వాటర్‌క్రెస్ ఆకులో ఎన్నో పోషకాలతోపాటు నీరు కూడా ఉంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మాంగనీసు, ఫాస్ఫరస్, విటమిన్స్ ఎ,సి,కె, బి1, బి2లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులో చర్మం లోపలి భాగానికి ఉపయోగపడే యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి.ఇది శరీరంలోని కణాలన్నింటికీ ఖనిజాలు అందేలా చేస్తుంది. చర్మంలో ఆక్సిజినేషన్ అధికంచేస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. చర్మంపై ఏర్పడ్డ గీతలు, ముడతలను ఈ ఆకు పోగొడుతుంది. సలాడ్‌లో ఈ ఆకులు వేసుకుని తింటే చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. రోగనిరోధకశక్తిని ఇది పెంచుతుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా సహాయపడుతుంది. ఈ ఆకులోని అయొడిన్ థైరాయిడ్ సమస్యలకు కూడా ఎంతో మంచిది.
కాప్సికంలా ఉండే బెల్‌పెప్పర్‌లో కెరొటొనాయిడ్స్ అనే యాంటాక్సిడెంట్లు ఎక్కువ. ఇందులోని విటమిన్ సి కారణంగా వయసు మీద పడకుండా యంగ్‌గా కనిపిస్తారు. చర్మానికి మృదువుగా చేస్తుంది. బెల్ పెప్పర్‌తో స్నాక్ చేసుకుని తింటే ఎంతో మంచిది. సలాడ్‌లో కూడా దీన్ని వాడొచ్చు.
బొప్పాయిలో రకరకాల యాంటాక్సిడెంట్లు, విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి. ఇవి స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతాయి. ముడతలు, బొప్పాయిని తినడం వల్ల చర్మంపై ఉండే గీతలు కూడా పోతాయి. వయసు మీద పడకుండా ఇది ఎంతో సహాయపడుతుంది. చర్మంలోని మృతకణాలను పోగొడతాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయి ముక్కలను తినొచ్చు. బొప్పాయి ముక్కలతో ముఖానికి మాస్కు వేసుకోవచ్చు.
బ్లూబెర్రీస్‌లో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉన్నాయి. వయసు కనపడకుండా చేసే యాంటాక్సిడెంట్ గుణాలు వీటిల్లో పుష్కలంగా ఉన్నాయి. సూర్యరశ్మి, ఒత్తిడి, కాలుష్యం వంటి వాటి వల్ల చర్మం దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి. ఎప్పుడూ యంగ్‌గా కనపడేలా చేస్తాయి. చక్కెర తక్కువ ఉండే ఈ పండును స్మూదీలో వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. రకరకాల ఫ్రూట్ ముక్కలతో కూడా ఈ పండును కలిపి తినొచ్చు. చర్మం అందాన్ని రెట్టింపు చేసే పండు ఇది. మీ వయసు కనపడకుండా చేసే మరో ఫుడ్ బ్రొకోలీ. ఇందులో యాంటి ఏజింగ్ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో వెరైటీ యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. విటమిన్ సి ఉంది. శరీరంలో కొలెజిన్ ఉత్పత్తికి విటమిన్ సి అత్యావశ్యకం. ఇది చర్మంలోని ఎలాస్టిసిటీని పెంచుతుంది. చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి బ్రకోలీని క్విక్ స్నాక్‌గా తినొచ్చు. బ్రకోలీని కొద్దిగా ఉడకబెట్టి తింటే ఇంకా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఎన్నో లాభాలను పంచుతుంది.
పాలకూరలో నీరెక్కువ. ఇందులో విటమిన్ ఎ, సి, కె, ఇ ఉన్నాయి. మెగ్నీషియం, ఐరన్ ఉన్నాయి. ఈ ఆకులోని కొల్జేజిన్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ శిరోజాలను దృఢంగా ఉంచుతుంది. స్మూదీ, సాటెలలో పాలకూర వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. నట్స్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇవి స్కిన్ టిష్యూలను బాగుచేస్తాయి. చర్మంలో తేమను పెంచుతాయి. అతినీలలోహిత కిరణాల దుష్ర్పభావం పడకుండా ఇవి కాపాడతాయి. చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. సలాడ్ పైన నట్స్ చల్లుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యం కూడా. వాల్‌నట్స్ గుండె జబ్బుల రిస్కులో పడకుండా నిరోధిస్తాయి. బాదం పప్పులు సీనియర్ సిటిజన్స్‌లో జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి తగ్గకుండా కాపాడతాయి. అవకెడో కూడా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. యంగ్‌గా కనిపించేట్టు చేస్తాయి. ఇందులో ఇన్‌ఫ్లమేషన్‌పై పోరాటం చేసే ఫ్యాటీ యాసిడ్లు బాగా ఉన్నాయి. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచూ తినడం వల్ల మీ అసలు వయసు కనిపించకుండా యంగ్‌గా ఉంటారు. ఇందులో విటమిన్ ఎ చర్మంలోని మృతకణాలను పోగొడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఇందులోని కెరటనాయిడ్ పదార్థం మలినాలను పోగొడుతుంది. చర్మ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.