Saturday, November 15, 2025
Homeహెల్త్Effects Of Almonds: బాదం అధికంగా తింటున్నారా..అయితే బాధలు తప్పవు!

Effects Of Almonds: బాదం అధికంగా తింటున్నారా..అయితే బాధలు తప్పవు!

Side Effects Of Almonds: బాదం పప్పులు ఆరోగ్యానికి మంచివనే సంగతి తెలిసిందే. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ లాంటి అనేక పోషకాలుంటాయి. ఇవి శక్తిని ఇస్తాయి, మేధస్సు పెంచుతాయి, గుండెకు రక్షణ కలిగిస్తాయి అనే నమ్మకం ఉంది. కానీ వాటిని పరిమితంగా తీసుకుంటేనే ఇవన్నీ ఫలిస్తాయి. అవసరానికి మించి తింటే మాత్రం సమస్యలే ఎక్కువ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

- Advertisement -

బరువు పెరుగుదల..

బాదం పప్పులను రోజూ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మొదటిగా కనిపించే సమస్య బరువు పెరుగుదల. బాదం పప్పుల్లో క్యాలరీలు అధికంగా ఉండడం వల్ల వీటిని ఎక్కువగా తినేవాళ్లకు శరీరబరువు పెరుగుతుంది. ఇక వ్యాయామం చేయకపోతే ఊబకాయం వస్తుంది. దీని వల్ల డయాబెటిస్, హై బీపీ లాంటి వ్యాధులకు దారి తీయొచ్చు.

జీర్ణ సంబంధ సమస్యలు…

బాదం పప్పుల వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఎక్కువగా తీసుకుంటే ఫైబర్ పరిమాణం అధికమై మలబద్దకం, గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరికి జీర్ణశక్తి బలహీనంగా ఉంటే తక్కువ మోతాదులోనే ఇవి ప్రభావితం చేస్తాయి. గ్యాసు సమస్య ఎక్కువగా ఉండే వారికి బాదం పప్పులు జీర్ణమవ్వడం కష్టమవుతుంది.

అలర్జీలు తలెత్తడం మరో పెద్ద ఇబ్బంది. బాదం పప్పులపై అలర్జీ ఉన్నవారిలో దద్దుర్లు, పెదవులు ఉబ్బటం, గొంతులో గరగర, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపించొచ్చు. ఇది ఒక్కసారిగా తీవ్రమైతే అనాఫైలాక్సిస్ అనే అత్యవసర స్థితికి చేరవచ్చు. అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి.

అధికంగా తినడం ప్రమాదం

బాదం పప్పుల్లో ఉండే ”విటమిన్ ఈ” మంచి యాంటీఆక్సిడెంట్. కానీ దీన్ని అధికంగా తీసుకుంటే ఓవర్‌డోస్ అవుతుంది. ఇది వికారం, తల తిరగడం, బీపీ తగ్గిపోవడం లాంటి పరిణామాలకు దారి తీయొచ్చు. ఇతర పోషకాలతో కలిపి తీసుకుంటే అజీర్తికి దారి తీస్తుంది. ముఖ్యంగా విటమిన్ సప్లిమెంట్లతో కలిపి బాదం పప్పులను అధికంగా తినడం ప్రమాదకరం.

అంతేకాదు, బాదాల్లో బాడీకి అవసరమైన పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియలో సహాయపడతాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే కడుపులో గందరగోళం, మంట, గ్యాస్‌ లాంటి సమస్యలు కనిపిస్తాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి ఈ సమస్యలు త్వరగా వస్తాయి.

Also Read: https://teluguprabha.net/health-fitness/ultra-processed-foods-may-be-as-addictive-as-alcohol-and-drugs/

బాదం పప్పుల్లో బయోఅవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో పోషకాలు త్వరగా శరీరంలోకి వెళ్తాయి. అయితే అదే సమయంలో కొన్ని న్యూట్రియెంట్స్ మితిమీరి శరీరంలో పేరుకుపోతే టాక్సిక్ ప్రభావాలు చూపుతాయి. దీర్ఘకాలంగా ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

చిన్న సమస్యలే కాదు, బాదం పప్పులు కొన్ని మందులతో కలిసి పనిచేయకుండా చేస్తూ డ్రగ్ ఇంటరాక్షన్‌కు దారితీయొచ్చు. బీపీ, డయాబెటిస్ లేదా గుండె సంబంధిత మందులు తీసుకుంటున్నవారు బాదం పప్పులు ఎక్కువగా తింటే మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు లేదా ఎఫెక్ట్ మారిపోవచ్చు. ఇది శరీరానికి హానికరం.

అలాగే బాదం పప్పుల మోతాదును అధిగమిస్తే ఒరల్ అలర్జీ సిండ్రోమ్ అనే స్థితి వస్తుంది. నోటి భాగాల్లో దురద, చర్మంపై దద్దుర్లు, కంటిచుట్టూ వాపు వంటి లక్షణాలు కనిపించొచ్చు. దీనివల్ల భోజనం చేసిన వెంటనే అసౌకర్యంగా అనిపిస్తుంది.అసలు బాదం పప్పుల వల్ల ఇంత ప్రభావం ఎందుకు వస్తుంది అనుకుంటే, బాదాల్లో ఉన్న పోషకాలు ఇతర ఖనిజాలతో కలిపినప్పుడు శరీరంలో అసమతుల్యతకు దారి తీయొచ్చు. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలతో కలిసినప్పుడు కొన్ని పోషకాల శోషణ తక్కువ అవుతుంది.

Also Read: https://teluguprabha.net/health-fitness/cinnamon-helps-relieve-period-pain-and-hormone-imbalance/

బాధలు తలెత్తే మరో ముఖ్యమైన కారణం చేదు బాదాలు. ఇవి సాధారణంగా తినే బాదాల్లా కాకుండా ఎమిగడ్లిన్ అనే రసాయనాన్ని కలిగి ఉంటాయి. ఇది శరీరంలో సైనైడ్‌గా మారి విషపూరిత ప్రభావం చూపుతుంది. అందుకే ఇవి సాధారణంగా తినడానికి ఉపయోగించరు కానీ కొంతమందికి తేడా తెలియక పొతే ప్రమాదం తప్పదు.

సాధారణంగా రోజుకు 8 నుంచి 10 బాదాలు తినడమే సురక్షితంగా భావిస్తారు. 15 పైగా తినడం ప్రారంభిస్తే, ముందు చెప్పిన ఆరోగ్య సమస్యలకు ఆస్కారం ఉంటుంది. అయితే ఇది కూడా వ్యక్తుల శరీర నిర్మాణం, జీవనశైలి, జీర్ణ శక్తి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad