Sweet Corn Benefits:
వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎక్కడపడితే అక్కడ దర్శనం ఇస్తాయి. మొక్కజొన్న తింటే రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మొక్కజొన్నను “స్వీట్ కార్న్” అని కూడా పిలుస్తారు. స్వీట్ కార్న్ లో విటమిన్లు A,B,E , యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఫైటో కెమికల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో మొక్కజొన్నను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. అయితే, ఇప్పుడు వర్షాకాలంలో మొక్కజొన్నను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వర్షాకాలంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు తమ ఆహారంలో మొక్కజొన్నను చేసుకుంటే ఎంతో మంచిది. ఇందులో ఉండే ఫైబర్ పెద్ద ప్రేగులో చిక్కుకున్న ఆహారాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అయితే ఈ స్వీట్ కార్న్ పెద్ద ప్రేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి కూడా సహాయపడుతుందని పలు ఆరోగ్య పరిశోధనలు చెబుతున్నాయి.
Also read : Vegetables: ఈ కూరగాయలు తొక్కతో పాటు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
మీరు అధిక బరువుతో బాధపడుతుంటే సులభంగా బరువు తగ్గాలనుకుంటే మొక్కజొన్న కంకును తినడం ఎంతో మంచిది. మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకుంటే అందులో ఉండే తక్కువ కేలరీల వల్ల మీకు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం అతిగా తినకుండా ఉండవచ్చు.
చాలామందికి వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొక్కజొన్న కంకును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మొక్కజొన్నలో విటమిన్లు A,B,E, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. స్వీట్ కార్న్ చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానే ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అనేక చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.


