Friday, November 22, 2024
Homeహెల్త్Skin tightening: స్కిన్ టైట్ చేయాలంటే

Skin tightening: స్కిన్ టైట్ చేయాలంటే

ఆరోగ్యంగా, అందంగా..

ముఖ చర్మం బిగువుగా ఉండాలంటే..

- Advertisement -

ముఖ చర్మాన్ని బిగువుగా ఉంచే టిప్స్ కొన్ని ఉన్నాయి. ఇవి పాటిస్తే మీరు ఎంతో యంగ్ గా కనిపిస్తారు.
వీటిల్లో ఒకటి నిత్యం ముఖాన్ని మసాజ్ చేసుకోవడం. మసాజ్ వల్ల ముఖంలోని కణాల పెరుగుదల జరిగి రక్తప్రసరణ బాగా అవుతుంది. అంతేకాదు నిత్యం ముఖాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల ముఖంలో చేరిన నీరు తగ్గుతుంది. ఫలితంగా ముఖంపై గీతలు గాని, ముడతలు గానీ ఏర్పడవు. అంతేకాదు చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే మసాజ్ చేసుకోబోయే ముందు మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఫేషియల్ ఆయిల్ ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మసాజ్ మరింత బాగా అవుతుంది. కొలాజిన్ ఉండే క్రీమును వాడడం వల్ల కూడా ముఖం కాంతివంతంగా ఉంటుంది. చర్మం ఎంతో మ్రుదువుగా తయారవుతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ కొల్లాజిన్ ఉత్పత్తి తగ్గుతూవస్తుంది. అందుకే చర్మానికి కొల్లాజిన్ ఉన్న క్రీము రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దాని ఎలాస్టిసిటీ కూడా బాగుంటుంది. కొల్లాజిన్ తో తయారైన క్రీము రాసుకోవడం వల్ల చర్మం కూడా బిగువుగా ఉంటుంది. ముఖంపై ముడతలు కనిపించవు.
హైలురోనిక్ యాసిడ్ సిరమ్ వినియోగం వల్ల కణాలు పునరుద్ధరించబడతాయి. ఫలితంగా నీటితో కూడిన సుగుణాలను పొందుతాం. దీంతో చర్మం ఎన్నో గంటలపాటు తేమదనాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ముఖంపై చర్మానికి సంబంధించిన గీతలు, ముడతలు ఏర్పడవు. చర్మం ఎలాస్టిసిటీ కూడా బాగా పెరుగుతుంది. చర్మం బిగువుగా తయారవుతుంది. అంతేకాదు తేమను వెంటనే గ్రహించే గుణంతో పాటు చర్మం పొడారినట్టు అవడానికి గల కారణాన్నిసైతం శక్తివంతంగా పరిష్కరిస్తుంది.

ఆల్కహాల్ తాగే అలవాటు ఇప్పుడు చాలామందిలో చూస్తున్నాం. ఆల్కహాల్ వల్ల చర్మం పొడారినట్టు అవుతుంది. అంతేకాదు చర్మం కాంప్లెక్స్ ను కూడా డ్రింకింగ్ అలవాటు దెబ్బతీస్తుంది. దీంతో చర్మం కాంతివిహీనంగా కనిపిస్తుంది. ఫలితంగా ముసలివాళ్లల్లాగ కనిపిస్తారు. ఎంతో అలసిపోయినట్టు ఉంటారు. ఆల్కహాల్ తక్కువ తాగుతూ, నీళ్లు లేదా గ్రీన్ టీని బాగా తీసుకోవడం వల్ల చర్మం ఎంతో మెరుపులు చిందిస్తుంది. చర్మం తేమగా ఉండి పట్టులా మ్రుదువుగా కనిపిస్తూ స్కిన్ కాంప్లెక్సన్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. చక్కెర వినియోగాన్ని ఎంత తగ్గించుకుంటే అంత బాగా మీ చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా వాడడం వల్ల చర్మం బిగువుదనాన్ని కోల్పోతాం. ఫలితంగా మీ వయసుకన్నా కూడా పెద్దవారిలాగ కనిపిస్తారు. అంతేకాదు ముఖంపై నల్లటి వలయాలు ఏర్పడడంతో పాటు ముడతలు కూడా పడతాయి. అంతేకాదు దీని ఫలితంగా చర్మం పొడారినట్టు అయి వేగంగా ముసలితనం బారిన పడతారు. అందుకే ప్రొసెస్డ్ చక్కెర వాడకాన్ని ఎంత తగ్గిస్తే మీ చర్మం అంత అందంగా ఉంటుంది. దానికి తగ్గట్టు హెల్దీ డైట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే మీరు తీసుకునే ఆహారంలో నిత్యం కూరగాయలు, ఆకుకూరలు, లీన్ వంటివి బాగా ఉండేట్టు చూసుకోవాలి.

మైక్రోనీడిల్స్ తో కూడిన ఫేస్ రోలర్ ఉంది. ఇది చర్మం ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియను బాగా చేస్తుంది. దీంతో చర్మం ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది. అంతేకాదు స్కిన్ పట్టులా మిల మిల మెరిసిపోతుంది. ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నిత్యం వాడే స్కిన్ కేర్ ఉత్పత్తిని ముఖంపై , మెడ భాగంలో అప్లై చేయాలి. మెల్లగా స్కిన్ పై దాన్ని మైక్రోనీడిల్స్ ఫేస్ రోలర్ ను రోల్ చేయాలి. మీ నుదుటిపై, గడ్డపై, పెదవులపై, మెడపై, ముఖం రెండు వైపులా దీన్ని సున్నితంగా రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినదు. ముఖం చూడడానికి ఎంతో మ్రుదువుగా, మరింత అందంగా ఉంటుంది. ఫేస్ యోగా గురించి వినే ఉంటారు. ఇందులో ముఖానికి సంబంధించిన రకరకాల వ్యాయామాలు ఉంటాయి. ఇవి ముఖంలోని కండరాలను ఉత్తేజితం చేస్తాయి. చర్మాన్ని బిగువుగా చేస్తాయి. ముఖంపై వయసు భారం కనిపించనివ్వవు. అంతేకాదు కండరాలను ద్రుఢతరం చేస్తాయి. చర్మానికి రక్తప్రసరణ బాగా అయ్యేట్టు చేస్తాయి. మేకప్ ప్రీమియర్ చర్మంపై ముసుగులా బాగా ఉపయోగపడుతుది. ఇది ఫైన్ లైన్స్, ముడతలను పోగొడతుంది. చర్మం అంతా ఒకే కాంప్లెక్స్ న్ లో ఉండేలా చేస్తుంది. అంతేకాదు రోజంతా ఇది మిమ్మల్ని యంగ్ గా కనిపించేలా చేయడమే కాదు చర్మాన్ని బిగువుగా ఉండేలా సహాయపడుతుంది.

ఫేషియల్ రోలర్, మసాజ్ లు కూడా చర్మం యవ్వన మెరుపులు చిందేలా చేస్తాయి. ఫేషియల్ రోలర్ చర్మంలో రక్తప్రసరణను ఉత్తేజితం చేయడమే కాదు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అంతేకాదు ముఖం చర్మంపై ఉండే ముడతలు, ఫైన్ లైన్స్ ను కనిపించనివ్వవు. ముఖ చర్మం కూడా బిగువుగా కనిపిస్తుంది. చర్మం యవ్వన సొగసుతో మెరుస్తుంది. అంతేకాదు ఫేషియల్ రోలర్ కళ్ల క్రింద కూడా సున్నితంగా ప్రరెస్ చేస్తుంది. దీంతో కళ్ల కింద ఉబ్బినట్టు ఉన్న చర్మం సాఫీ అవుతుంది. కళ్ల కింద ఏర్పడ్డ నల్ల వలయాలు కూడా పోతాయి. మీ చర్మం యవ్వనంగా, బిగువుగా ఉండాలంటే సూర్యరశ్మి ప్రభావం మీ చర్మంపై పడకూడదు. వేసవికాలంలో లేదా చలికాలంలో లేదా వేరెప్పుడైనా సరే మీ చర్మానికి సన్ స్క్రీన్ ను తప్పనిసరిగా రాసుకోవాలి. కన్సీలర్ ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే దానివల్ల మీరు పెద్దవాళ్లల్లా కనిపించే అవకాశం లేకపోలేదు. దీనివల్ల ఫైన్ లైన్స్ తో ముఖం కనిపిస్తుంది. కళ కింద లోపలి భాగంలో దీన్ని అప్లై చేసుకోవడం ద్వారా నలుపుదనం కనిపించుకోకుండా
వేసుకోవచ్చు. కన్సీలర్ కు బదులు హైలైటర్ పెన్ బ్రష్ తో కళ్ల కింద ఉన్న వలయాలను కనిపించకుండా చేయొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News