్లో చిటికెడు మిరియాల పొడి వేసి తినడం వల్ల పలు జబ్బులు మీ దరికి రావు. మిరియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తాగితే చెస్ట్ కంజెక్షన్ తగ్గుతుంది. గోరువెచ్చటి నీళ్లల్లో మిరియాలు, యూకలిప్టస్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి ఆవిరి పట్టుకుంటే పొందే ఉపశమనం ఎంతో. ఇలా చేయడంవల్ల ఛాతీలో ఊపిరాడనట్టుండే సమస్య ఇట్టే తగ్గుతుంది. మిరియాలను ఉపయోగించడం వల్ల చమటతో పాటు యూరిన్ కూడా శరీరం నుంచి బాగా పోయి శరీరం డిటాక్సిఫై అవుతుంది. అలా అని నల్లమిరియాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. బరువు తగ్గాలంటే శారీరక వ్యాయామాలు కూడా అంటే నడక, జాగింగ్, చిన్న వ్యాయామాల వంటివి నిత్యం చేయాలి. యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా వీటిల్లో పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిస్, ఆస్తమా, కాన్సర్, గుండె సమస్యల్లో ప్రధానంగా ఎదురయ్యేది ఇన్ఫ్లమేషన్ సమస్య.


నల్లమిరియాల్లో ఉండే పైపరైన్ పదార్థం ఇన్ఫ్లమేషన్ మీద ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. బ్రెయిన్ హెల్త్ కు కూడా నల్లమిరియాలు చాలా మంచిది. జ్నాపకశక్తి
లాంటి వాటిని బాగా పెంపొందిస్తాయి. పార్కిన్సన్, అల్జమీర్ వంటి డీజనరేషన్ సమస్యల తగ్గుదలకు కూడా నల్లమిరియాలు బాగా ఉపయోగపడతాయని వైద్యనిపుణులు చెపుతున్నారు. బ్లడ్ గ్లూకోజ్ మెటబాలిజాన్ని కూడా నల్లమిరియాలు బాగా క్రమబద్ధీకరిస్తాయి. నిత్యం నల్లమిరియాలు వాడడం వల్ల కొలెస్ట్రాల్ ప్రమాణాలు తగ్గుతాయి. అది మిరియాల్లోని పైపరైన్ వల్ల సుసాధ్యమవుతోంది.

నిత్యం మీరు తినే ఆహారపదార్థాల్లో నల్లమిరియాలను ఉపయోగించడం వల్ల గట్ హెల్త్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్ బాక్టీరియా గట్ లో ఎక్కువ అవుతుంది కూడా. అంతేకాదు ముఖ్యంగా కీళ్ల నొప్పుల బాధను పోగొడుతుంది. సెలినియం, కాల్షియం వంటి న్యూట్రియంట్లను బాగా గ్రహించడంలో కూడా నల్లమిరియాలు ఎంతగానో తోడ్పడతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News