Vitamin B6 supplements: విటమిన్ బి6 సప్లిమెంట్లు ఎక్కువగా వాడడం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా మెడిసెన్స్ రెగ్యులేటర్ హెచ్చరిస్తున్నారు. థెరపిటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎబిసి రిపోర్టులో అక్కడి వైద్య నిపుణులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం ఆస్ట్రేలియాలో చేసిన ఒక శాంపిల్ సర్వేలో వెల్లడైంది. అక్కడి ఒక ప్రముఖ క్లినిక్ లో పాథాలజిస్ట్ గా పనిచేస్తున్న నిపుణుడు మాట్లాడుతూ.. ఎబిసిలోని డేటా ప్రకారం మే నెలలో చేసిన శాంపిల్స్ పరీక్షలో 4.5 శాతం మందిలో నరాల వ్యవస్థ దెబ్బతినడం వెల్లడైందని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో బి6 సప్లిమెంట్ల అధిక వినియోగం టాక్సిక్కా ? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
విటమిన్ బి6 మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇది ఆహారంలోని ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మెటబాలిజంలో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది న్యూరోట్రాన్స్ మీటర్స్ ఉత్పత్తిలో కూడా ఎంతో కీలకం. బ్రెయిన్ లోని కెమికల్ మెసెంజర్స్ మెదడు పనితీరును సరిగా నిర్వర్తించడంతో పాటు మనిషి మూడ్స్ ను క్రమబద్ధీకరిస్తాయి. అలాగే, యాంటిబాడీస్ ను తయారుచేయడం ద్వారా విటమిన్ బి 6 మన రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి సహకరిస్తుంది. పైగా యాంటిబాడీస్ మన శరీరంలోని ఇన్ఫెక్షన్లపై శక్తివంతంగా పోరాడతాయి.
Also Read: White Rice: ప్రతిరోజు వైట్ రైస్ తింటే శరీరంలో జరిగేది ఇదే..
అంతేకాకుండా హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి కూడా విటమిన్ బి6 అవసరం. ఎర్ర రక్తకణాల్లోని ఈ ప్రొటీన్ శరీరానికంతటికీ ఆక్సిజన్ ను అందిస్తుంది. కొందరు స్త్రీలు గర్భం దాల్చిన తొలినాళ్లల్లో విటమిన్ బి6 తీసుకుంటారు. గర్భం ధరించిన ప్రారంభ మాసాలలో తలెత్తే వికారం వంటి సమస్యలను తగ్గిస్తుందనే ఉద్దేశంతో విటమిన్ బి6 ను కొందరు స్త్రీలు విటమిన్ తీసుకుంటున్నారు. ప్రిమెనుస్ట్రుయల్ సిండ్రోమ్ తో బాధపడేవారు కూడా దీన్ని తీసుకుంటుంటారు. కానీ, చాలామందికి విటమిన్ బి6 సప్లిమెంట్ వాడకం అవసరం లేదు. దీని నుంచి పొందే లాభం కూడా ఉండదు. ఎందుకంటే..? బి6 విటమిన్ మనం తీసుకునే డైట్ మాసం, బ్రేక్ ఫాస్ట్, సెరెల్, పండ్లు, కూరగాయల నుంచి పుష్కలంగా అందుతుంది. పెద్దవాళ్లకు రోజుకు ఇది 1.3 నుంచి 1.7 మిల్లీగ్రాములు చాలు. కానీ, ఇప్పుడేమి జరుగుతోందంటే పలు హెల్త్ ఫుడ్ స్టోర్స్ లో, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలలో బి6 సప్లిమెంట్లు రోజుకు 5 నుంచి 200 మిల్లీగ్రాముల డోసు ఓమర్ ది కౌంటర్లలో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని పరిమితంగానే ఫార్మసీలకు అందించాలనే యోచనలో ఆస్ట్రేలియా ఉంది. రోజుకు 200 మిల్లీ గ్రాముల పవర్ కు మించిన బి6 సప్లిమెంట్లకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.
విటమిన్ బి6 అధికంగా వాడడం వల్ల రకరకాల దుష్పరిణామాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా వాడితే దాని తాలూకూ మిగులుపదార్థాలు మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దీంతో చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. విటమిన్ బి6 అధిక వాడకం వల్ల దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాంటి దుష్పరిమాణాల్లో పెరిఫరల్ న్యూరోపతి ఒకటని వైద్యులు చెప్పడమే కాదు దానిపై తీవ్ర ఆందోళనను కూడా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ బయటి నరాల వ్యవస్థ, వెన్నెముక నరాల వ్యవస్థపై ఈ దుష్ప్రభావం బాగా పడుతుంది. దీంతో నొప్పి, తిమ్మిర్లు, మొద్దుబారడం, బలహీనత లాంటి సమస్యలు చేతులు, పాదాల భాగాలలో బాగా తలెత్తుతాయని వైద్యులు చెపుతున్నారు. ఇలా ఎందుకు సంభవిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని వైద్యులు చెపుతున్నారు.
Also Read: Motion Sickness: జర్నీలో వాంతులు వస్తాయా?.. ఈ హోమ్ రెమెడీస్ పాటించాల్సిందే!
అయితే, చాలా రిపోర్టుల్లో ఎప్పుడైతే ఆ వ్యక్తులు బి6 సప్లిమెంట్ల వినియోగం ఆపేస్తున్నారో అప్పుడు ఆ లక్షణాలు కూడా శరీరంలో కనిపించడం లేదని తెలుస్తోంది. కానీ, కొంతమందికి వీటి నుంచి బయటపడడానికి దాదాపు మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు పడుతోందని తెలుస్తోంది. ఇంకొన్ని సందర్భాలలో ఎక్కువ డోసులు (రోజుకు 50 మిల్లీగ్రాములు) దీర్ఘకాలంగా వాడుతున్న వారిలో ఇవి మరింత ఆందోళనకరమైన దుష్పరిమాణాలకు కారణమవుతున్నాయని వెల్లడైంది.
1990 ఏడాదిలో చేసిన ఒక స్టడీలో 100 నుంచి 150 మిల్లీగ్రాముల హైడోసులు వాడిన వారిలో న్యూరోపతికి సంబంధించిన దుష్పరిమాణాలు తలెత్తలేదని వెల్లడైంది. కానీ, ఇటీవల చేసేన స్టడీల్లో మాత్రం హైడోసుల్లో విటమిన్ బి6 వాడుతున్న వారిలో దుష్పరిణమాలు తీవ్రంగా ఉంటున్నాయని వెల్లడైంది. 2023లో చేసిన ఒక రిపోర్టులో రకరకాల సప్లిమెంట్లు తీసుకుంటున్న వ్యక్తిలో, నిత్యం 96 విటమిన్ బి6 డోస్ వాడగా, అందులో ఆ వ్యక్తికి న్యూరోపతి సమస్య బయటపడింది. ఇంకో స్టడీలో విటమిన్ బి6 ఉన్న డ్రింకులు తాగిన వారిలో కూడా న్యూరోపతి సమస్య బయటపడింది.


