Monday, May 20, 2024
Homeహెల్త్Sugar scrubs wonders: షుగర్ స్క్రబ్ ట్రై చేశారా?

Sugar scrubs wonders: షుగర్ స్క్రబ్ ట్రై చేశారా?

షుగర్, బ్రౌన్ షుగర్ స్క్రబ్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ రావు

ఇలా చేస్తే చర్మం అదరహో..

- Advertisement -

షుగర్ స్క్రబ్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వీటిని ఇంటి పట్టునే చేసుకోవచ్చుకూడా. చక్కెర పలుకులతో
చేసే స్క్రబ్ చర్మానికి మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. షుగర్ స్క్రబ్ ని చేతులతో లేదా బ్రష్ ను
ఉపయోగించి వేసుకోవచ్చు. ముఖానికి సాఫ్ట్ బ్రౌన్ షుగర్ వాడితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు.

షుగర్ స్క్రబ్ ను ముఖంపై అప్లై చేసుకునేటప్పుడు దెబ్బతిన్న చర్మంపై దానిని తప్పకుండా రాయాలి. షుగర్ స్క్రబ్ ను ముఖంపై రాసుకొని చేతి వేళ్లతో చర్మంపై సర్కులర్ మోషన్ లో తిప్పుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా స్క్రబ్ తో ఐదు లేదా పది నిమిషాలు మసాజ్ చేయాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై చేరిన మలినాలు పోయి శుభ్రంగా ఉంటుంది. చక్కెరలో అధికపాళ్లల్లో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులో దాగున్నఎక్స్ ఫోయిలేటింగ్ గుణాల కారణంగా చర్మంపై ఇది ఎంతో శక్తివంతమైన స్క్రబ్ గా పనిచేస్తుంది. ఎథనాల్, గ్లైసిరోల్, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో చక్కెరను కూడా చేరుస్తారు.

చక్కెరకు నీళ్లల్లో తొందరగా కరిగిపోయే స్వభావం ఉంటుంది. అందుకే దీన్ని ముఖానికి రాసుకున్నప్పుడు నీళ్లతో కడుక్కుంటే సులభంగా పోతుంది. అంతేకాదు చక్కెర స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఫోటోయేజింగ్ డేమేజ్ ను దీంతో తగ్గించవచ్చు.చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మం దురద తలెత్తకుండా చక్కెర నిరోధిస్తుంది. చక్కెర స్క్రబ్స్ చర్మాన్ని మలినాల నుంచి శుభ్రం చేయడమే కాకుండా ముఖానికి మంచి లిఫ్టింగ్ ఎఫెక్టు ఇస్తుందంటున్నారు బ్యూటీ నిపుణులు. కొలస్ట్రాల్ సల్ఫేట్ తో కలిపి చక్కెరను చర్మానికి రాసుకుంటే చర్మం తీరు ఎంతో బాగుంటుంది. చర్మం దెబ్బతినకుండా ఇది పరిరక్షిస్తుంది. వయసు మీద పడినప్పుడు కనిపించే చర్మం ముడతలు లాంటి లక్షణాలను ఇది తగ్గిస్తుంది. శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను కూడా షుగర్ బాడీ స్క్రబ్ పోగొడుతుంది.

చక్కెర స్క్రబ్ చర్మం టెక్స్చెర్ బాగుండేట్టు చూస్తుంది. అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం వంటి వాటి వల్ల కూడా వయసు మీదపడ్డట్టుంటాం. చిన్న వయసులోనే ముసలివాళ్లల్లా కనిపిస్తాం. చర్మంపై షుగర్ బాడీ స్క్రబ్ వాడడం వల్ల స్కిన్ పై చేరే రకరకాల విషతుల్యమైన మలినాలు పోయి మెరుపులు చిందిస్తుంది. చూడడానికి యూత్ ఫుల్ గా కనిపిస్తారు. పొడిచర్మం ఉన్నవారు బాడీ స్క్రబ్ వాడకూడదనే అపోహ చాలమందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. షుగర్ బాడీ స్క్రబ్ చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొడుతుంది. అంతేకాదు చర్మంపై ఆయిల్ ని రాస్తే కూడా స్కిన్ కు కావలసినంత మాయిశ్చరైజర్ అందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News