Tuesday, September 17, 2024
Homeహెల్త్Simple health tips: ఆరోగ్య చిట్కాలు

Simple health tips: ఆరోగ్య చిట్కాలు

 స్పూనుడు గసగసాలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది.

- Advertisement -

 బరువు తగ్గాలంటే ద్రాక్షరసం, అనాసరసం, టొమాటోరసం, జామ, అవకడో రసాలు ఏవైనా సరే తాగితే మంచి ఫలితం ఉంటుంది.

 ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్లు సున్నపు తేటను కలిపి ఉదయంపూట తాగితే మూడురోజుల్లో నడుం నొప్పి తగ్గుతుందని ఆయుర్వేదనిపుణులు చెప్తున్నారు. ఖర్జూరం పండు తిని వేడి నీళ్లు తాగితే కూడా నడుం నొప్పి తగ్గుతుందిట.

 దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు వేడినీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

 ఉసిరికాయను నిత్యం తింటే వెంట్రుకలు నల్లగా నిగ నిగలాడుతుంటాయి.

 చిన్న పిల్లలకు జలుబు వెంటనే తగ్గాలంటే తమలపాకులను బాగా నలిపి ఆ వచ్చే రసంలో కొద్దిగా తేనె వేసి పిల్లల చేత నాకించాలి

 ఎంతకూ తగ్గని పుండుపై సీతాఫలం ఆకులు పేస్టులా నూరి కట్టుకడితే వారం రోజుల్లో ఆ పుండు తగ్గుతుంది.

 ఇంగువ, హారతి కర్పూరం సమానంగా తీసుకుని కంది గింజంత ఉండలు చేసుకుని రోజుకో ఉండ నోట్లో వేసుకుంటే ఉబ్బసం, ఆయాసం, గుండెదడ తగ్గుతాయి.

 వేరుశెనగనూనెతో శరీరానికి మసాజ్ చేసుకుంటే ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.

 సెగ గడ్డలు వస్తే బియ్యప్పిండి ఉడకబెట్టి దాన్ని కొద్దిగా సెగగడ్డపై వేసి కట్టుకడితే సెగగడ్డ చితికిపోతుంది.

 కొబ్బరినూనెలో హారతికర్పూరం పొడిచేసి కలిపి రాస్తే దద్దుర్లు, దురద తగ్గుతాయి.

 రోజూ ఉదయమే గ్లాసుడు నీళ్లల్లో అరచెక్క నిమ్మకాయ పిండి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే బరువు తగ్గుతారు.

 గంధం చెక్క అరగదీసి ఆ పేస్టును వాపుల మీద రాస్తే వాపులు త్వరగా తగ్గుతాయి.

 కరక్కాయ ముక్కను నోట్లో బుగ్గన పెట్టుకుంటే పొడిదగ్గు నుంచి ఉపశమనం పొందుతాం.

 ఆముదాన్ని అరికాళ్లకు రాసుకుంటే ఎంతో మంచిది.

 వేలు తెగిన చోట వెల్లుల్లి రసాన్ని రాస్తే అక్కడ బాక్టీరియా చేరదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News