Sunday, September 8, 2024
Homeహెల్త్Skin care made easy: ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి..

Skin care made easy: ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి..

చర్మం కాంతివంతంగా కనిపించాలంటే కొన్ని సహజసిద్ధమైన టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే…

- Advertisement -

 రోజూ రన్నింగ్, జాగింగ్ చేయాలి. సూర్య నమస్కారాలు చేస్తే కూడా మంచిది. వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి చెమట బాగా పడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చెమట వల్ల శరీరారోగ్యంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామాలు చేసిన తర్వాత చల్లటి నీళ్లతో స్నానం చేస్తే చెమట రూపంలో చర్మానికి అంటుకుని ఉన్న మలినాలన్నీ పోయి శరీరం శుభ్రంగా ఉంటుంది.

 యోగా కూడా చర్మ కాంతిని పెంచుతుంది. శరీరాన్ని హెల్దీగా ఉంచుతుంది. బ్రీదింగ్ ఎక్సర్ సైజు చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఊపిరి బయటకు వదిలినపుడు శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోతాయి. శ్వాస సంబంధ వ్యాయామాలు శరీరాన్ని కూడా పరిశుభ్రం చేస్తాయి. చర్మానికి కూడా కొత్త శక్తిని ఇస్తాయి. దీంతో చర్మం ఎంతో కాంతివంతగా ఉంటుంది.

 శరీర చర్మం తీరును బట్టి ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

 తీసుకునే ఆహారం తాజాగా ఉండాలి. జ్యూసులు వంటివి చర్మ కాంతిని ఇనుమడింపచేస్తాయి. సమతులాహారం శరీరానికి, చర్మానికి మంచిది. అందుకే మీరు తీసుకునే డైట్ లో సరిపడినంత ప్రొటీన్లు, విటమిన్లు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

 సరైన టైముకు సరైన పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

 నూనెతో ముఖాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం నునుపుదేలుతుంది. ఆముదం, కొబ్బరినూనె, బాదం నూనె వంటివి చర్మాన్ని బాగా మెరిసేలా చేస్తాయి.

 నిత్యం బ్రీదింగ్ వ్యాయామాలు చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు రావు. ఒత్తిడి ఉంటే చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చి చర్మం కాంతివిహీనంగా ఉంటుంది. అందుకే ఒత్తిడిని అధిగమించడానికి ఆయుర్వేద నిపుణులు సుదర్శన క్రియా బ్రీదింగ్ టెక్నిక్ ను అనుసరించమంటారు. దీని ద్వారా శరీరంలో, మెదడులో నిండి ఉన్న ఒత్తిడి పూర్తిగా బయటకు పోతుంది. శరీరం సాంత్వన పొందుతుంది. అంతేకాదు శరీరం సామరస్యాన్ని, సమతుల్యతను కోల్పోదు.

 ధ్యానం మనసుకు, శరీరానికి ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

 నిశ్శబ్దంగా ఉండడం వల్ల కూడా శరీరం సాంత్వన పొంది చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

 కోపంగా, విషాదంగా, ఏదో కోల్పోయినట్టు ఉంటే ముఖం అందంగా ఉండదు. మెదడును, మనసును ఎల్లవేళలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుకుంటే అది మనకు ఇచ్చే అందం, ఆరోగ్యం అసమానం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం శక్తివంతమైన ఆయుధం.

 పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. ఇది ముఖానికి, చర్మానికి ఇచ్చే అందం, కాంతి ఎంతో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News