తెలంగాణలో చికున్‌గున్యా (Chikungunya) వ్యాప్తిపై అమెరికా హెచ్చరించింది. యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలంగాణ నుండి తిరిగి వెళుతున్న యూఎస్ ప్రయాణికులలో చికున్‌గున్యా కేసులు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించింది. దీంతో తెలంగాణ నుంచి ఆ దేశానికి వెళుతున్నవారికి సీడీసీ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దోమల ద్వారా సంక్రమించే చికున్‌గున్యా వ్యాధి తెలంగాణలో పెరుగుతుండడంతో ప్రయాణికులు జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు తగు ఆరోగ్య సూచనలు చేసింది.