చక్కెర ఎక్కువ తింటున్నారా? స్వీట్ క్రేవింగ్ ఉందా? అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు చర్మ నిపుణులు. చక్కెర ఎక్కువగా తినడం చర్మానికి హాని కలిగిస్తుందంటున్నారు. చక్కెర ఎక్కువ వినియోగిచడం వల్ల శరీరంలో కాలరీలు అధికంగా చేరతాయి. దీంతో బరువు పెరుగుతారు. అంతేకాదు రకరకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వాటితో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా చక్కెర వాడకం దెబ్బతీస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర ఎక్కువ తినడం వల్ల తొందరగా వయసు మీదపడినట్టు కనిపిస్తారని చెప్తున్నారు.
డైట్ అలవాట్లు కూడా చర్మ ఆరోగ్యాన్నినిర్దేశిస్తాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర రకరకాల ఆహార పదార్థాలలో ఉంటుంది. అందులోనూ యాడెడ్ షుగర్ వాడకం మరింత అనారోగ్యకరమని చర్మనిపుణులు అంటున్నారు. సహజమైన తీపి ఆరోగ్యానికి మంచిదని, కానీ యాడెడ్ షుగర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను రేపుతాయని హెచ్చరిస్తున్నారు. నేచురల్ షుగర్ అనేది పండ్లనుంచి వచ్చేది. సుక్రోజ్ సహజసిద్ధమైన పండ్లు, కాయగూరల్లో ఉండేది. ఇది సింపుల్ వాటర్ సొల్యుబుల్ కార్బోహైడ్రేట్. ఫిజికల్, మెంటల్ కార్యకలాపాలకు కావలసిన ఎనర్జీని ఇది ఇస్తుంది. చెరకులో విపరీతమైన షుగర్ ఉంటుంది. దీని నుంచి అధికస్థాయిలో చక్కెర తీస్తారు. కాఫీ, టీ, డెజర్టులలో వాడే వైట్ షుగర్ బాగా ప్రాసెస్ చేయగా తయారైన ప్రోడక్టు.
విపరీతమైన ప్రోసిసింగ్ చేయడం వల్ల ఇందులో ప్రోటీన్లు ఉండవు. అంతేకాదు దీని వినియోగం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రోసెస్డ్ ఫుడ్స్ లో, ప్యాకేజ్డ్ డ్రింక్సులో యాడెడ్ షుగర్ బాగా ఉంటుంది. అయితే ఆహారపదార్థాల నుంచి షుగర్ ని పూర్తిగా లేకుండా చేయడం అసాధ్యం కాబట్టి దాన్ని పరిమితంగా వాడితే మంచిదరి ఆహారనిపుణులు కూడా చెప్తున్నారు. విపరీతంగా చక్కెర వాడడం వల్ల అధిక బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎక్కువ షుగర్ వాడకం వల్ల రక్తనాళాల్లో నిట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అయి నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తపోటు పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
దంతక్షయం తలెత్తుతుంది. మూడ్ స్వింగ్ష్ పెరుగుతాయి. ఇవి కాకుండా అధికంగా షుగర్ వాడకం వల్ల చర్మంపై పలురకాల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎక్కువ షుగర్ వాడకం వల్ల శరీరంలో వాపు, నొప్పి సమస్యలను రేపుతుంది. చర్మంలో సెబమ్ ఉత్పత్తి (నూనె) పెరుగుతుంది. దీంతో చర్మంపై యాక్నే, మొటిమల సమస్య అధికమవుతుంది. అంతేకాదు చక్కెరలోని కొన్ని రకాల రసాయనాలు చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. ఆ రసాయనాలు చర్మంలోని మలినాలను తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో చర్మంపై గీతలు, ముడతలు ఏర్పడి చిన్నవయసులోనే ముసలితనం వచ్చే అవకాశం ఉంది. ఇంకొక సమస్య ఏమిటంటే షుగర్ ఎక్కువగా వాడడం వల్ల చర్మకణాల్లోని బ్లడ్, ఆక్సిజన్ ప్రసరణలపై దుష్ప్రభావం చూపుతుంది. దీంతో చర్మంలో హైడ్రేషన్ లోపించడంతో పాటు అది పొడిబారుతుంది. చక్కెర వాడకం ఎక్కువగా ఉంటే శరీరంపై వాపు సమస్యలు తలెత్తుతాయి. కళ్లకింద చర్మం ఉబ్బరిస్తుంది.
అలాగే చక్కెర ఎక్కువ వాడడంవల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. అంతేకాదు దీంతో చర్మానికి మెరుపును, బిగువును ఇచ్చే ప్రొటీన్లు తగ్గిపోతాయి. ఫలితంగా చర్మం మెరుపును కోల్పోతుంది. ఆరోగ్యంగా ఉండదు. సో…చక్కెర విపరీతంగా వాడకుండా పరిమితంగా వాడుతూ శరీరారోగ్యంతో పాటు మీ చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి.