Kiwi Fruit Bnenefits: మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. తరచుగా వీటిని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. పైగా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం కూడా! ఈ నేపథ్యంలో కివి పండు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇది సైజులో చిన్నగా ఉన్న, అనేక పోషకాలును అందిస్తుంది. చాలామంది కివి పండును తినడానికి ఇష్టపడరు. అయితే మీకు తెలుసా? కివి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో!
ఈ పండును తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలాన్ని అందుతాయి. కివిలో విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. విటమిన్ సి శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతుంది.
కివిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా దీన్ని తింటే కడుపు ఎక్కువగా నిండిన భవన కలుగుతుంది. దీంతో పదేపదే తినే అలవాటును నివారించవచ్చు. ఈ పండు జీర్ణవ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆక్టినిడిన్ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
Also Read: Fruits: ఈ పండ్లు తింటే ఇట్టే బరువు తగ్గుతారు!
కివి పండులో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కివీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి కివి పండు ఒక వరం! ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండు చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ముడతలను సైతం తగ్గిస్తుంది. ఈ పండు తినడం ద్వారా వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి.
కివి పండు మంచి నిద్రకు ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో సెరొటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు పడుకునే ముందు కివి పండు తినడం ద్వారా హాయిగా నిద్రపోతారు.


