Dragon Fruit: మీరెప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా.. ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే మీరు కచ్చితంగా ఈ ఫ్రూట్ ను తినాలనుకుంటారు. ఈ మధ్య మార్కెట్ లో విరివిగానే దొరికేస్తోంది డ్రాగన్ ఫ్రూట్. దీనినే పితాయా అని కూడా అంటారు.డ్రాగన్ ఫ్రూట్ ఒక సూపర్ ఫ్రూట్ అనే చెప్పొచ్చు. రుచిగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు కలిగిస్తుంది. రోజూ ఒక చిన్న ముక్క చాలు, మంచి ఆరోగ్యం మీ సొంతం. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవే కాక వీటితో ఉన్న లాభాలేంటో ఇప్పడు చూద్దాం.
Dragon fruit: డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు:
1. ఇమ్యూనిటీ పెంపుకు సహాయపడుతుంది:
డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తొలగించి వ్యాధుల నుండి రక్షిస్తుంది.
2. గుండె ఆరోగ్యానికి మంచిది:
డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు, ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటి యాసిడ్లు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే కాకుండా కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
3. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:
అధిక ఫైబర్ కలిగిన ఈ పండు.. మలబద్ధకంను నివారిస్తుంది. అలాగే ఈ ఫ్రూట్ జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
4. బరువు తగ్గాడానికి:
తక్కువ కాలరీలతో ఉండే ఈ డ్రాగన్ ఫ్రూట్.. ఎక్కువ న్యూట్రిషన్ ను అందిస్తుంది. ఒక్క ఫ్రూట్ తిన్నా.. పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది, ఎక్కువ తినకుండా అడ్డుకుంటుంది.
5. కళ్లకు మంచిది:
డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే బీటా కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
6. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది:
యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అలాగే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ఈ ఫ్రూట్ సహాయపడుతుంది.
7. షుగర్ కంట్రోల్:
ది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
8. మెదడు ఆరోగ్యానికి:
డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే B విటమిన్లు మెదడు ఫంక్షన్ మెరుగుపరుస్తాయి. అలాగే నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
గమనిక:
డ్రాగన్ ఫ్రూట్ ను ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో అలర్జీలు లేదా పొత్తికడుపు అసౌకర్యం కలగవచ్చు.అలాగే కొత్తగా ట్రై చేసే వారు కొద్ది కొద్దిగా మొదలు పెట్టండి.