Tuesday, June 17, 2025
Homeహెల్త్Sapota Fruit: సపోటా పండు తినడం వల్ల ఇన్ని లాభాలా..

Sapota Fruit: సపోటా పండు తినడం వల్ల ఇన్ని లాభాలా..

Sapota Fruit Benefits: పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా సపోటా పండును తింటారు. సపోటా చూడడానికి గుండ్రంగా, తీపిగా, రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, సి, బి పుష్కలంగా లభిస్తాయి. సపోటాలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పండు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

సపోటా వల్ల కలిగే ఆరోగ్యలాభాలు:

సపోటాలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా జీమ్‌, వ్యాయామం చేసేవారికి ఇది మంచి ఆహారం. అలసట, నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ పండు తినగానే తక్షణ శక్తిని పొందవచ్చు. సపోటాను జ్యూస్‌, సలాడ్స్‌లో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా సపోటా పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థను మెరుగపరిచి మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది, కడుపులో మంటను తగ్గిస్తాయి.

రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సపోటా కీలక ప్రాత పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్‌లు జలుబ, దగ్గు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజుకు ఒక సపోటా పండు తినడం వల్ల ఎముకలకు ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు అందుతాయి. ఇవి ఆస్టియోపొరోసిస్ ఎముక సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కూడా ఈ సపోటా పండును తినవచ్చు. ఇది రక్తనాళాలను విశ్రాంతి చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల ఎలాంటి గుండె సంబంధి సమస్యలు బారిన పడకుండా రాకుండా చేస్తుంది. కంటి చూపు మెరుగుపరచడంలో సపోటా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఎ, ఇ, సి, యాంటీ ఆక్సిడెంట్‌ చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా సపోటాను తినవచ్చు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. క్యాన్సర్‌తో బాధపడేవారు కూడా సపోటాను తినవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ విధంగా సపోటా పండు ఆరోగ్యాని మేలు చేస్తుంది. ససోటా ఆరోగ్యకరమైన పండు అయినప్పటికి డయాబెటిస్‌ ఉన్నవారు దీని తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News