Saturday, November 15, 2025
Homeహెల్త్Legs pains: కాళ్ళు నొప్పెడుతున్నాయా..? కారణమిదే.!

Legs pains: కాళ్ళు నొప్పెడుతున్నాయా..? కారణమిదే.!

ఒకప్పుడు కాళ్ళ నొప్పుల సమస్య అనేది వయసు మీరిన వారిలోనే చూసేవాళ్ళం. ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా.. ఈ సమస్య బారిన పడుతున్నారు. కాళ్ళు నొప్పి పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. అది తాత్కాలిక సమస్య కావొచ్చు లేదా దీర్ఘకాలిక సమస్యే కావొచ్చు. నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంటుంది. ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేయలేనంత నొప్పి. రాత్రి పూట నిద్ర కూడా ఉండదు. ఏ పని సరిగా చేయలేము. ఎక్కువ దూరం నడలేం. ఇందుకు గల ముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కాళ్ల నొప్పులకు సాధారణ కారణాలు:

1. ఖనిజాల లోపం:

శరీరంలో కొన్ని పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లోపం వల్ల కాళ్లకు గట్టిన నొప్పులు రావచ్చు.

2. అధిక బరువు:

అధిక బరువు కూడా ఒక్కోసారి కాళ్ల నొప్పికి కారణం కావొచ్చు. బరువు ఎక్కువైతే కాళ్ల మీద ఒత్తిడి పెరగడం వల్ల నొప్పి రావచ్చు.

3. అలసట:

అధికంగా నడవడం, నిలబడడం వల్ల కాళ్ళు నొప్పిగా మారతాయి.

4. నరాల సంబంధిత సమస్యలు:

సైయాటికా (Sciatica), నరాల బిగుదల వల్ల కాళ్లకు నొప్పి, ఉబ్బరం, పుండ్లు ఏర్పడవచ్చు.

5. అత్యధిక వ్యాయామం:

ఎక్కువసేపు వ్యాయామం చేస్తే మాయోసైటిస్ (Myositis) అనబడే వాపు ఏర్పడి నొప్పి కలుగుతుంది.

6. వయస్సు పై బడటం:

వయస్సు పెరిగే కొద్దీ కాళ్ళు గట్టిపడి నొప్పి రావచ్చు.

7. రక్తప్రసరణ లోపాలు:

రక్తం సరిగా ప్రవహించకపోవడం వల్ల కాళ్లలో నొప్పి, వాపు ఉంటుంది.

8. షుగర్ / మధుమోహం:డయాబెటిస్ వల్ల నరాల మీద ప్రభావం ఉండి నొప్పి వస్తుంది.

9. ఆర్థ్రిటిస్:

మోకాళ్ళలో కలుపుల వద్ద వాపు, నొప్పి ఉంటుంది. ఇది వయోజనులలో ఎక్కువగా ఉంటుంది.

10. డీ హైడ్రేట్:

శరీరాన్ని తగిన మోతాదులో నీరు అందకపోతే కాళ్ళు గట్టిపడతాయి. అది కాళ్ల నొప్పులకు దారి తీస్తుంది.

నివారణ చిట్కాలు:

రోజూ సరిపడా నీరు తాగండి.

వ్యాయామం తర్వాత కాళ్ళకు విశ్రాంతి ఇవ్వండి.

పోషకాహారం తీసుకోండి.(దోసకాయ, పాలకూర, వేరుశెనగ, బాదం)

వేడి నీటిలో ఉప్పు వేసి కాసేపు కాళ్ళు నాన బెట్టండి.

కాళ్ళకు మసాజ్ చేయండి.

కొబ్బరినూనెతో చేస్తే ఇంకాస్త బెటర్.

గమనిక: వారం రోజులకు మించి నొప్పి ఉంటే మీరు తప్పక డాక్టర్‌ ను సంప్రదించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad