ఈ టీలు కోవిడ్ కు చెక్ పెడతాయి
కోవిడ్ వైరస్ భయం ఇంకా మనల్ని పూర్తిగా వీడలేదనే చెప్పాలి. కోవిడ్ కు సంబంధించిన వివిధ వేరియంట్లతో, సబ్ వేరియంట్లతో ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉంటున్నారు. అందులో భాగంగా కోవిడ్
ను తట్టుకునే రకరకాల వైద్య విధానాలు, వాక్సిన్లతో పాటు కోవిడ్ ను నియంత్రించే చిన్న చిన్న పద్ధతులను సైతం ప్రజలు అనుసరించడానికి ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. లేటెస్టుగా జరిగిన
ఒక పరిశోధనలో బ్లాక్ టీ, గ్రీన్ టీలు కోవిడ్ ను నిరోధించడంలో శక్తివంతంగా పనిచేస్తాయని తేలింది. ఇవి కోవిడ్ పై ఎంతో శక్తివంతంగా పనిచేసి వైరస్ ను బలహీనం చేస్తాయని జపాన్ శాస్త్రవేత్తలు తమ
అధ్యయనంలో గుర్తించారు.
కోవిడ్ వైరస్ ను బలహీనం చేసే రసాయనాలు గ్రీన్ టీ, బ్లాక్ టీల్లో కనపడడాన్ని ఈ సందర్భంగా
శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది సహజంగానే ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సార్స్ కోవిడ్2 వైరస్ కి సంబంధించిన ఒమెక్రాన్ సబ్ వేరియంట్లను శక్తివంతంగా బలహీనపరచడంలో ఈ టీలు బాగా
పనిచేస్తాయి. వైరస్ సంబంధిత ప్రొటీన్ ను నిరోధించడం ద్వారా కణాలు దెబ్బతినకుండా గ్రీన్ టీ, బ్లాక్ టీ లేదా మచ్చా లాటేలు తోడ్పడతాయి.
ముఖ్యంగా బ్లాక్ టీ, గ్రీన్ టీలు నోరు, గాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ లలో వైరస్ లోడ్ ను బాగా తగ్గిస్తాయి. ఈ టీల వల్ల ఇంకొన్ని ప్రయోజనాలు సైతం పొందుతామని చెప్తున్నారు. టీ ఆకులతో చేసిన గ్రీన్ టీ లో
విటమిన్లకు, ఖనిజాలతో పాటు యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. గ్రీన్ టీ ఆకులను మెత్తగా పొడి చేసి చేసేది మచ్చా టీ. ఇందులో ఎంతో ముఖ్యమైన యాంటాక్సిడెంట్లు, న్యూట్రియంట్ల గాఢత
బాగా ఉంటుంది. బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతుంటే లేదా ఆహారపు ట్రెండులకు అనుగుణంగా మచ్చా టీ తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు కూడా చెపుతున్నారు.
గతంలో టీలో ఉన్న ఇజిసిజి, టిఎఫ్ డిజి మాలిక్యూల్స్ కోవిడ్ ను నిరోధించడంలో ఎలా పనిచేస్తాయన్న దానిపై క్యూటో ప్రిఫెరక్చుయల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసెన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో ఆ మాలిక్యూల్స్ కోవిడ్ వైరస్ లపై ఎంత శక్తివంతంగా ప్రభావం చూపుతాయనే దానికి ఉన్న స్పష్టమైన సంబంధం తేలింది కూడా. కోవిడ్ పై పోరాడే శక్తివంతంమైన ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ , బ్లాక్ టీలతో పాటు మచ్చాగ్రీన్ టీ లు పనిచేస్తాయి. వీటి వల్ల వైరస్ సస్పెన్షన్ జరుగుతుందని నిరూపితతమైంది. అయితే బిఎ.2.75పైన మాత్రం వీటి ప్రభావం బలహీనంగా ఉందని తేలింది. అంతేకాదు గ్రీన్ టీ లేదా
బ్లాక్ టీతో చేసిన క్యాండీలను వైరస్ సోకిన వ్యక్తి తింటే కూడా అవి వైరస్ ను బలహీనం చేయొచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
వైరస్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకని వ్యక్తికి అది వ్యాప్తి అవకుండా నిరోధించడమే కాకుండా, నోటిలో, గాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ట్ లపై వైరస్ లోడ్ పడదంటున్నారు కూడా.