Friday, November 22, 2024
Homeహెల్త్Pink lips: పింకీ లిప్స్ కావాలంటే..

Pink lips: పింకీ లిప్స్ కావాలంటే..

పెట్రోలియం జెల్లీ లిప్ బామ్స్ వాడొద్దు

గులాబీ రంగు పెదవులకు…

- Advertisement -

బేబీ సాఫ్ట్ లిప్స్ తో అందంగా కనిపించాలనుకుంటున్నారా? ఇందుకు సహజసిద్ధమైన టిప్స్ కొన్ని ఉన్నాయి. ఎప్పుడూ లిప్ బామ్ మీ అందుబాటులో ఉంచుకోవాలి. రోజులో మధ్య మధ్యలో దాన్ని రాసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే లిప్స్ గులాబిరంగులో ఎంతో సున్నితంగా , అందంగా కనిపిస్తాయి. పెట్రోలియం జెల్లీ లిప్ బామ్స్ వాడొద్దు. దీర్ఘకాలంలో వీటివల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సహజసిద్ధమైన గ్లిజరిన్, బాదం నూనె, విటమిన్ ఇ, కెడిలాక్ వాక్స్, బీస్ వాక్స్ వంటివి ఉన్న లిప్ బామ్స్ పెదవులకు వాడడం మంచిది.

అలాగే పెదాలకు హైడ్రేషన్ ఎల్లవేళలా అందెలా చూసుకోవాలి. పొడిబారిన పెదవులు కాంతివిహీనంగా ఉంటాయి. పెదాలకు హైడ్రేషన్ అందేలా జాగ్త్తపడడం వల్ల అవి ఏ సీజన్ లోనూ పొడిబారవు. ఇందుకు చర్మంపై పూసుకునే మాయిశ్చరైజర్లు మాత్రమే సరిపోవు. శరీరం లోపల కూడా సరిపడినంత హైడ్రేషన్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. పెదవులు మ్రుదువుగా ఉండేందుకు లిప్ స్టిక్ లేదా లిప్ గ్లోస్ వేసుకోబోయే ముందు చాప్ స్టిక్ తో గాని లేదా లిప్ బామ్ ను పెదవులకు పూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులకు లిప్ స్టిక్ రాసుకున్నా కూడా లిప్స్ కు తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది.

లిప్ సాల్వ్ లేదా లిప్ గ్లోస్ కూడా పెదాలపై అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే లిప్ స్టిక్ రాసుకునే ముందు పెదవులు తగినంత మాయిశ్చరైజర్ వాడాలన్న విషయం మరవొద్దు. లిప్ స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల పెదవులపై ఉండే మ్రుతకణాలు పోతాయి. పెదాలు మ్రుదువుగా తయారవుతాయి. షుగర్ లిప్ స్క్రైబ్ పెదవులకు ఎంతో మంచిది. పెట్రోలియం జెల్లీ లేదా మీరు వాడే లిప్ బామ్ లో కొద్దిగా పంచదార పలుకులు వేసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెదవులపై ఒక పొరగా వేయాలి. తర్వాత వృత్తాకారంలో మెత్తటి గుడ్డ లేదా కాటన్ తో పెదవులపై సున్నితంగా రుద్దాలి. అలాగే పెదాలపై ముదురు రంగు లిప్ స్టిక్స్ వేసుకోవద్దు. అలా చేయడం వల్ల పెదాలపై మొటిమలు లాగ ఏర్పడతాయి. అందుకే సాఫ్ట్, న్యూడ్ కలర్స్ ను మాత్రమే పెదాలపై పూసుకోవాలి. అలాగే మంచి బ్రాండ్ లిప్ స్టిక్స్ మాత్రమే పెదాలకు రాసుకోవాలి. ఎందుకంటే ఇష్టమొచ్చిన లిప్ స్టిక్స్ వాడడం వల్ల కొన్నింటిలో విషతుల్యమైన పదార్థాలు ఉండే అవకాశం ఉంది. అవి పెదవులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. గులాబి రంగు మ్రుదువైన పెదవులకు గులాబీ రేకులు బాగా పనికి వస్తాయి. కొన్ని రోజాపూవు రెక్కలు తీసుకుని వాటిని మెత్తగా చేసి అందులో టీస్పూను తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే గులాబీ రంగు పెదవులు మీ సొంతమవుతాయి.

ఒకవేళ పెదవులకు పిగ్మెంటేషన్ సమస్య ఉంటే ఈ మిశ్రమానికి ఒక టీ స్పూను పాల పొడిని కూడా చేరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మెత్తటి కాటన్ గుడ్డతో పెదవులను సున్నితంగా శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాటికి లిప్ బామ్ పెట్టుకోవాలి. మీ పెదవులు గులాబీ రంగులో సున్నితంగా, అందంగా కనిపించాలంటే ఈ పేస్టును నిత్యం పెదవులకు రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కాఫీ, టీలు ఎక్కువ తాగితే పెదవులు నల్లగా అవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే సూర్యరశ్మి బారిన పడకుండా ఉండాలి. సూర్యరశ్మి బారిన ఎక్కువగా పడినా పెదవులు నల్లగా తయారవుతాయి. అందుకే అతినీలలోహిత కిరణాలు పెదవులపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు ఎస్పిఎఫ్ లేదా ఇతర సన్ స్ర్కీన్స్ ఉండే లిప్ బామ్స్, లిప్ స్టిక్స్ వాడాలి. ఇలా చేయడం వల్ల పెదవులు గులాబీ రంగులో ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన డైట్ కూడా అంతే ముఖ్యం. అందుకు పళ్లు, కూరగాయలను ఎక్కువ తీసుకుంటే మంచిది. విటమిన్ సి లాంటివి పెదవులకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ ని అందించడమే కాకుండా పిగ్మెంటేషన్ తలెత్తకుండా కూడా పరిరక్షిస్తాయి. అందుకే విటమిన్లు బాగా ఉండే డైట్ తినడం చాలా అవసరం. అలాగే క్లోరినేటెడ్ నీళ్లు తాగొద్దు. ఇవి పెదవులపై పిగ్మెంటేషన్ కు కారణమవుతాయి. బత్తాయి రసం, బాదం ఆయిల్, గ్లిజరిన్, తేనె, గులాబీ రెక్కల గుజ్జు, కీరకాయరసం, అలొవిరా వంటి సహజసిద్ధమైన ఉత్పత్తులు కూడా పెదవులను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పెదవులకు తగినంత మాయిశ్చరైజర్ ని అందించడమే కాకుండా వాటిని ఎంతో ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి.  పెదవులను గులాబీరంగులో మెరిసేట్టు చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News